మోజు పడ్డ మగువ 345

కాఫీ తాగాక చెబుతాను. తరువాత నువ్వు ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయాలి- చివరికి నీ భర్తకి కూడా” “అలానేలేవే” అని సూర్యాదేవి ఆమె చేతిలో చెయ్యివెసిఉ ఒట్టు పెడుతున్నట్లు గిల్లింది. నాకైతే అతను “నావాడు” అయిపోయాడు. ఆత్మీయతాభావం నాకు ఎక్కడా లేని శాంతిని ప్రసాదిస్తోంది. నా పేదరికం నన్ను బాధించడం మానేసింది. అందుకే నేను చాలా ఆనందంగా వున్నాను. “సరుకులైపోయాయి. రెండు మూడు రోజులకి వస్తాయేమో. రేపు తెప్పించు” ఇప్పుడు అతను పరాయివాడు కాదు కాబట్టి మునుపటిలా అతని నుంచి సహాయం పొందడం ఇబ్బందిగా లేదు.

మామూలుగా అయితే సరుకులు కావాలని చెప్పడానికి చాలా గంటలు ప్రిపేర్ అయి, అతికష్టం మీద కంఠతా పెట్టింది ఒప్పజెప్పినట్లు చెప్పి, చూపుల్ని కిందకు దించేసి గిల్టీనెస్ తో నల్లబడ్డ ముఖం కనిపించకుండా అష్టవంకర్లు పోయేదాన్ని ఇప్పుడవన్నీ పోయాయి. “అలానే” అతను పైకి లేచాడు. “నువ్వు ఇకనుంచి ఉదయం నిద్ర లేస్తూనే ఇక్కడికిరావాలి. నువ్వు లేకుండా కాఫీ తాగకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వెప్పుడొస్తే అప్పుడే నాకు కాఫీ” ఏమీ మాట్లాడకుండా అతను వెళ్ళిపోయాడు. రెండో రోజునుంచి క్రమం తప్పకుండా కాఫీ వేళకు వస్తున్నాడు. కానే మునుపటిలా క్లోజ్ గా మాట్లాడలేకపోతున్నాడు.

కొత్త విషయం చొరబడడం వల్ల డిస్టర్బ్ అయ్యాడు. అది నేను గ్రహించడంవల్ల ఇంకాసేపు వుండమనికానీ, ఇంకా మాట్లాడమనీ ఒత్తిడి చేయడం లేదు. అంతలో కార్తీకమాసం వచ్చింది. కార్తీక సోమవారానికి కపిలతీర్ధంలోని శివాలయానికి ఆడవాళ్లు చాలామందే వెళ్ళి వస్తున్నారు. ఆరోజు మా తమ్ముడ్ని టౌన్ కి పంపించి వేశాను. రెండోరోజు ఉదయం రమ్మని ఏభై రూపాయలు ఇచ్చాను. వరసగా సినిమాలు చూసి వస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. మంచంలో పడుకున్నాను. అది ఎండో, వెన్నెలో తెలియడం లేదు.

సూర్యుడు వున్నాడు కనుక ఎండా అనుకున్నాను తప్ప మనసు ఫీలైంది కాదు. సూర్యకిరణాల్ని బంగారు జల్లెడలో జల్లించి పంపిస్తున్నట్లుంది. నాలుగు గంటల ప్రాంతాన మా అమ్మ కాఫీ తీసుకుని పైకొచ్చింది. “ఏమిటే నీ వాలకం. కొత్త పెళ్ళికూతురైనప్పుడు కూడా ఇంత కళగా లేవు నువ్వు” అంది కాఫీ అందిస్తూ. “చాలా రోజుల తఃరువాత పుట్టింటికి రావడం కదా అదీ సంతోషం” అన్నాను. కాఫీ తాగాక కిందికి దిగివచ్చాను.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.