లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

“నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చునంటావ్ ……. అందుకే మొదటి సారె పట్టుకున్నావ్ ……. ” అంది.

నేను నవ్వి “లేదే బాబు …… ఏదో లక్ అలా కలిసొచ్చింది ……. ”

“లేదు …… నేను నిన్ను నమ్మను ……. నీ చూపులు నాకు వేరేగా చెప్తున్నాయి …… ”

నేను నవ్వి “నేను చెప్పేది …… నిజమే …… నాకు నిజంగా రాదే ……. ”

“లేదు ……”

“సరే మరేం చేద్దాం ??”

“hmmmmm ……. ” అంటూ ఆలోచించినంది.

నేను “సరే ఒక పని చేద్దాం ….. ” అని కమల పండు ఓపెన్ చేసి నెమ్మదిగా ఒక ముక్క తీసి తన పెదాల దగ్గర పెట్టాను.

నెమ్మదిగా నా పెదాలను తన పెదాల దగ్గరికి తెచ్చి తన పేదల దగ్గర పండుని సగం కొరికి తిన్నాను. దాంతో ఇద్దరి పెదాలు కలిసాయి.

తనని అడగకూండానే ఇంకో పండు తీసి తన పెదాల దగ్గర పెట్టి ….. అలా ఒక కమల పండు తిన్నాం.

ఆ తర్వాత తన తీయటి పెదాలు రుచి చేసే అవకాశం బాగా వచ్చింది. నేను కావాలని ద్రాక్ష పండ్లు తీసాను. ఈ సరి పండ్లు చిన్నవి కాబట్టి ఇద్దరం చాల లిప్ లాక్స్ ఇచ్చుకున్నాం. సూపర్ గా అనిపించింది.

“స్వీటీ ……. ప్లీస్ ….. ఆ గేమ్ ఆడదాం …….. ”

“నో ……. ”

“ఏంటే అలా అంటావ్ ??”

“నో ….. అంటే నో ……… ”

“నేను నీ మొగుడినే …… నా పై నీకు నమ్మకం లేదా ??”

“నో …… ”

“నిజమే …… నాకు నిజంగా ఆ గేమ్ తెలీదు …….. ఏదో లక్ కలిసొచ్చింది …… కావాలంటే చూడు ….. ” అని తన చేతికి ఒక ద్రాక్షిచ్చి “నువ్వే వేసి చూడు …… ” అన్నాను.

తను చిరుకోపంతో ఉంది.

నెమ్మదిగా నా వైపు పండేసింది. నేను లక్కీ గా పండుని పట్టుకున్నాను. నాకు విషయం అర్ధమయ్యి కావాలని పండు జారిపోయినట్లు పండు పట్టుకొని కూడా కిందకు వేసాను.

“ఆ…. చీటింగ్ చేస్తున్నావ్ ….. నువ్వు ……. ” అంది

నేను బాగా నవ్వి “లేదే ……… ” అన్నాను.

“లేదు పండు పట్టుకొని కూడా నువ్వు వదిలేసావ్ ……. ”

“లేదే …….. ”

“లేదు నేను బాగా చూసాను ……… ”

“అది లక్ వల్ల జరిగిందే …… బాబు …… ”

“రెండు సార్లు వరుసగా లక్ వస్తుందా ??”

నేను దొంగ నవ్వులు నవ్వాను.

“నాకు తెలుసు …….. నీ గురించి ….. ” అంది.

నాకు ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది.

స్వీటీ అటు వైపు చూసింది.

నేను నవ్వు ఆపుకొని తన తల ఇటు తిప్పి “ఐన నేను గెలిచి ….. నువ్వు ఓడితే ఏమవుతుంది ??” అన్నాను.

“నెట్ 3 డేస్ బ్రేక్ ఫాస్ట్ చేయమని చెప్పి నువ్వు తప్పించుకుంటావ్ …… ”

“ఇంకా నీకు కోపం తగ్గలేదా ??”

“ఎలా తగ్గుతుంది ……. లాస్ట్ వీక్ ఇలాగే చేసావ్ …….. ఆల్రెడీ జరిగిపోయిన క్రికెట్ మ్యాచ్ rewind చేసి సిక్స్ కొడతాడు అని చెప్పి నాతో పందెం కాసి ……. నువ్వు గెలిచి …… నాతో బ్రేక్ ఫాస్ట్ చేయించావ్ …… తర్వాత జ్వరం అని మళ్ళి నేను చేసాను …… ”

నేను నవ్వుతు ఉన్నాను.

“ఈ సారి నేను ఆ ట్రాప్ లో పడను ……. ”

“అరె …… లాస్ట్ 5 డేస్ నుంచి నేనే కదా బ్రేక్ ఫాస్ట్ చేస్తుంది …… ”

“అబ్బా ….. నిన్న మొన్న swiggy లో ఆర్డర్ చేసి నువ్వే చేశానని అబద్దం చెప్పావ్ …… ఆ ముందు రోజు వేరే వాళ్ళు అపార్ట్మెంట్ లో ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ కి పిలిచారు …… నువ్వు చేసింది 2 రోజులు …… ”

నేను నవ్వుతు మధ్యలో ఆపుకొని “ఏదైనా సరే …. నీకు 5 రోజులు పని తగ్గించాను కదా ??”

“అంత అమాయకంగా face పెట్టకు …….. ” అంది.

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.