లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“సంజు ….. ఏమైంది ??” అని అడిగింది.

“చెప్తా ఆగు …… ” అని నేను తనని మా అపార్ట్మెంట్ కి తీసుకొని వెళ్లాను.

తనకి అర్ధం కాక ఏమైంది ఏమైంది అని అడుగుతూనే ఉంది. నేను surprise అని చెప్పాను.

అప్పటికి టైం 11:57 అయ్యింది. ఇద్దరం అపార్ట్మెంట్ లో కి చేరుకున్నాం. నేను తనని అపార్ట్మెంట్ లో బాల్కనీ కి తీసుకొని వెళ్లాను.

తనని నా ఎదురు నిల్చోమని చెప్పాను. తను నిల్చుంది. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటున్నాం.

టైం 11:58 అయ్యింది. కింద నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.

“సంజు …… ఏంటి ??” అంది.

నేను “shhhhhhh ……. ” అన్నాను.

సడన్ గా కిందంతా సైలెంట్ అయిపోయింది. కొన్ని క్షణాలలో కింద మైక్ లో DJ New Year Countdown స్టార్ట్ చేసాడు.

అప్పుడు నేను కూడా DJ తో పాటు countdown స్టార్ట్ చేసాను.

“60……. 59…….. 58……. ”

స్వీటీ కి hint అర్ధమయ్యి నాతో పాటు countdown స్టార్ట్ చేసింది.

ఒక నెంబర్ తను చెప్తే నెక్స్ట్ నెంబర్ నేను చెప్పాను. అలా ఇద్దరం నంబర్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాము.

ఫైనల్ గా countdown నెంబర్ “11” కి వచ్చింది.

ఇక 10 అంకెలే ఉన్నాయ్ కాబట్టి ఇద్దరం కలిసి countdown చేసాం. నేను స్వీటీ నడుం పట్టుకుని దగ్గరికి లాగాను. తను నా మొహం పై చేతులు వేసింది. ఇద్దరం బాగా దగ్గరయ్యాము. ఒక్క నిమిషం కూడా కళ్ళు ఆర్పకుండా ఒకరిని ఒకరం చేసుకుంటున్నాం. నా గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది.

8

7

6

5

4

3

2

1

ఇద్దరం ఒకరి పేదల పై ఒకరం చిన్న ముద్దు పెట్టుకొని “హ్యాపీ న్యూ ఇయర్ సంజు …….. ” అంది.

నేను “హ్యాపీ న్యూ ఇయర్ స్వీటీ …….. ” అన్నాను.

ఇద్దరి కళ్ళలో ఆనందం. ఒకరినొకరం ఆనందంగా చూసుకుంటూ I love you చెప్పుకున్నాం.

బయట అపార్ట్మెంట్ వాళ్ళు టపాసులు కాల్చటం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా 12 దాటేసరికి ఆకాశం టపాసులతో నిండటం స్టార్ట్ అయ్యింది.

ఇద్దరం బాల్కనీ హ్యాండిల్ పట్టుకొని ఆ టపాసులు చూస్తూ ఉండగా ….. స్వీటీ నా భుజం పై తల పెట్టి నా చేయిని గట్టిగ పట్టుకుంది.

టు బి కంటిన్యూడ్ ……