లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

“రేయ్ …….. ”

“ఏంటే ??”

“ఎం లేదు ……. అంటే ఓకే చెప్పి …… వెళ్లిపోవటమేనా ??”

“యెస్ …… ”

“you are an idiot……. ”

నేను నవ్వి “ఇంక ……. ”

“stupid …….. ”

“అబ్బ ఎంత హాయిగా ఉందొ ……. ” అంటూ నవ్వాను.

“సంజు …… you are really……really……..”

“really …… తర్వాత ఏంటి ??”

“తర్వాత చెప్తాను …….. ”

నేను నవ్వి “ఇప్పుడు ఏమైంది ??”

“అంత కష్టపడి ……. నీ కోసం అందంగా రెడీ అయి వస్తే ……… అంత casual గా ఉంటావా ??”

“యెస్ …….. ”

స్వీటీ ఇంటి లోపలి వెళ్తుండగా ఎదురింటి పిల్లోడు బయట ఆడుకొని డోర్ దగ్గరకి వచ్చాడు. నేను వాడ్ని ఆపి “రేయ్ …….. ”

“ఏంటి ??” అని వెటకారంగా నాకు రిప్లై ఇచ్చాడు.

నేను వాడ్ని ఎత్తుకొని స్వీటీ వైపుకి తిప్పి “ఈ రోజు నీకు ఆంటీ …. ఏమైనా డిఫరెంట్ గా కనిపిస్తుందా ??” అని అడిగాడు.

“లేదు ……. ”

“ఓయ్ చంపేస్తాను ……… ఆంటీ కాదు …… అక్క అని పిలువు …….. ”

వాడు ఆంటీ అని పిలిచాడు. నేను వాడు ఇద్దరం నవ్వుకుంటున్నాం.

స్వీటీ చిరాకుతో లోపాలకి వెళ్లిపోయింది. వాడు మళ్ళి ఆంటీ అని అరిచాడు. నేను వాడ్ని దించి అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసి స్వీటీ కోసం రూమ్ లో కి వెళ్లాను.

తను చిరాకుతో బెడ్ పై కూర్చుని ఫోన్ లో ఏదో చేసుకుంటుంది.

నేను వెళ్లి “హే …… ఏమైంది ??”

“సంజు ……. నీతో నేను మాట్లాడను ……. ”

“ఎందుకో ??”

“అంతే …….. ”

“ఓకే ……… ఏదో కోపంగా ఉన్నట్లున్నావ్ ……. ”

“ఉన్నట్లు కాదు …… కోపంగానే ఉన్నాను ……. ”

“ఓ …….. ఎందుకు ??” అని అమాయకంగా అడిగాను.