తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

అందుకే ఇక అక్కడి నుంచి పలాయనం చిత్తగించాలని నిర్ణయించుకున్నాడు. బతికుంటే బలుసాకు తిని బతకవచ్చని ఎలాంటి సందర్భంలో పెద్దలు అని వుంటారో తెలిసింది. ప్రస్తుతానికి అదే మంచిదని నిర్ణయించుకున్నాడు. “బ్రా పొడుపు కథలాంటిది. నేర్పుతో విప్పగలిగితే అదెంత సులభమో, ఒడుపు లేకుంటే అంత కష్టం. బ్యాక్ ఓపెనింగ్ కాబట్టి టెక్నిక్ తో విప్పగలగాలి” అని నవ్వుతూ అతని చేతుల్ని వెనక్కి నెట్టింది. అతను చేతులు కదలకపోయేసరికి తనే దాని బంధనాలు తొలగించింది. “ఇక చివరిది- లంగాముడి- ఇది విప్పితే మిస్టరీ అంతా తెలిసిపోతుంది.

దయచేసి ఈ సినిమా క్లయిమాక్స్ ఎవరికీ చెప్పకండి! అని అంటూ వుంటారే- అలాగా దీన్ని ఎలా విప్పాలో మాత్రం నేను చెప్పను” అంటూ అతని ఒంటినంతా చూపులతో తడిమింది. “కొంపదీసి గురువుగారి దగ్గర సిగ్గుపడుతున్నావా ఏమిటి? శృంగార వాక్యంలో స్త్రీ సిగ్గు కామాలాంటిదైతే, పురుషుడి సిగ్గు ఫుల్ స్టాప్ లాంటిది. కాబట్టి మగవాడు సిగ్గుపడకూడదు” అంటూ గట్టిగా అదుముకుంది. నోటితో అతన్ని మీటుతున్నట్లు ముద్దుల్లో ముంచెత్తింది. ఆశ్చర్యం- అతనిలో ఎలాంటి ఉద్రేకమూ లేదు. ఏదో దృఢమైన కారణం వుంటే తప్ప అంతవరకూ చలనం లేకుండా వుండడం అసాధ్యం.

అందుకే ఖంగుతిన్నట్లు అలజడితో అతనివైపు చూసింది. “చూశావా కస్తూరి! శృంగారంలో మనకు ముఖ్యం అది తిరగబడితే ఎంత రెచ్చగొట్టినా ప్రయోజనం శూన్యం. ఒక విధంగా నాకు నేనే పరీక్ష పెట్టుకున్నాను. నేను ఉద్రేకానికి లోను కాకుండా వుండగలనా అని టెస్ట్ చేసుకున్నాను. ఇందులో నేనే గెలిచాను” గంభీరంగా చెబుతున్న అతనివైపు ఏమీ అర్ధం కానట్లు కస్తూరి ఆశ్చర్యంగా చూసింది. “కస్తూరీ! నేను ఇకనుంచీ పౌర్ణమిరోజు ఆచారాన్ని కొనసాగించను! నా మనసు పూర్తిగా పరాధీనమైపోయింది. ఈ ఆచారాలూ, ఈ మూఢ నమ్మకాలూ- వీటన్నిటికీ ఫుల్ స్టాఫ్ పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఎదుటివార్ని దోపిడీ చెయ్యడానికే ఏర్పాటు చేయబడ్డాయి.

Updated: May 28, 2020 — 10:44 am