చలి అంటుకున్న ఎండ అంత తీక్షణంగా లేదు. పక్కిల్లే అయినా ఆ ఇంటికి నడిచేసైరకి సుమతికి పదినిమిషాలు పట్టింది. నారాయణది పెద్ద అడ్డాపిల్లు. తలుపు కొద్దిగా మూసుంది. అక్కడికెళ్ళి కాసేపు నిలుచున్నా లోపల ఎవరూ వున్నట్టు అలికిడి లేదు. “ఏమండీ!” మెల్లగా పిలిచింది. ఎవరూ పలకలేదు. ఈసారి మరింత గట్టిగా పిలిచింది. “ఎవరూ?” అంటూ నారాయణ లోపలి నుంచి వచ్చాడు. ఎదురుగ్గా సుమతిని చూసి అతను తడబడ్డాడు. తండ్రి భోజనం చేసి పొలం వెళ్ళాడు. ఇక ఆయన సాయంకాలమే తిరిగి వచ్చేది. “రా” అంటూ లోపలికి పిలిచాడు. సుమతి బిందెతో నీళ్ళు చేదుకుని వచ్చేసింది. అప్పట్నుంచి మనసు మనసులో లేదు. నెల తప్పితే ఏం చేయాలన్నది ప్రశ్న.
అదే భయం గుండెల్లో కాపురం పెట్టేసినట్టుంది. సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తోంది. అయిదు గంటల ప్రాంతాన నారాయణ ఇంటికి రావడం కనిపెట్టింది. ఏం కారణం చెప్పి నారాయణ ఇంటికి వెళ్ళాలా అని ఆలోచనలో పడింది. వంట ప్రారంభించింది. కూరలో వేయడానికి చిటికెడంత మిరప్పొడి వుంది. అది సరిపోతుంది కూరకి. కానీ దాన్ని పెరట్లో కిందపోసి వరండాలో విస్తర్లు కుట్టుకుంటున్న తల్లి దగ్గరికి వచ్చింది. “మిరప్పొడి అయిపోయింది. మరిప్పుడు కూర్లోకి ఏమెయ్యమంటావ్?” అని అడిగింది విసుగ్గా. “కొద్దిగా వున్నట్టుందే” “ఏం లేదు” “మరి ఆ ఎదురింటికన్నా వెళ్ళి బదులు అడిగి తీసుకో” “ఆ పిల్ల చేయి విదల్చడం లేదు ఏమడిగినా” “మరిక ఏం చేద్దాం? నారాయణ ఇంటికన్నా వెళ్ళు” ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న సుమతి ఠక్కున నారాయణ ఇంటికి బయల్దేరింది.
నాగభూషణం వీధి అరుగుమీద కూర్చుని ఎద్దులకు ముక్కు తాళ్ళు పేనుకుంటున్నాడు. మొత్తం నీకు గుర్తున్న పేర్లన్నీ రాసేయ్ అని అనాలని వున్నా నిగ్రహించుకుంది. రెండు నిమిషాలు దాటి కాలం సెకనులుగా ప్రవహిస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. చివరికతను ఆమె ఒడిలో తలవాల్చుకున్నాడు. ఆమె వడిలోని వేడి అతన్ని వెచ్చగా కమ్ముకుంటోంది. అతని చేతులు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. ఆమె శరీరం వణుకుతున్నట్టు అతనికి తెలుస్తోంది. అతను మరింతగా రెచ్చగొట్టడానికి తన ముఖాన్ని ఆమె ఒడిలోకి వత్తుతున్నాడు.