మోజు పడ్డ మగువ 355

సంకెళ్ళు జీవితాన్ని చుట్టేసిన ముళ్ళు-రూసో ఒక్కడే వీటిని తెంచగలడు – సోషల్ కాంటాక్ట్ వల్లే ఈ పరువు మర్యాదలు, వంశప్రతిష్టలు, నైతికానైతిక మీమాంసలు-వీటన్నిటినీ బద్దలు కొట్టగలగాలి. అనుభూతి ఒక్కటే ముఖ్యం – జాన్ లాక్ చెప్పింది అదే గదా- గోనె సంచిలో కుట్టేసినట్లు ఊపిరాడదు- కవాటాలేవీ తెరుచుకోవు-ప్రతీ క్షణం ఏమీ తోచకపోవడం మెదడులో కాంక్రీట్ ని పోస్తుంది. అందుకే గుండె వికసించక ముందే వాడిపోతుంది- ఎంత నెత్తురు పోసినా అది విచ్చుకోవడం లేదు- జీవితం అర్ధరహితం- ప్రపంచం అంతకంటే నిరర్ధకం-మనిషి ఎప్పుడూ ఏకాకి – ఎవరూ తోడుండరు- ఇదంతా స్వయంకృతాపరాధం- అసలు నాకేం కావాలి? అది తెలిసిపోతే జీవితానికి అర్ధం తెలిసిపోవును.

చివరికి మిగిలేది అదే. బుచ్చిబాబులాగా మనమూ కొన్ని ఊహిస్తే బావుంటుంది. మనకవులు, రచయితలూ స్వర్గానికి వెళ్ళగానే మొదట ఏం మాట్లాడారో ఆలోచిద్దాం. కందుకూరి వీరేశలింగం “ఒక్క వితంతువూ కనపడడం లేదే” – గురజాడ “యాంటీనాచ్ ఉద్యమం ఇక్కడా తప్పేటట్లు లేదు” – చలం “శచీదేవి.

ద్వారపాలకుడు ఎటెళ్ళారు?” – విశ్వనాథ “మంచి లేఖకుడు కావాలి”- కృష్ణశాస్త్రి ‘ఇక్కడా ఏడుపొస్తోంది’ శ్రీశ్రీ ‘రంభా! ఇటు “రమ్ము”- బుచ్చిబాబు ‘అమృతం’- అమృతంలా ఒక్కరోజైనా బతికితే చాలు- అంత ధైర్యం వుందా తనకు? ఈ మనుషుల నుంచి ఎలా తప్పించుకోవడం- ఈ సంఘం మాంసాహారం తినే పువ్వు- ఫ్రాన్స్ గోడలమీద ఓల్టేర్ విశ్వరూపం- “అలా బయటికి వివేక్ థెంకర్ స్టాట్యూ దగ్గర వెయిట్ చేస్తుంటానన్నాడు. బయట వెన్నెల- ఎంత బావుందో- చూద్దువురా” అంటూ ఆమెను బలవంతంగా గేటు దగ్గరికి లాక్కొచ్చింది.

కారిడార్ అంతా నిశ్శబ్దంగా వుంది. “అటు చూడు చందమామ – ఆకాశంలో వెండి గడియారంలా వేలాడుతోంది. కార్తీకమాసపు వెన్నెల్ని అనుభవించకుండా, అలా మూడంకి వేసుకొని రూమ్ లో పడుకోవడం కంటే మించిన పాపం మరొకటి వుండదు. కైలాసం నుంచి పడిపోయిన ఢమరకం, ఆవేశానికి భూమిలోకి సగం కూరుకుపోయి, మిగిలిన సగం కన్పిస్తున్నట్లు వుండే మన ఆడిటోరియంపైన పడుకోవడం ఎంత బావుంటుందో బ్రహ్మానందం అంటారే అదేనేమో, వెన్నెల్లో తడిసి మనసుకు జలుబు చేయడం అంటే అంతేనేమో” “గేట్లు అన్నీ మూసేశారుగదా! ఎలా వెళతావు?” “దొంగదారి ఒకటుందిలే ఏ విషయంలోనైనా మార్గదర్శకులు వుంటారు కదా అలాంటివాళ్ళు ఏర్పాటు చేసిందే ఆ దారి రా! అక్కడివరకు వచ్చి తిరిగి వచ్చేద్దువు” అంది రమ్య.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.