అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు 294

అప్పుడు టైమ్ పదైంది. రాత్రి బ్యాగ్ లో ఆ టౌన్ ను సర్ది వెన్నెల జిప్ వేసేసినట్టు చాలా భాగం చీకటిగా వుంది. అక్కడక్కడా మాత్రం వెలుగు చారికలు కనపడుతున్నాయి. వూరంతా తిరిగి, తిరిగి కాళ్ళు నొప్పిపెడుతున్నట్లు గాలి మెల్లగా వీస్తోంది. ఆమె వంటిల్లంతా సర్ది బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టింది. ఆ అలికిడికి అటు తిరిగి పడుకున్న అతను ఇటుతల తిప్పాడు. లేత పసుపు పచ్చటి ట్రాన్స్ పరెంట్ నైటీలోంచి కనపడుతున్న ఆమె వంపు సొంపులు అతని కళ్ళలో మరో దృశ్యాన్ని అచ్చొత్తుతున్నాయి.

ఆమె జుట్టు ముడివిప్పింది. వర్షం బరువుకి తాళలేని ఓ నీలం మబ్బుతునక ఒళ్ళు విరుచుకుంది. ఆమె తన కళ్ళను సాగదీసింది. కెరటాల ధాటికి ఏమరుపాటుతో ఒడ్డుకి కొట్టుకొచ్చిన రెండు చేప పిల్లలు తిరిగి నీట్లోకి వచ్చి పడ్డాయి. ఆమె ఎద కదిలేటట్టు ఆవుళించింది. పెద్ద కడవలలోని పెరుగును చిలగ్గా వచ్చిన వెన్న రెండు ముద్దలై పోయింది. ఆమె నడుం చిన్నగా కదిలింది.

అంతవరకు విశాలంగా పరుచుకున్న నది సన్నటి పయలాగా చీలింది. బొడ్డు నీటి నైటీని తూటు పెట్టుకుని చూస్తోంది. గంగోత్రిలా నాలుగువైపుల నుండి వస్తున్న నీటి తాకిడికి ఎటూ పోలేని కాగితపు పడవ నిలిచిపోయింది. ఆ తర్వాత కిందకి దిగడానికి లైట్ షేడ్ అడ్డొస్తోంది అతనికి.ఎలాగైనా సరే లిఖితను ఒప్పించాలి. ఈ బంధం నుంచి బయటపడాలి. “పదిగంటలకల్లా తయారయి బయటపడ్డాడు.

ఆఫీసులో వున్నా లిఖితను ఎలా ఒప్పించాలి అన్న ఆలోచన తప్ప మరొకటి మనసుకి అందడం లేదు. రెండేళ్ళలో పెళ్ళి రద్దయిపోవాలి అన్న తన కొత్త ప్రయోగాన్ని ఎలా సమర్ధించాలి అన్నా విషయం మీద రకరకాలుగా రిహార్సల్స్ చేసుకున్నాడు. ఆఫీసు అయిపోగానే బజార్లో అటూ ఇటూ తిరిగి ఏడుగంటలకల్లా ఇల్లు చేరుకున్నాడు. లిఖిత అతను వెళ్ళేటప్పటికి ఏదో పుస్తకం చదువుకుంటోంది.