తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

అక్కడ అమ్మే డ్రింక్స్ లో కాస్ట్ లీ డ్రింక్ రోజ్ మిల్క్ అందరికీ వాటిని తెప్పించాడుగానీ ధవళ మాత్రం తీసుకోలేదు. ఆమె నీలం పూలున్న గ్రీన్ షిపాన్ చీర కట్టుకుంది. వెనక భాగం బాగా కనిపించేటట్టు కుట్టిన జాకెట్ వేసుకుంది. ఆమె వెనక భాగం అంతా విశాలంగా కనిపిస్తూ పెద్దింటి ముందు వేలాడదీసిన టులెట్ బోర్డులా అనిపిస్తుంది. ఆమెకు రెండేళ్ళ క్రితమే వివాహం జరిగింది. ఇంకా పిల్లల్లేరు. ఆమె భర్త పరమేశ్వరరావు శృంగారపురంలో పెద్ద రైతు. గోపాలకృష్ణ ఎక్కడా కనపడకపోయేసరికి కాస్తంత నీరసం ఆవహించింది. కానీ పట్టు వదలకుండా కొండ ఎక్కుతోంది.

ఎవరో ఆకతాయి కుర్రాడు గబుక్కున చందమామ మీదున్న ముసుగును లాగేసినట్టు మబ్బులు తొలిగాయి. వెన్నెల ఒక్కసారిగా లోకం మీదకు జారింది. ఆ వెలుగులో తల పైకెత్తిన ఆమెకు డాబా మీద పిట్టగోడకు ఆనుకొని తననే చూస్తున్న గోపాలకృష్ణ కనిపించాడు. ఆమె ఎంతో సంతోషంగా చేయి వూపింది. అతను చేయి వూపాడు. ఆమె పరుగులాంటి నడకతో మెట్లెక్కి డాబా చేరుకుంది. వూరికంతా ఎత్తుగా మబ్బుల మధ్య వూగుతున్నట్లు తెల్లటి పరుపు కనిపించింది. దానిమీద కూర్చుని “హమ్మయ్య నువ్వు కనపడకపోయేసరికి ఏమైనావోనని హడలిపోయాను” అంది ఆయాసాన్ని దిగమింగుకుంటూ. లోపలికెళ్ళాను. అమ్మ గదిలోకి వచ్చి ‘పెళ్ళివారొచ్చారు త్వరగా తయారవ్వు అంది.

చీర మార్చుకుని వచ్చి కూర్చున్నాను. అలవాటైన ప్రశ్నలూ- అలవాటైన సమాధానాలు. అరగంటకు ఆ తంతు ముగిసింది. చిత్రంగా నాన్న కూడా వాళ్ళతోపాటే కారెక్కి వెళ్ళిపోయారు. మరో నాలుగు రోజులవరకు నాన్న జాడలేదు. అయిదోరోజు సాయంకాలానికి వచ్చాడు. చేతిలో వున్న పెద్ద ప్యాకెట్ టేబుల్ మీద పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళాడు. అమ్మ నా దగ్గరకు వచ్చి “నీ పెళ్ళి శుభలేఖలు అవి వెళ్ళి చూసుకో టైమ్ ఎక్కువ లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వుంటే రేపే పోస్ట్ చేసెయ్” అంది. అంతా ముక్తసరిగా చెప్పి తన పనుల్లో మునిగిపోయింది. నేను ప్యాకెట్ విప్పాను నా నిరీక్షణ ఫలించినట్లు నవ్వుతున్నాయి శుభలేఖలు. మొదటి పెళ్ళిపత్రిక సుమతికి పంపాలి కాబట్టి అడ్రస్ రాయడానికి పెన్ కోసం వెదికాను ఎక్కడా కనిపించలేదు. హాల్లోని టేబుల్ మీద వుందేమోనని అటు వెళ్ళాను.

Updated: May 28, 2020 — 10:44 am