లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

నేను బాగా excited గా ఫీల్ అయ్యాను. నా శృంగార దేవత అలా నడిచొస్తుంటే ఏదో చెప్పలేని ఆనందం. నెమ్మదిగా వచ్చి నా ముందు నిల్చుంది. మోహంలో సిగ్గు దాగుంది. నేను లేచి పాల గ్లాస్ తీసుకొని డోర్ లాక్ చేసి వచ్చి కూర్చున్నాను.

“కూర్చో …… ” అన్నాను.

నా పక్కనే కూర్చుంది. తన చేతుల్లో ఉన్న గిఫ్ట్ ని పక్కన పెట్టింది.

“ఏంటే అంత సిగ్గుపడుతున్నావ్ ??”

“ఏంటి ??”

“నా దగ్గరెందుకె సిగ్గు …… ”

“అవునా ?? లేదే ……. ”

“అబ్బా ……. ”

తను నవ్వేసింది. నేను నవ్వి పాల గ్లాస్ పక్కన పెట్టి తనకు దగ్గర జరిగి తన అందమైన పాల బుగ్గలు పట్టుకొని తన కళ్ళలోకి చూసి “అప్పుడు ఇంట్లో ఉండేసరికి కొంచెం ఇబ్బందనిపించింది ……….ఇక్కడ నువ్వు నేను మాత్రమే ……. ఈ రోజు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళెవ్వరూ లేరు……. ఆపేవాళ్ళెవ్వరూ లేరు ……”

స్వీటీ బుగ్గ పై ఉన్న నా చేతులను పట్టుకొని “అవును సంజు …….. ” అని చాలా స్వీట్ వాయిస్ లో చెప్పింది.

నేను నవ్వి తన నుదిటి పై ఒక ముద్దిచ్చి హగ్ చేసుకున్నాను. తను కూడా నన్ను హగ్ చేసుకుంది. పిచ్చ రొమాంటిక్ గా అనిపించింది.

నెమ్మదిగా కౌగిలయ్యాక పాల గ్లాస్ తీసుకొని తనని అలాగే చూస్తూ కొంచెం పాలు తాగి గ్లాస్ తనకిచ్చాను. తను నెమ్మదిగా గ్లాస్ తీసుకొని కొంచెం పాలు తాగి నాకిచ్చింది.

“బాగుందా ??”

బాగుందని చెప్పింది.

నెమ్మదిగా ఇద్దరం గ్లాస్ ఖాళీచేసాం. చాల రొమాంటిక్ గా అనిపించింది.

“గిఫ్ట్ ఎలా ఉంది ??” అని అడిగాను.

“ఎం గిఫ్ట్ ??”

“నువ్వే ఓపెన్ చేసి చూడు ……. ” అన్నాను.

నెమ్మదిగా ఆ గిఫ్ట్ తీసుకొని నానా ముందే ఓపెన్ చేసింది. లోపల పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. నన్ను చూసి నవ్వింది.

“నీ కోసమే ……. ”

“థాంక్స్ ……. ”

“థాంక్స్ ఒక్కటేనా ??”

“మరేం కావలి ??”

నెమ్మదిగా నా వేలుని తన పెదాల పై నాజూకుగా పెట్టి “…… ఇది కావలి ……. ”

నవ్వుతు “….. నాటి బాయ్ ….. ”

“సెక్సీ గర్ల్ ……… ”

నెమ్మదిగా ఇద్దరం అర్ధం చేసుకొని ఒకరి పేదల దగ్గరికి ఒకరం వెళ్లేసరికి ఇద్దరి పెదాలు టచ్ అయ్యాయి. ఇద్దరం ఒక రొమాంటిక్ లిప్ లాక్ ఇచ్చుకున్నాం.

లిప్ లాక్ అయ్యాక తనకి నాకు ఇద్దరికీ ఇంత రొమాంటిక్ సిట్యుయేషన్ లో ఒక ముద్దు చాలలేదు అనిపించింది. తన కళ్ళలో కూడా అది కనిపించింది.

నేను ఇంకో ముద్దు కోసం మళ్ళి ముందుకెళ్లేలోగా

“ఓకేనా ??” అని అడిగింది

లేదని చెప్పాను.

“మరి ??”

ఈ సరి నేను నెమ్మదిగా తన పేదల పై నా పెదాలను పెట్టి తన అందమైన బుగ్గలు పట్టుకొని ఈ సరి రొమాన్స్ తో పాటు మంచి ప్యాషన్ తో ముద్దిచ్చాను. తను కూడా అంతే passion తో రెస్పాండ్ అయ్యింది. చాల రొమాంటిక్ గా అనిపించింది.

ముద్దయ్యాకా మళ్ళి మాములుగా కూర్చున్నాం.

నేను సైలెన్స్ బ్రేక్ చేయటానికి “స్వీటీ ……. ”

“ఏంటి సంజు ??”

పక్కనున్న పండ్లు తీసి మధ్యలో పెట్టాను.

నన్నే చూస్తుంది.

“సరే ఒక గేమ్ ఆడదాం ……. ”

“ఎం గేమ్ ??”

ఈ grapes ని ఇలా పైకేసి నోటితో క్యాచ్ చేయాలి …… అంటూ ఒక ద్రాక్ష గాలిలోకి వేసి నోటితో పట్టుకున్నాను.

“10 చాన్సెస్ ఉంటాయి …. నువ్వు గెలిస్తే నువ్వేం చెప్తే అది చేస్తాను ……. నేను గెలిస్తే నేనేం చెప్తే అది నువ్వు చేయాలి ……. ”

“నో …… ”

“ఎందుకు నో ??”

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.