లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“please ……. ”

“ఓకే ….. 60 minutes ……. కానీ 60 minutes అయ్యాక నువ్వు ఇదే స్పాట్ కి మళ్ళి రావాలి ……. ఇద్దరం ఇక్కడే కలుసుకోవాలి …… ”

“ఓకే ….. ”

“నీ ఫోన్ లో స్టాప్ వాచ్ ఆన్ చేయి ……. ”

తన ఫోన్ తీసి స్టాప్ వాచ్ ఆన్ చేయబోతుండగా నేను “ఆగు ….. ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేద్దాం …… ”

“3….. 2……”

“ఆగు …… ”

“ఏమైంది ??”

“సంజు ….. మన giftలు రెండు కూడా shopping covers ఉండకూడదు …… ఎందుకంటే shop పేరు తెలిస్తే ….. గిఫ్ట్ కూడా ఏంటో తెలిసే chance కూడా ఉంది ….. ”

“good .point …….. ”

“3…… 2…… 1…… గో ….. ”

ఇద్దరికీ టైం స్టార్ట్ అయింది……. ఇద్దరం ఒక్కసారిగా రెండు దారుల్లో వెళ్లాం.

గంట తర్వాత:

ఇద్దరం మళ్ళి అదే spot కి తిరిగొచ్చం. ఇద్దరి చేతుల్లో రెండు గిఫ్ట్స్ ఉన్నాయి.

“ఇవి మనం రేపు 12 దాటే వరకు ఓపెన్ చేయకూడదు …… ”

“hmmmmm ……. ” అంది.

ఇద్దరం ఇంటికి చేరుకొని డిన్నర్ చేసుకొని తిని పడుకున్నాం.

మరుసటి రోజు:

ఇద్దరం ఒక మంచి రెస్టారెంట్ లో brunch చేసి fair కి వెళ్ళాము. అక్కడ స్వీటీతో బలవంతంగా giant wheel ఎక్కించాను. మొదట్లో భయపడిన నా చేయి గట్టిగ పట్టుకుంది. ఇలా తనతో కలిసి giant wheel ఎక్కేసరికి thrill double అయ్యింది.

ఆ తర్వాత అక్కడ కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడి snacks తిని ఇంటికి వచ్చాము. ఇద్దరం రెడీ అయ్యి అపార్ట్మెంట్ కింద new year సెలెబ్రేషన్స్ కి జాయిన్ అయ్యాము.

అక్కడ అందరితో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ సమయం గడిపాము. ఇద్దరం దూరంగా ఉన్నాసరే ప్రతి 5 నిమిషాలకు ఒకరినొకరం దూరం నుంచి చూసుకుంటూ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ గడిపాము. ఆ తర్వాత DJ నైట్ స్టార్ట్ అయ్యింది. అందరితో పాటు మేము కూడా డాన్స్ చేసాము. అరిచాము. సాంగ్స్ ఎంజాయ్ చేసాము.

స్వీటీ తో నేను అలాగే నాతో తను ఇంత ఫ్రీగా ఇంత ఓపెన్ గా ఎంజాయ్ చేయటం ఫస్ట్ టైం. అలా ఒక గంట సేపు DJ నైట్ లోనే గడిపాము.

టైం 11:45 అయ్యింది. నా ఫోన్ మోగింది కానీ పెద్ద సౌండ్స్ వల్ల వినపడలేదు. అక్కడ ఉన్న DJ, ఇంకొక 10 నిమిషాలలో New Year అన్నాడు. నేను స్వీటీ చేయి పట్టుకొని అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చాను.