లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

నేను నెమ్మదిగా అతనిని పట్టుకొని లిఫ్ట్ నుంచి బయటకు తీసుకొని వెళ్లాను. ఆతను థాంక్స్ చెప్పి ఇద్దరికీ వైపు చూసి god bless you అన్నాడు.

స్వీటీ నా కోసం లిఫ్ట్ డోర్ అలాగే క్లోజ్ అవ్వకుండా ఉంచింది. నేను నెమ్మదిగా లిఫ్ట్ లోపలికి వచ్చాను. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి.

“సంజు ……. ఏంటి లిఫ్ట్ లో ……. ??” అని తను sentence complete చేయకుండానే మళ్ళి తనకి ఒక లిప్ కిస్ ఇచ్చాను.

ఈ లోగ లిఫ్ట్ ground floor కి వచ్చింది. నేను ఏమి తెలియనట్లు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసాను. తను కూడా బయటకు వచ్చేసింది.

రెస్టారెంట్ కి వెళ్తుండగా తను “సంజు …… లిఫ్ట్ లో ఏంటది ??” అంది.

“ఏమైంది ??” అని ఏమి తెలియనట్లు నటించాను.

“నటించొద్దు …….. ”

నేను నవ్వాను.

“ఐన రోజు రోజుకి నీ అల్లరి బాగా ఎక్కువైపోతోంది సంజు ……. ”

“నీది కూడా ……. ”

“అస్సలు expect చేయలేదు తెలుసా ??”

“నేను మాత్రం ప్లాన్ చేసి అలా చేసానా ఏంటి ??” అన్నాను.

తను నవ్వి “అది కాదు నా ఉద్దేశం …… ”

“మరేంటి ??”

“లిఫ్ట్ లో …… అలా ……. మనం ……. ”

“తప్పేంటి ??” అన్నాను.

“అలా ఎవరో లిఫ్ట్ లో ఉన్నప్పుడు ……. ”

“అతను చూడలేదులే …… don’t worry…..పైగా ఇద్దరినీ bless కూడా చేసాడు …….. ”

తను అలాగే సైలెంట్ గా నన్నే చూస్తుంది.

నేను కొంచెం నవ్వి “నన్ను ఏమనాలో …… నీకు అర్ధం కావట్లేదు కదా ??” అన్నాను.

కొంచెం గ్యాప్ ఇచ్చి “అవును …… ” అంది.

నేను నవ్వి “relax స్వీటీ…… ఇలాంటి మూమెంట్స్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం ?? ఇలాంటి thrills అన్ని ఈ వయసులోనే experience చేయాలి …….. లేకపోతే మళ్ళి ఛాన్స్ రాదు లైఫ్ లో …….”

“యా …….. “