తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 172

ఈ జ్ఞానం వచ్చాక అర్ధం పర్ధం లేకుండా ఉపవాసాలు చేయం కనిపించిన ప్రతి చెట్టునీ, పుట్టనీ మొక్కం ఎవరితోనో రాత్రి గడిపితే సిరిసంపదలు వస్తాయని గుడ్డిగా నమ్మం.” కోపతాపాలు వద్దు గంటసేపు పోట్లాడినా నిముషంలో రాజీ అయిపోవాలి. కొందరు చిన్న విషయాన్నైనా రోజులకొద్దీ సాగదీస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీరు సాధించేది ఏమీ లేకపోయినా మీ అమూల్యమైన కాలాన్ని నష్టపోతున్నారు. ఇరవై నాలుగ్గంటలూ ఒకే రూఫ్ కింద నివసించే భార్యాభర్తల మధ్య ఘర్షణలు రావడం అతి సహజం. కాబట్టే ఎప్పుడైనా కోపం వచ్చినా, చిరాకు కలిగినా వెంటనే సర్దుకోండి అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. పెళ్ళివల్ల లాభమా? నష్టమా అని ఒక అవివాహిత మిత్రుడొకడు అడిగితే మరో మిత్రుడు “పగలు నష్టం, రాత్రి లాభం” అని జవాబిచ్చాడు.

అలా పెళ్ళామంటే కేవలం కోరిక తీర్చే యంత్రం కాదు. ఆమె మనిషి అన్ని ఆవేశాలూ, అభిరుచులూ ఆమెకీ వుంటాయి. అందుకే ఓ మనిషిగా విలువ ఇవ్వాలి. గౌరవించాలి. ప్రేమించాలి మీ ప్రతి ఫెయిల్యూర్ కి ఆమె కారణమని నిందించకండి. గంగిగోవుకు కూడా రెండు వాడి కొమ్ములుంటాయన్న విషయం మరిచిపోకండి. కొంతమంది స్త్రీలు ఎప్పుడూ అసంతృప్తితో వేగిపోతుంటారు. ఇది దుర్లక్షణం. ఎదురింటి సీతతోనో పక్కింటి గీతతోనో పోల్చుకుని అసంతృప్తికి గురవుతుంటారు.

ఇది తప్పు మనకు ఎంతున్నది అన్నది ముఖ్యం కాదు. మనం ఎంత ఆనందంగా వున్నామన్నదే ముఖ్యం ఆఫీసులో ఆఫీసర్ తిట్టాడని ఇంట్లో భార్య మీద చిరాకు ప్రదర్సించకూడదు. రాత్రిని పగలు చేసే వెన్నెల… చల్లగా చుట్టుకునే గాలి, గమ్యం లేకుండా పరుగులు తీస్తున్న బాటసారిలా పయనించే మబ్బులూ… ఇవన్నీ మీకోసమే! కాబట్టి కోపతాపాలు వద్దు. ఎంచక్కా రాత్రి కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపి బెడ్ రూమ్ గడియ పెట్టేయండి. Feedback……

Updated: May 28, 2020 — 10:44 am