లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“చెప్పేస్తే అది surprise ఎలా అవుతుంది ??” అని నా వేలితో నా మైండ్ ని చూపిస్తూ “use common sense …… ” అన్నాను.

తను నవ్వి “సంజు …… కొడతాను నిన్ను ……. surprise ఏంటో చెప్పు ప్లీస్ …… ”

“నీకు చాలా క్యూరియస్ గా ఉంది కదా ??”

“అవును ….. అందుకే అడుగుతున్నాను …… ”

“లేదు ….. ”

“సరే …… అయితే నేను మాల్ కి రావట్లేదు ……. ”

“ఓకే …… నేనొక్కడినే వెళ్తాను …… you will be missing out….” అన్నాను.

తన పెదాలు కదులుతున్నాయి కానీ సౌండ్ రావట్లేదు. అంటే నన్ను మనసులో ఏదో తిట్టుకుంటుంది.

“ఏంటే ఏదో మనసులో నీ పతికి నువ్వే తిట్టేసుకుంటున్నావ్ ??”

“నీకెందుకు నేనేం తిట్టుకుంటే ?? నా ఇష్టం ….. ”

“నీకు వేషాలు బాగా ఎక్కువయినియ్యే …… ”

“ఎం చేస్తాం నీ నుంచే నేర్చుకున్నాను ….. ”

“అబ్బో ……. ” అని కళ్ళు మూసుకున్నాను.

“ఏంట్రా ఏమైంది అలా కళ్ళు మూసుకున్నావు ??”

“ఐన మొదట్లో ఎంత సైలెంట్ గా ఉండేదానివే నువ్వు ?? నోట్లో వేలు పెడితే కోరుకుతావో లేదో అన్నంత సైలెంట్ గా ఉండేదానివి …… ఇప్పుడు నాకే కౌంటర్లు పంచులు వేసే స్థాయికి వచ్చేసావ్ ……. బాగా ముదిరిపోయావే నువ్వు …… ”

“నువ్వేమైనా అనుకో …… ”

“సరే వస్తావా రావా చెప్పు …… ”

“వస్తాను ……. ”

“మరి ఇది చెప్పటానికి ఎందుకే ఇన్ని వేషాలు ??”

“నిన్ను ఏడిపిద్దామని …… ”

“నాకు కూడా టైం వస్తది ….. అప్పుడు నేను కూడా నీతో ఇలాగే ఆడుకుంటాను ……. ”

“చూద్దాం లే ….. ”

“ఏంటి ??”

“అదే ….. టైం వచ్చినప్పుడు చూడు అన్నాను…. ”

స్వీటీని పైనుంచి కిందకి చూసి నేను “…….. సర్లే …… వెళ్దాము పద …… ”

వెళ్తుండగా నేను ఆగి “sweety …… ”

“ఏంటి సంజు ??”

“jeans t-shirt వేసుకోవే …… ”

“no way …… ”

“అదేంటే మొన్న వేసుకున్నావ్ కదా ??”

“అదంటే బయట ఊరు …… ”

“అక్కడేసుకున్నావ్ …… ఇక్కడ వేసుకోవటానికి ప్రాబ్లెమ్ ఏంటి ??”