అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు 294

దూరంగా రైల్వే బ్రిడ్జి వెన్నెల్లో మసగ్గా కనిపిస్తోంది. ఆమె నడుస్తున్నదల్లా ఠక్కున ఆగింది. భయం ఒంటిని ఝల్లుమనిపించింది. కళ్ళను సాగదీసి చూసింది. ఏదో నల్లటి ఆకారం కల్వర్టుమీద కూర్చుని వుంది. అక్కడే స్మశానం వుండడంతో తెలియకుండానే భయం గుండెల్లో దూరింది. తీతువుపిట్ట అరుస్తున్నట్టుంది. ప్రక్రుతంతా నిశ్చలంగా నిలబడి పోయినట్టు చెట్ల ఆకుల రెపరెపలు కూడా లేవు. అంతవరకు తోడుగా వున్న గాలి తనను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయినట్టు ఉక్కపోస్తోంది. దూరంగా వుండి గమనిస్తుండడం వల్ల ఆ ఆకారం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. అతను జితేంద్రని స్పష్టంగా తెలుస్తూనే వున్నా ఎవరో తెలియనట్టు “ఎవరూ?” అని ప్రశ్నించింది.

“నేను జితేంద్రను” అతను తఃప్పు చేసినవాడిలా మెల్లగా చెప్పాడు. “ఇంటికి వెళ్ళలేదా? ఇంతవరకు ఏం చేస్తున్నావిక్కడ?” “వెళ్ళాను పన్నెండు గంటలకు లేచి వచ్చాను” “ఎందుకు?” “ఈ రోజు నా పుట్టినరోజు” “అయితే?” “పన్నెండు దాటగానే మిమ్మల్ని చూడాలని” అంటే తను మేల్కొనే వుంటుందని ముందే వూహించాడా? అంతే కదా మరి- ‘ఐ లవ్ యూ’ అని చెప్పిన తరువాత తనకు నిద్రొస్తుందని ఎవరూ అనుకోరు. జితేంద్ర మరింత తెలివయినవాడు కనుక సులభంగానే గ్రహించి వుంటాడు.

అయినా రాత్రంతా నిద్ర మేల్కొని మొదటిసారి తనను చూడాలనుకోవడం ఏమిటి పిచ్చి కాకపోతే. ఆ పిచ్చే ఆనందం కాబోలు ప్రేమికులకు. “ఈ రోజు నీ పుట్టినరోజు! ఏమైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలని వున్నా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదే” అంది కావాలనే మాట మార్చాలనే ఉద్దేశంతో కానీ అదే ఆమెకు సరికొత్త సమస్యను తెచ్చిపెట్టింది. “నిజంగా ప్రెజెంటేషన్ ఇస్తారా?” అతను ఎంత ఆశపడుతున్నాడో అతని గొంతే చెబుతోంది. ఆమెకు ఏం చెప్పాలో పాలుపోలేదు. అందుకే అవునూ కాదూ అన్నట్టు తల ఊపింది. ఇంకేం అడగాలనిపించలేదు లిఖితకు. ఏమైనా అడిగితే తను దొరికిపోతుందేమోనన్న భయం. అందునా జితేంద్ర ఎవరికేం చెప్పక పోయినా తనకి అన్నీ తెలుసు.

మరో పదినిమిషాలు అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చుంది. జితేంద్రను చూసినవాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు. ఇక మరెవరూ లేరని నిర్ధారణ కొచ్చాక లోపలికి వెళ్ళింది. పశువుల పాకలో నులకమంచం వేశారు. దానిమీద పడుకుని వున్నాడతను. అతని పక్కన ఎవరూ లేకపోవడం బాధనిపించింది ఆమెకి. మంచం ఓ పక్కగా కూర్చొని ‘జితేంద్రా’ అంటూ పిలిచింది. అతను కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు.

కళ్ళు తెరవడానికయినా శక్తి లేనట్టు వూ అన్నాడు గాని కళ్ళు విప్పలేదు. ఈసారి మరింత గట్టిగా పిలిచింది. అతను కళ్ళు తెరిచాడు. ఆమెను చూడగానే వత్తి ఎక్కిస్తూనే వెలుగు ఎక్కువైనట్టు అతని కళ్ళు మెరిశాయి. “మీరా?” ఆశ్చర్యం, ఆనందం ఆ రెండు అక్షరాల్లోనే కూర్చగలిగాడు. “ఆ…..నేనే- ఏమిటీ పిల్లచేష్టలు? తిండి, నిద్ర మానేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటావా?” కోపగించుకుంటూ అడిగింది. “పూర్వం రుషులు దైవదర్శనానికి తిండీ తిప్పలు మానేసి తపస్సు చేసేవారు. ఎందుకనుకున్నారు? తమ ప్రాణం కంటే దేవుడ్ని చూడడమే