ఇద్దరూ ముసల్దాని ఇంటికి చేరుకున్నారు. ఆ ముసల్దాని పేరు నరసమ్మ. ఆమె వేరుశనక్కాయల్ని స్కూళ్ళ దగ్గర పెట్టుకుని అమ్ముకుంటుంది. ఒక కొడుకు వున్నాడు గానీ వాడెక్కడో దూరంగా బతుకుతున్నాడు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆమె తన పొట్టను తానే పోషించుకుంటుంది. ఎవరైనా విడి జంటలు ఆ ఇంటికి వచ్చి రాత్రి అక్కడ పడుకుని వెళుతుంటారు పోతూ పోతూ పదో, పదిహేనో రూపాయలు ఆమె చేతుల్లో పెడుతుంటారు. ఆ ముసల్ది అలా తన ఇల్లు ఓ రాత్రికి అద్దెకిస్తుందని మొదటిసారి చిన్ని తన వూరి వసంతతో వచ్చినప్పుడు తెలుసుకుంది. వసంతది ఊర్లో అవతలి పక్కవీధి.
ఆమెకీ, చిన్నికీ స్నేహం. ఓరోజు ఇంటికి కావాల్సిన పాత్రలు కొనుక్కోడానికి ఇద్దరూ టౌన్ కి వచ్చారు. పాత్రలు కొనుక్కున్నాక ఇంటికి వెళదామంది చిన్ని. పార్వతమ్మ ఎవర్నో చూసి తన భర్తనుకుంది అని సమాధాన పడింది. మరుసటిరోజు తన భర్త రాగానే…. పెరట్లోకి లాక్కెళ్ళి “నిజమా! కానీ నేను నమ్మలేదు” అని ప్రారంభించి నిన్న జరిగినదంతా చెప్పింది. “పార్వతమ్మకి కళ్ళు సరిగా కనిపించేటట్లు లేవు.
కళ్ళద్దాలు కొనిస్తానని చెప్పు” అని ఒక్క వాక్యంతో బయటపడిపోయాడు. అప్పట్నుంఛీ జాగ్రత్తలు పాటించాలనుకున్నాడు. అందుకే రాత్రుళ్ళు వెళ్ళడం మానుకున్నాడు. ఓ ఆదివారం చిన్నిని టౌన్ కి రమ్మని, ముసల్దాని ఇంట్లో కలుసుకున్నారు. ఇలా రెండు మూడు నెలలు గడిచాయి. ఓరోజు రాత్రి లాస్ట్ బస్ దిగి అత్తగారింటికి నడవడం మొదలుపెట్టాడు. అప్పటికి చిన్నిని కలుసుకుని వారం రోజులైంది. మనసంతా పీకుతోంది. నరాలు రక్తప్రసరణకు అడ్డం పడుతున్నాయి. ఆమెతో గడిపిన ప్రతిక్షణం గుండెల్లో అలజడిని రేపుతోంది. ఆమె చిలిపితనం, పడకలో ఆమె చూపించే కొంటెతనం అన్నీ కళ్ళ ముందు పరుచుకుంటున్నాయి. చిన్ని ఇల్లు వచ్చింది. దాన్ని దాటితే భార్య ఇల్లు.