మోజు పడ్డ మగువ 345

మళ్ళీ అప్పులు అప్పు అంటే ఎప్పటికీ మమ్మల్ని వదిలిపోని గజ్జి, గోక్కుంటూ వుంటే మరింతగా చర్మము చిట్లడము తప్ప దురదపోదు. పల్లెటూరులో వున్నా నీ కుంటుంబంలాంటి కుటుంబాల కథ వేరు. మీరు భూస్వాములు కాబట్టి సంవత్శరానికి వచ్చినా లక్షల్లో ఆదాయం వుంటుంది ఎకరా, రెండెకరాలు వున్నవాళ్ళ బతుకులే పరమనీచం” చివుక్కున తలెత్తింది సూర్యాదేవి. తనకు తెలియని జీవితం చాలా వుందనిపించింది. ఒక్కొక్కర్ని కదిలిస్తే ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని కన్నీళ్ళు, ఎన్నెన్ని నిట్టూర్పులు, ఎన్నెన్ని చక్కలిగింతలు.

ఇంతకాలం తను డబ్బు పంజరంలో ఇరుక్కుపోయింది. “ఎవరిమీద? చెప్పవా?” “చెబుతాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పని నా జీవితపు కోణాన్ని గురించి చెబుతాను” సూర్యాదేవి కుడిచేతిని బుగ్గకింద ఆనించుకుని ముందుకి వంగింది. “ఇది మరొకటి మీద నాకై నేను మనసు పడ్డానో, లేక నా కుటుంబ సభ్యులకోసం కొత్త వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించి త్యాగం చేశానో, లేదూ ఈ రెండూ వున్నాయో నాకు తెలియదు. అంతా విన్నాక నువ్వే చెప్పాలి మరి” అంటూ చెప్పడం ప్రారంభించింది మహిత.

“మా ఊరు కాళహస్తికి దగ్గర్లోని పల్లెటూరు. మొత్తం వంద కుటుంబాలు వుంటాయనుకుంటాను అమ్మా నాన్నలకు నేనొక్కదాన్నే సంతానం మొత్తం నాలుగెకరాల పొలం వుండేది. మా ఊరివారందరూ కష్టజీవులు పడమటి కొండల్లో పొద్దుగుంకే వరకు పొలాల్లో పనిచేసే వాళ్ళు అందుకే లగ్జరీగా బాగానే నడిచేవి కుటుంబాలు. కానీ వరి నూర్పుళ్ళు వుండడంతో రాలేకపోతున్నామని నాన్న ఉత్తరం రాశాడు. మా ఇంటికి తప్ప మిగిలిన ఇళ్ళకంతా బంధువులు వొచ్చారు. అందుకే మా ఊరే అలంకరించిన రంగస్థలంలా వుంది. అటూ ఇటూ కట్టిన రంగు కాగితాల తోరణాల్లా కొత్త కొత్త స్త్రీలు హడావుడిగా తిరుగుతున్నారు. పెట్రోమాక్స్ లైట్లలా అమ్మాయిలు మెరిసిపోతున్నారు.

సాయంకాలానికి గూడూరు నుంచి నిర్మల, రాణి వచ్చారు. వాళ్ళిద్దరిలో ఒకరు సీత వేషము కడుతుంటే, మరొకరు డాన్సర్. డ్రామా మధ్య- మధ్యలో రిలీఫ్ కోసం రికార్డ్ డాన్సులన్న మాట. వాళ్ళను చూడడానికి జనం క్యూ కట్టారు. రాత్రి పదిగంటలకి నాటకం మొదలైంది. ఊరికి కొద్దిదూరంలో పొలాల్లో స్టేజీ వేశారు. చుట్టూ డేరాలు కట్టారు. నేనూ, మధుమతి భోజనాలు ముగించుకుని బయల్దేరాం, వీధిలో పోకుమా పొలాల వెంబడి వెళ్ళి స్టేజీని చేరుకున్నాం. మా ఆయన ఏడుగంటలకే వెళ్ళిపోయారు. మేం వెళ్ళి కూర్చున్నామోలేదో లైట్లు ఆరిపోయాయి. తెర వెనక మాత్రం వెలుగుంది.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.