తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

సాయంకాలమైతే నేనూ, పిల్లలూ నర్సరీ దగ్గరికి వెళ్లడానికి తయారైపోయే వాళ్ళం. ఎప్పుడైనా జయంత్ కనిపించకపోతే ఏదో వెలితిగా వుండేది. అయితే ఆ వెలితి ఎందుకో, అతను నుంచి నేను ఏం కోరుకుంటున్నానో నాకే తెలీదు. ‘మీకు పెళ్ళి కాకుండా పదహారేళ్ళ బాలకుమారిగా వుంటే బహుశా మీమీద ఇంత మోహం వుండేది కాదేమో’ అన్నాడు. అతని జవాబు నా తల తిప్పింది. పెళ్ళి కావడమే అతను నన్ను ఇష్టపడడానికి వున్న క్వాలిఫికేషన్ అని డైరెక్టుగా చెప్పాడు. “అనుభవాలతో పండిన మీ అందం నన్ను పిచ్చివాడ్ని చేస్తోంది” అని కళ్ళు దించుకున్నాడు. ఈసారి అతను సీరియస్ అయిపోయాడు. తను చెబుతున్న దాంట్లో వున్న నిజం గాఢతను నాకు తెలియజేయడానికే సీరియస్ అయిపోయాడని అవగతమైంది. “వివాహితగా నాకు కొన్ని హద్దులున్నాయి.

వాటిని దాటితే నా పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో ఆలోచించు” అన్నాను. “అంతే మీకు ఇష్టమేనన్నమాట” అతని కళ్ళల్లో ఆనందం చిమ్మింది. అంతవరకు నేను ఇష్టంలేదని చెబుతానేమోనన్న అనుమానం పటాపంచలు కావడంతో ముఖం మరింత కాంతివంతమైంది. ఒక స్త్రీ తనను యాక్సెప్టు చేసినప్పుడు మగవాడు అంతగా ఎగ్జేయిట్ మెంట్ కి గురవతాడని నాకు తెలియదు. కానీ నేను ప్రకటించిన భయంలో అతను తీసుకున్న అర్థం వుందా అని ఒక్క క్షణం ఆలోచించాను. ఆయనలో చిన్న కదలిక. “అతనితో వుంటావా?” కాసేపు మౌనం తరువాత అడిగారు. “బహుశా వీలు కాదనుకుంటాను. మా ఊరు వెళ్ళిపోతాను.” “పిల్లలు?” “మీరు వాళ్ళను చూసుకోలేరు. డ్యూటీలో బిజీగా వుండే మీకు వాళ్ళ పోషణ చాలా కష్టం.

అందుకే నేను తీసుకుపోతాను. వేసవికాలం సెలవులకో, పండగలకో మీ దగ్గరికి పంపిస్తాను.” “ఇక మాట్లాడవలసింది ఏమీలేనట్లు ఆయన బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బయల్దేరి ఈ ఊరు వచ్చేశాను. అమ్మా వాళ్ళకు నేనొక్కదాన్నే సంతానం. అందుకే మొదట్లో బాధపడ్డా తర్వాత సర్దుకున్నారు.”

Updated: May 28, 2020 — 10:44 am