తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 172

స్త్రీ చేష్టలవల్ల ఆమె ఎలాంటిదో, ఏం కావాలని కోరుకుంటుందో సులభంగా గ్రహించవచ్చంటాడు వాత్సాయనుడు కామసూత్రాలలో.” ఆమె కాస్త ఈజ్ కావటానికి ప్రయత్తిస్తున్నట్టు కదిలింది. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. పెదవులు విడివడ్డాక ఆమె “సంపుటిక” అంది. ఏమిటన్నట్టు కళ్ళెగరేశాడు. “మీ గురువు వాత్సాయనుడు చెప్పిందే- బిగికౌగిలిలో ఇచ్చే ముద్దును ‘సంపుటిక’ అని అన్నాడు ఆయన. మా ఇంట్లో వుండే ఏకైక పుస్తకం కామసూత్రాలు. మా శ్రీవారు టూర్ వెళ్ళినప్పుడు తెచ్చారు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా పేజీలు తిప్పేదాన్ని.” “మొత్తం పదహారు రకాల ముద్దులుంటాయని చెప్పాడాయన.

అందులో నీకు ఎలాంటి ముద్దంటే ఇష్టం?” అడిగాడు అతను. “పదహారు రకాల ముద్దులకంటే – పదహారులోని ఆరు అంటే చాలా ఇష్టం.” ఓరోజు మా వారు ఆఫీసుకు బయలుదేరుతున్నారు. స్నానం చేసి లుంగీ మొలక చుట్టుకుని తయారవడం మొదలుపెట్టారు. కాఫీ తీసుకుని వెళ్ళి యిచ్చాను. ఆయన్ను చూస్తునే జయంత్ గుర్తుకు రావడంతో “పొట్ట చూడండీ ఎంత అసహ్యంగా వుందో! ఎప్పుడూ ఆ జయంత్ లా టక్ చేసుకోండి” అన్నాను. ఆయన ఏమనుకున్నారో తెలీదు. ఎప్పుడూ ఆయన అతిగా మాట్లాడరు. ఏ ఫీలింగ్ నీ ఎప్పుడూ ఎక్స్ ప్రెస్ చేయరు. ఎప్పుడయినా పూలు ఇంటికి తెచ్చినా దాన్ని అలా సోఫా మీద పడవేస్తారే తప్ప “పూలు పెట్టుకో” అని అనరు.

చివరికి రొమాన్స్ లో కూడా అంతే. నిశ్శబ్దంగా వుంటారే తప్ప. నోరువిప్పి మాట్లాడరు. నిజానికి ఆయనను జయంత్ తో పోల్చిచూడడం తప్పు. నలభైఏళ్ళ వాడికి ఇరవై రెండేళ్ళ కుర్రాడితో పోల్చి అలా వుండమని అడగడం ఎబ్బెట్టుగా వుండే విషయం. జయంత్ ఎప్పుడూ టక్ చేసుకుని వుంటాడన్న భ్రమ నాకుంది. అతనూ ఇంట్లో మా ఆయనలానే పొట్ట కనబడటేట్టు లుంగీ లు వుంటాడన్న నిజం నాకు తట్టలేదు. ఇలా విశ్లేషించుకుంటూ పోతే దేన్నీ సరిగా అనుభవించలేమనుకుంటా. అందుకే చాలామంది హృదయం ఎలా చెబితే అలా నడుచుకుంటారే తప్ప బుద్ధితో ఆలోచించరు. నేనూ అంతే.

Updated: May 28, 2020 — 10:44 am