లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“లాస్ట్ వీక్ మనం ఊరెళ్లామ్ కదా ……. అప్పుడు అందరి నుంచి collect చేసారంట ……. ”

“ఓ ……. ”

“సరే ….. కడదాం ……. ”

“సంజు …… ఎక్కడికైనా బయటకు వెళదాం రా …….. ”

నేను అలాగే చూస్తున్నాను.

“ఇది మన first new year రా …….. ”

“సరే ఎక్కడికి వెళదాం ??”

“ఏమో తెలీదు …..నువ్వే చెప్పు …… ”

“concert కి వెళదామా ??”

“concert అంటే tickets చాల costly గా ఉంటాయి ……. ”

“ఓకే ….. నీ కేమైనా ఐడియా ఉందా ??”

“honest గా చెప్పనా ??”

“చెప్పు ….. ”

“బయటకి వెళ్లి డబ్బులు వేస్ట్ చేసే బదులు ….. అపార్ట్మెంట్ లోనే సెలెబ్రేట్ చేసుకుందాం ……. ”

నన్ను అలాగే చూస్తుంది.

“last year ఇక్కడ ఎంత గ్రాండ్ గా చేశారో తెలుసా ??”

“ఓ ……. ”

“టపాసులు…….చిన్న DJ……. ఫుడ్ stalls …… అన్ని పెట్టారు …… ”

నన్ను అలాగే చూస్తుంది.

“స్వీటీ ….. నాకు తెలుసు నీ ఫీలింగ్ ఏంటో ……. trust me ……. ఇక్కడ చాలా బాగా సెలెబ్రేట్ చేస్తారు …….”

“ఓకే …… ” అని దీనంగా చూసి చెప్పింది.

“ఇది మన first new year కాబట్టి ……. 10,000 వేలు budget పెట్టుకుందాం …….. ”

“ఓకే …… ”

“1000 ఎలాగో అపార్ట్మెంట్ సొసైటీ కి ఇచ్చేస్థున్నాం కాబట్టి ఇంకా 9000 ఉంది …….. ”

“9000 thousand తో ఎం చేద్దాం ??”

“చెప్తాను ……. ఆగు …… మనం ఎలాగో రేపటికి leave పెట్టాం కాబట్టి …… ఈ రాత్రి లేట్ గా పడుకొని లేట్ గా నిద్ర లేచి brunch కి వెళదాం …… ఆ తర్వాత fair కి వెళ్లి సరదాగా టైం స్పెండ్ చేసి ….. ఈవెనింగ్ 5 కల్లా అపార్ట్మెంట్ కి వచ్చేద్దాం ……. ఆ తర్వాత రెడీ అయ్యి new year సెలెబ్రేషన్స్ చేసుకుందాం ……. ”

“fair ఆ ??”

“యా ….. exhibition …… అక్కడ ఇద్దరం giant wheel ఎక్కుదాం ….. ”

“giant wheel ఆ ??”

“yes …… ”

“సంజు ….. నాకు అవన్నీ భయం ……. ”

“ఎం పర్లేదు …… నేనున్నాగా ….. “