తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 172

రోజులాగే అర్థం కానట్లు మొహం పెట్టి ఏమైనా చెబుతాడేమోనన్నట్టు చూసింది. అతను అక్కడ నుంచి కదలలేదు. ద్వారం దగ్గరికి వచ్చి చూశాను. వీధిలోగానీ, ఇళ్ళ బయటగానీ ఒక్కరూ కనిపించలేదు. అందరూ తలుపులు బిడాయించుకుని లోపల వుండిపోయారు. నేనూ లోపలికి వచ్చి తలుపు కొద్దిగా మూసాను. ఇక భయంలేదని సుధీర్ పక్కన కూర్చున్నాను. అవ్వ తలుపువైపు తిరిగి పడుకోవడం వల్ల ఆమె వీపు మాకు కనిపిస్తోంది. నేను తగులుతుండడంతో సుధీర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు.

మనసు మరేదో కోరుకుంటున్నట్లు ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాయి. “ఏమిటీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్?” అని అతని అవస్థ చూసి కిలకిలా నవ్వాను. “నీలాంటి అందమైన అమ్మాయిని పక్కన వుంచుకుని ఊరకనే వుంటే పిచ్చి పట్టకుండా వుంటుందా?” “ఏం కావాలి?” “దేవుడులాగానే ఇదీ అర్థం కాలేదు గురుడా.” “కరెక్టే. దేవుడు అర్థం కావాలంటే వయసు ఉడిగిపోవాలి. ప్రేమ అర్థం కావాలంటే వయసు పరిపక్వం చెందాలి.” “ప్రేమే దేవుడు అంటారు గదా. అలా ఎందుకని అంటారు? రెంటికీ గల సామీప్యత ఏమిటి గురుడా?” “ఏమో నరుడా! నాకూ తెలియదు.” అప్పటికి అమ్మాయిలు మరింత దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూడటం లేదు.

తలవొంచుకుని ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్నది ధాన్య అని గుర్తించాడు గోపాలకృష్ణ. వెనక వస్తున్నదెవరో తెలియడం లేదు. “గురుడా! ఎవరో అమ్మాయిలు ఇటే వస్తున్నారు” నరుడు ఎగ్జయిట్ మెంట్ ను అణుచుకుంటూ అన్నాడు. “చూశానులేరా” అని “తమాషా ఏమిటంటే వాళ్ళు మనల్ని చూడకుండా మనం నడుస్తున్న పొలం గట్టుమీదకే వచ్చారు. ఈ గట్టుమీద ఇద్దరు దాటు కోవడం కష్టం. ఎవరో ఒకరు పొలంలోకి దిగి ఎదుటివాళ్ళకు దారివ్వాలి.

Updated: May 28, 2020 — 10:44 am