అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు 294

ఈసారి శబ్దంతో పాటు పాదాన్ని ఏదో పట్టుకుని కొరికింది. అతను ఆగాడు. పాదాన్ని ఎత్తి పట్టుకుని చూశాడు. కొరికినచోట మంట ప్రారంభమై రక్తంలో కలిసిపోతుంది. అతనికి ఏదో అనుమానం వచ్చింది. అటూ ఇటూ చూశాడు. మళ్ళీ కదిలిన చప్పుడు. ముళ్ళ పొదలోకి పోతున్న పాము తోక కనపడింది. అతని అనుమానం నిజమైంది. అంటే పాము కరిచిందన్న మాట. అది నిజంగా పామో కాదో, అది తనను కరిచిందో లేదో నిర్దారించుకునేందుకు ఆగలేదు అతను. కారణం పన్నెండు గంటలకల్లా ఊరికి చేరుకోవాలి.పాలు ఎలా తేవాలా అని ఆలోచిస్తూ జితేంద్ర గదిలోకి వెళ్ళింది.

“గుడ్ మార్నింగ్ మీరు ఇక్కడే వున్నారా?” అతను ఆమెకి విష్ చేసి అడిగాడు. “ఆ” “ఇది నర్సింగ్ హోమా?” పక్కన పరిశీలిస్తూ అడిగాడు. “అవును” అని ప్రారంభించి మొత్తం జరిగిందంతా చెప్పింది. “మీకు చాలా కష్టం కలిగించానే” అతను బాధపడిపోయాడు. తనకు పాము కరిచింది అన్న విషయం కన్నా ఆమెను రాత్రంతా ఇబ్బంది పెట్టానన్న బాధ అతన్ని తొలుస్తోంది. “మరి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇలానే అవుతుంది. అంత రాత్రి పూట వచ్చి శుభాకాంక్షలు చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి?” ఆమె చిరుకోపాన్ని ప్రకటించింది. “మీ అంత అందమైన అమ్మాయి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా వుండడమే” అతను నవ్వుకున్నాడు.

“సంతోషించాంలే ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులో! ఖర్చు కూడా దాదాపు మూడువేల రూపాయలు అయ్యాయి.” “ఆ డబ్బు తీరేవరకు మీ ఇంట్లో పనిచేస్తాలెండి” “మా ఇంట్లోనా?” “ఆ! ఇప్పుడు చిన్నస్వామి ఇంట్లో చేయడం లేదూ- అలానే”ఆయనకి టీ, సిగరెట్ల పిచ్చి. అన్నం లేకుండా అయినా వుండగలడుగానీ టీ, సిగరెట్ లేకుండా క్షణం గడపలేడు. సైట్ దగ్గరే రెండు టీ అంగళ్ళు వుండడం ఆయనకి దైవ దర్శనం లభించినట్టయింది. నలభయ్ ఏళ్ల వయసులో కాస్ట్ లీ డ్రస్ తో తన కొట్టుకి వచ్చిన శ్రీనివాసరావుని చూడగానే తెగ మర్యాదలు చేశాడు తిప్పరాజు. “రండిసార్! వూరికి కొత్తా! పాతా ఏముందిలే రెండు రోజులుంటే కొత్త అయినా మీరు పాత అయిపోతారు.

మరో నెల కనపడక పోతే పాత అయిన మీరు తిరిగి కొత్త అయిపోతారు” అంటూ ఆయనకి కొత్తగా కొన్న గాడ్రెజ్ కుర్చీ వేశాడు తిప్పరాజు. “ఏం తాగుతారు సార్! టీనా? కాఫీనా? టీ అయితే రూపాయి పావలా. కాఫీ అయితే రెండు రూపాయలు. లైట్ గా తాగుతారా? స్ట్రాంగ్ గానా? సిగరెట్లు సిజర్ నుంచి కింగ్ సైజూ గోల్డ్ ప్లేక్ వరకు ఈ అంగట్లో దొరుకుతాయి. మీ పెదవులు రగ్గుల్లోపడ్డ మందారపూల్లా వున్నట్టున్నాయి. అంటే మీరు సిగరెట్లు తాగుతారన్న మాట. ఎలా కనిపెట్టారా అని అనుకుంటున్నారేమో- మరొకరయితే తాయెత్తు మహిమ అంటారు. మీరు కాబట్టి నిజం చెప్పేస్తున్నాను.