తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 172

వర్షకి మెలకువ వచ్చింది. పడక మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్ లైట్ వెలుగుతోంది. రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ గా ఫీలయింది. పక్కకు తిరిగి చూస్తే టైమ్ పీస్ అయిదు గంటలను చూపిస్తోంది.

కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్నా తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది. “అబ్బ! ఎంత బావుందో వాతావరణం” తనలో తనే అనుకుంటూ పడకమీద నుంచి కిందకి దిగింది వర్ష.

బాత్రూమ్ లో ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంది. పాతికేళ్ళ పరువాన్ని ఆరోగ్యంతో రంగరించినట్లు మెరిసిపోతోంది శరీరం. ఆమె పెద్ద అందగత్తేమీ కాదు. కానీ ఏదో తెలియని ఆకర్షణ చూపరులను ఇట్టే లాగేస్తుంది. వ్యక్తిత్వపు గుభాళింపువల్ల ఎక్స్ట్రా ఆకర్షణ అది. “ఎవరూ లేరు. ఇంటికి నేనొక్కడ్నే వారసుడ్ని.” ” అయితే నీకు తోడుగా ఇక్కడే వుండిపోతా” క్షణంలో స్నేహం చేయడం, ఎదుటివాడ్ని ప్రేమించటం అతని సహజలక్షణం. అందుకే ఆ పాటి పరిచయంలోనే అడిగాడు. “అలానే” నరుడు ఖుషీ అయిపోయాడు.

“పట్టణాలు బోరు కొట్టాయి గురుడా….. ఆఁ మన స్నేహం మొదలైంది కనుక నేను నిన్ను ‘గురుడా’ అని పిలుస్తాను. సరేనా? ఆఁ ఏమిటి చెబుతున్నాను. పట్టణాలు బోరుకొట్టాయని గదూ. అక్కడంతా మోసం. పైసాయే పరమాత్మ. అందుకే విసుగుపుట్టి ఇలా పల్లెటూర్ల మీద పడ్డాను. నా అదృష్టం కొద్దీ నీలాంటి గొప్ప మిత్రుడు తగిలాడు, నేను ఇక్కడే వుంటూ నీ పనుల్లో నీకు సహాయకారిగా వుంటాను. వ్యవసాయపు పనులు తెలియవనుకో కానీ నేర్చుకుంటాను.” “కానీ నాకు వ్యవసాయం లేదే.” “మరి నీ భుక్తి?” “ఇప్పుడు చూశావు కదా. అలాగే రోజూ క్యారియర్ వస్తుంది.” “రోజూ ఎవరు పంపిస్తారు క్యారియర్ ని?” “నా గురించి చెప్పుకోవడానికేముంది? నాపేరు ధాన్య.

Updated: May 28, 2020 — 10:44 am