లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

ఈ స్టోరీ నా ముందు స్టోరీ కి continuation….. నేను మొదట్లో ఈ స్టోరీని ఒక updates ఉన్న ఒక చిన్న స్టోరీ గా అనుకోని స్టార్ట్ చేసాను కానీ అది 5 updates దాటేసింది. నాకు కూడా టైం చాల తక్కువ ఉండటంతో original గా చిన్న స్టోరీ అనుకోని ఎక్కడైతే ముగింపు ఇవ్వాలి అనుకున్నానో అక్కడే ముగింపు ఇచ్చాను. ఆ స్టోరీ లో “లిస్ట్” గురించి చెప్పి దాని గురించి పెద్దగా రాయలేకపోయాను….. ఈ స్టోరీ ఆ లిస్ట్ కి సంబంధించింది.

లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 5→

రెండు నెలల తర్వాత:

“సంజు ……. నిద్ర లెయ్యి…… టైం 9 అవుతుంది……. ఆఫీస్ కి వెళ్ళాలి కదా …….. ”

“నువ్వెళ్లు ……… ”

“సంజు ……. ”

“ఈ రోజు నాకు హాలిడే ……. ”

“ఎందుకు ??”

“ఎందుకో తెలీదు …… కానీ హాలిడే అని మాత్రం తెలుసు …… ”

“మరి నేను ??”

“నీ ఆఫీస్ కి హాలిడే ఉందొ లేదో నాకెలా తెలుస్తది ??”

“ఆ ?? అంటే ఈ రోజంతా నేను ఆఫీస్ కి వెళ్లి కష్టపడితే ……. నువ్వు మాత్రం హ్యాపీ గా పడుకుంటావా ??”

“యెస్ …… పడుకోవటం మాత్రమే కాదు ……. ఫుడ్ కూడా swiggy లో ఆర్డర్ చేసుకుంటాను ……. రోజంతా మూవీస్ చూసుకుంటూ ……. గడుపుతాను …… ”

“దుర్మార్గుడా ……. నాకు ఎందుకు చెప్పలేదు ??”

“నువ్వు ఆఫీస్ కి వెళ్లి బాగా కష్టపడి …… మీ కంపెనీ కి మంచి పేరు తీసుకొని రా ……. నేను అది చూసి ఆనందిస్తాను …… ”

“ఎం అక్కర్లేదు …….. అయితే నేను కూడా ఆఫీస్ కి వెళ్ళను”

“వెళ్లొద్దు ……. ”

నా తల పై వేసుకున్న దిండుని స్వీటీ లాగేసింది.

“ఇవ్వవే దిండు …… ”

“లేదు …… నేనివ్వను ……. అంత నీ వల్లే ….. ”

నేను నవ్వుతు “నేనేం చేసాను ?? నా ఆఫీస్ హాలిడే …… అందుకే నేను ఆఫీస్ కి వెళ్లట్లేదు …… మధ్యలో నేనేం చేసాను ??”

“ఈ ముక్క ముందే చెప్తే నేను కూడా హాయిగా పడుకునే దానిని ……. ”

“ఆ విషయం అడగకపోవటం నీ తప్పు …… ”

“నా నిద్ర నువ్వు పోగొట్టావ్ కాబట్టి …… నిన్ను కూడా నిద్ర పోనివ్వను …… ”

“ఇదెక్కటి విచిత్రమే ….”

“అదంతా నాకు తెలీదు రా ……. నేను ఇంత కష్టపడి రెడీ అయ్యి ……. నువ్వు మాత్రం అలా హాయిగా పడుకోవటం నేను చూడలేను ……. అందుకే నిద్ర లెయ్యి ……. ” అంటూ నన్ను లేపింది.

నా నిద్ర చెడింది.

నేను లేచి “నీ వల్ల నా నిద్రాంత పోయింది ……. ఇప్పుడు హ్యాపీ నా ??” అని అడిగాను.

నవ్వుతు “యెస్ ……. ”

“sadist …….. ”

“….. అబ్బా ….. మొన్న నేను కూడా ఇలా చేస్తే నా నిద్ర లేపావు ……. ఈ రోజు నేను నీకు అదే చేస్తే sadist అంట …… ”

నేను దొంగ నవ్వు నవ్వాను.

“వీటికేమి తక్కువ కాదు …… ”

“మొత్తానికి రివెంజ్ తీర్చుకున్నావన్నమాట …… ”

“అవును …… 3 వారల తర్వాత ……. ”

“ఇలా నేను కష్టపడి నిద్ర లేస్తుంటే నువ్వు ఆనంద పడుతున్నావ్ ……. దీనిని ఏమంటారో తెలుసా ??”

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.