మోజు పడ్డ మగువ 344

సూర్యాదేవి మౌనంగా అనుసరించింది. హాస్టల్ గేటుకి బాగా దూరంలో ఉత్తరంవైపున వుంది ఆ దారి. ప్రహరీగోడకు దిగువున మనిషి దూరేంతకంత అంత సాహసం చేయలేని అమ్మాయిల దిగులంతా అవతలికి ప్రవహించడానికి తవ్వినకాలువలా వుంది. “ఓకే! టాటా! ఛీరియో” రమ్య వెన్నెల్లో కలిసిపోయింది. ఒంటరిగా సూర్యాదేవి మిగిలిపోయింది. వెన్నెల శరీరాన్నంతా చుట్టుకుంటోంది. రాత్రి రహస్యాలపై మేలిముసుగు కప్పుతోంది గాలి. “ఆఁ” అతను భయంతో బిగదీసుకుపోయి, అంతలో తేరుకుని, “ఏమిటీ!” అంటూనే ఎడమచేత్తో నుదురుపై భాగాన్ని తడుముకున్నాడు. ఏదో వుబ్బుగా తగిలినట్లనిపించింది. “నిజమండీ! మీ నెత్తిమీద కొమ్ములు మొలుస్తున్నాయి” అంది సూర్యాదేవి. అతను అద్దంలో చూసుకోవడానికి డ్రస్సింగ్ మిర్రర్ వైపు పరుగెత్తాడు. * * * * * ఆరోజు ఆదివారం సాయంకాలం ఐదుగంటలకల్లా రెడీ అయి పోయింది సూర్యాదేవి. ఆమెకు సుస్మిత అనే ఓ స్నేహితురాలుంది.

మంచి ఆర్టిస్ట్ తను గీసిన చిత్రాలన్నిటినీ గెస్ట్ లైన్ డేస్ హోటల్ లో ప్రదర్సనకు పెడుతున్నాననీ, ఓసారి వచ్చి వెళ్ళమనీ ఉదయం ఫోన్ చేసి చెప్పింది. ఏవో పనుల వల్ల ఉదయం నుంచీ వెళ్ళడానికి కుదరలేదు. సాయంకాలం ఆరుగంటల కల్లా ప్రదర్శన అయిపోతుంది కాబట్టి త్వరత్వరగా తయారైంది. “కమాన్ సూర్యా! ఇప్పటికే ఆలస్యమైంది” హడావుడిగా కిందకు దిగుతూ చెప్పాడు. “మీవల్లే ఆలస్యం, స్నానం చేస్తానని బాత్రూమ్ లో దూరిన మీరు రావడం ఇంకో అరగంటకు ఆర్ట్ ఎగ్జిబిషన్ ని మూసేస్తారు” “ఏమీ సమస్యలు లేకపోవడమే పెద్ద సమస్య. సమస్య వున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏదో ఒకటి చేస్తాం. కానీ సమస్యే లేనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించడం? అందుకే అది పెద్ద సమస్య” “ఇందులోనూ నిజం లేకపోలేదని అంగీకరిస్తానుగానీ మాలాంటి కుటుంబాలు నిత్యం ఎంతగా కుమిలిపోతుంటాయో అనుభవిస్తేగానీ తెలియదు.

ముఖ్యంగా పల్లెటూళ్ళలో వ్యవసాయం తప్ప మరే ఆదాయం వుండదు. బొటాబొటిగా ఆదాయం అదీ సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడో వచ్చే ఆ కాసింత ఆదాయాన్ని నమ్ముకుని సంవత్సరమంతా అప్పులు. తీరా పంట చేతికి అందినప్పుడు ధరపలకదు. అవతల అప్పులవాళ్ళు యమదూతల్లా ఇంటి చూరు పట్టుకుని వేలాడుతుంటారు. యమభటుల చేతుల్లో కత్తులూ కఠార్లూ వుంటే వీళ్ల దగ్గర బాండు పత్రాలుంటాయి. అందుకే వచ్చిన ధరకే పంటనంతా అమ్ముకోవాల్సి వస్తుంది.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.