మోజు పడ్డ మగువ 345

శాస్త్రజ్ఞుల అంచనాల మేరకు శుక్రవారం సాయంకాలం అయిదు గంటలా పదిహేను నిముషాలకి షూమేకర్ భూమిని ఢీ కొంటుంది. ఆరోజు సాయంకాలం ఆరుగంటలకి తనను రమ్మన్నాడు వసంత్. అప్పటికే భూమి ముక్కలు ముక్కలు కింద విడిపోతుంది. అయిదున్నరకల్లా వసంత్ కొండచివర తనకోసం టెన్షన్ తో ఎదురుచూస్తుంటాడు. అయిదున్నరకి వచ్చి ఆరుగంటల వరకు తనకోసం చూస్తానన్నాడు.ఎక్కడ చూసినా చావు భయం, చావు భయం చివరికి న్యూస్ రీడర్ల ముఖంలో కూడా అదే భయం. సాయంకాలం అయిదయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ టీవీల మీద చేరిపోయారు. మొత్తం ప్రపంచమే మునికాళ్ళమీద నిలబడి కాలంలోకి తొంగిచూస్తున్న క్షణాలు.

ఢిల్లీలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి వార్తలు చదవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. న్యూస్ రీడర్ ఒక్కరే వచ్చారు. ఆమె పేపర్లు సర్దుకుంటున్నారు. ఆ విశాలమైన గదిలో చాలా కంప్యూటర్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. శాస్త్రవేత్తలు టెలిస్కోప్ లి చూస్తున్నారు. గందరగోళంగా వుందక్కడ. అయిదూ అయిదు….. అయిదూ ఆరు…. అయిదూ ఏడు….. గడియారంలో ముళ్ళు కదలడం మొసళ్ళు నీటిమడుగులోంచి లేచి వస్తున్నట్లుంది. అయిదూ పది…. అయిదూ పదకొండు…. సూర్యాదేవి కూడా కళ్ళు మూసుకుంది. వసంత్, జగదీష్, తల్లిదండ్రులూ వరుసగా మెదులుతున్నారు. తన బాల్యం, యవ్వనం, పెళ్ళి, వసంత్ పరిచయం అన్నీ గుర్తు తెచ్చుకుంటోంది.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.