మోజు పడ్డ మగువ 345

అప్పుడప్పుడూ తను రాలేనప్పుడు కూతుర్ని చూసి యోగక్షేమాలు కనుక్కురమ్మని పంపిస్తుంటుంది సూర్యాదేవి తల్లి. “ఏవీ శనగుండలు తీయ్” సంచీలోంచి ఒకటి తీసిచ్చింది చామూ. సూర్యాదేవి దాన్నందుకుని కొరికింది. తీయగా తగిలింది నాలుకకి. తన ఇల్లూ, తల్లీ, తమ పొలాలు అన్నీ కళ్ళముందు నిలిచాయి ఆమెకి. అంతకు ముందున్న ఆందోళనంతా ఎగిరిపోయింది. ఏదో ప్రశాంతత మనసంతా అల్లుకుంది. చిన్నప్పుడు ఆమె తలనొప్పిగా ఉందంటే నడివీధిలోకి వెళ్ళి కాస్తంత మట్టిని తీసుకొచ్చి దిష్టి తీసేది తల్లి.

దిష్టివల్లో, లేక అభిమానానికి ఆలోచనలు మరోవేపుకు డైవర్టు అయ్యేయో తెలియదుగాని తలనొప్పి పోయేది. ఇప్పుడూ అలాగే శనగుండలు తింటూ ఊరూ, ఊర్లో తమ ఇల్లూ, ఇంటి పెరట్లో వుండే కొబ్బరిచెట్లూ, వాటి ఆకులు పట్టుకుని గెంతే చందమామా, పంటపొలాల నుండి వచ్చేగాలీ- ఇవన్నీ గుర్తొచ్చి మనసంతా తేలికయిపోయింది. జ్వరం తగ్గిన తరువాత రసం అన్నం తింటూ ఆ రుచిని శాంతంగా అనుభవించినట్లు అనిపిస్తోంది. ఏదో తెలియని హుషారు శరీరంలో ఇమడలేక గుండెను గంతులేయిస్తోంది. నిముషం ముందు తనను కంగారు పెట్టిన సమస్యను తలుచుకుంటుంటే నవ్వొచ్చేంత ఈజ్ అయిపోయిందామె. “చామూ! ఇంట్లోకి వెళ్ళి ఈ బ్యాగ్ పెట్టిరా జాలీగా అలా తిరిగొద్దాం” అంది. “కార్లోనే” చాముండి కళ్ళను పెద్దవి చేసింది. కార్లో వెళ్ళడమంటే ఆమెకి మహాసరదా. మొత్తానికి వెంకటరమణ భలే భార్యను కొట్టేశాడే? దేనికైనా అదృష్టం వుండాలి.

ఇలాంటి మాటలు నాకు విన్పిస్తూనే వున్నాయి. కూలిపనికి వెళ్ళకుండా పుట్టింట్లో కుదిరిందిగానీ ఇక్కడ కుదిరేటట్లు లేదు. ఆయనకి రెండుపూటలా భోజనం పెట్టి నెలకు నాలుగువందలు ఇచ్చే వాళ్ళు దాంతో కుటుంబం గడుస్తుందిగానీ బట్టలూ, ఆరోగ్యాలు ఇలాంటివి కుదరవు. అందుకే పనికి వెళ్ళకుండా వుండడం కష్టం. మెల్లగా పనులకు వెళ్ళడం ప్ర్రారంభించాను. మొదటిరోజే ఊరు మొదట్లో కూతోడు తగిలాడు. వాడు అన్నీ పచ్చిపచ్చిగా హాస్యంగా మాట్లాడడం వల్ల వాడికి ఆ పేరొచ్చింది. వాడికి నలభైయేళ్ళకు పైగానే వుంటాయి. నేను మిగిలిన స్త్రీలతో కలిసి కలుపు తీయడానికి వెళుతుంటే ఆపాడు. “నువ్వా వెంకటరమణ భార్యవి, ఎవరో చెప్పుకుంటుంటే అబద్దం అనుకున్నాను గానీ నిజంగానే వజ్రంలా ఉన్నావు. వాడొట్టి అర్బకుడు.

నీలాంటి దాని ముద్దూ ముచ్చట వాడేం తీరుస్తాడు. నువ్వు కొంగుజారిస్తేనే వాడు బహుశా మూర్చతో పడిపోయుంటాడు” అన్నాడు. నా పక్కనున్నవాళ్ళు కూడా వాడితోపాటు నవ్వుతూ శ్రుతి కలిపారు. సాటి ఆడపిల్లను అలా వాడు అంటే మూతిమీద రెండు ఇవ్వాల్సింది పోయి నవ్వుతారా? అందుకే అటువంటి వాళ్ళ దగ్గర చీప్ అయిపోతాం మేము. అదే రైతు స్త్రీల దగ్గర వాడలా మాట్లాడగలడా? కేవలం మా దగ్గరే వాడు తన ప్రతాపం చూపిస్తాడు. “చాముండీ- మావాడ్ని భద్రం కిందా మీదా పడ్డా గుట్టుగా సంసారం చేసుకుంది” వాడి మాటలు ముందుకు అడుగులేస్తున్న నాకు విన్పిస్తూనే వున్నాయి.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.