మోజు పడ్డ మగువ 346

రాత్రి ఎనిమిది గంటల వరకు పుస్తకంతో గడిపి లైట్ గా భోజనం చేసింది. అన్నాకరేనినా సినిమా చూడాలని నిర్ణయించుకుంది. చాలా రోజుల్నుంచి చూడాలనుకుంటున్న సినిమా ఈ మధ్య ఎప్పుడో స్టార్ టీ.వీ.లో వచ్చిందిగానీ చూడలేకపోయింది. కేసెట్ అడిగితే వీడియో షాప్ లలో దొరకలేదు. పదిగంటల వరకు పడుకుని, తర్వాత లేచొచ్చి టీ.వీ.ని ఆన్ చేసింది అప్పుడే మొదలౌతుంది సినిమా. సినిమాలో లీనమైపోయింది సూర్యాదేవి. పన్నెండు గంటలకి వసంత్ చెబుతానన్న థ్రిల్లింగ్ న్యూస్ ఏమిటో ఎంత ఆలోచించినా తట్టడం లేదు. ఇరవై నాలుగు గంటలపాటు అతనితో ప్రేయసిగా గడిపాక జగదీష్ తో తిరిగి ఎలా కాపురం చేయడం? అది జరిగే పనికాదు. వెళితే వెళ్ళిపోవాలి- శాశ్వతంగా తల్లిదండ్రుల్ని, భర్తనీ, వీటినన్నిటినీ వదిలి వెళ్ళిపోవాలి.

నాతో వచ్చేయకూడదా అని వసంత్ ఎందుకడగలేదు. కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రం ప్రేయసిగా వుండాలని మాత్రం అడిగాడు. పర్మినెంట్ గా నాతో వచ్చేయమని అడిగితే- ఒప్పుకోనని అలా అడిగాడా? లేక ఇరవై నాలుగు గంటలు పైన తామిద్దరూ కలిసి గడపలేమని ఆ వరం అడిగాడా? ఇంతకీ తన నిర్ణయం ఏమిటి? “నీకా” అడిగింది సూర్యాదేవి. “ఆఁ నేనూ మనిషినే, ఎప్పుడో ఆరేళ్ళ క్రితం జరిగిన సంఘటన. అప్పుడలా ప్రవర్తించి వుండకపోతే నా జీవితంలో మచ్చ లేకుండా వుండేది. కానీ ఆ మచ్చ లేకుండా వుంటే బహుశా నేను చచ్చిపోయి వుండే దాన్నేమో కాబట్టి మనిషి ప్రవర్తనని మంచీ చెడుల కోణంలోంచి చూడాలి” “కరక్టే ఏం జరిగిందో చెప్పవా?” “నా భర్త ఇక్కడేమీ టేప్ రికార్డర్ లాంటివి పెట్టలేదుగదా అలానే జరిగితే ఇప్పుడు నే చెప్పినదంతా విని తన తప్పులకు తను కుంగిపోతాడు. లేదూ నా తప్పులకు వెంటనే విడాకులు ఇవ్వడానికి లాయర్ దగ్గరికైనా పరిగెడతాడు” అని నవ్వుతూ చెప్పడం ప్రారంభించింది సౌందర్య.

“మాది నాయుడుపేట టెన్త్ క్లాస్ కొచ్చానో లేదో నా శరీరం వికసించింది. అంతకు ముందు ఏమీ తెలియని నంగనాచిలా వున్న అవయవాలు యవ్వనాన్ని సంతరించుకుని తమ ఠీవిని చూపించడం మొదలెట్టాయి. బ్రాకుగానీ, జాకెట్టుగానీ లొంగని తన వక్షస్థలాన్ని చూసి నాకే ఈర్ష్యగా వుంది. బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించడం భలే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఒళ్ళంతా మత్తుగా అయిపోయింది. మగపిల్లల చూపులే గిలిగింతలు పెట్టినట్లు తోస్తుంది. టెన్త్ పరీక్షలై పోతాయనంగా మా స్కూల్లో ఓ పిల్ల ప్రేమ విఫలమై విషం తాగి, చివరికి కొన ఊపిరితో బయటపడింది. దీన్ని పేపర్లో చదివి వినిపించాడు.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.