మోజు పడ్డ మగువ 345

నేను స్నానాల గదిలోకి దూరాను. వాడు మా ఇంటిదగ్గర సేద్యానికి నిలిచిపోయి, ఫ్యాక్టరీకో వెళ్ళి పోతాడేమోనన్న శంక విచిత్రంగా మాయమైపోయింది. మళ్ళీ ఒంటరిగా ఆమైదానంలో మాట్లాడే తోడులేక పిచ్చి పడుతుందేమోనన్న భయం చిత్రంగా అదృశ్యమైపోయింది. అభద్రతా భావం తొలగిపోయింది. నన్ను వాడెప్పటికీ వదిలిపెట్టి వెళ్ళలేడన్న నమ్మకం కలగడం వల్ల కాబోలు మొదటిసారి ఆ ఇంట్లో ఎనిమిది గంటలకల్లా నిద్ర ముంచుకొచ్చేసింది” అని చెప్పడం ముగించింది సౌందర్య.

కానీ చాలాసేపటి వరకు సూర్యాదేవి ఆ కథ మూడ్ లోనే వుండిపోయింది. * * * * * మరుసటిరోజు ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేచింది సూర్యాదేవి. అప్పటికే సౌందర్య లేచి అన్ని పనులూ ముగించుకొని రెడీగా వుంది. “గుడ్ మార్నింగ్ లేట్ గా లేచాననుకుంటా- ఎందుకనో ఈ మధ్య పొద్దుబోయిందాకా సరిగా నిద్ర రావడం లేదు” “నిద్ర రావడంలేదంటే – మనకేదో తీరని అసంతృప్తీ – లేదూ జీవితమంటేనే భయమూ వున్నాయన్నమాట” అంది సౌందర్య. మొత్తం భూమి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. మనుషులంతా ఆ విస్ఫోటనానికి మరణిస్తారు.

మనిషి ఇంతకాలంగా నిర్మించుకున్న నాగరికతంతా క్షణంలో బూడిదై పోతుంది. ఈ భవంతులు. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు సర్వం నాశనమైపోతాయి. ముక్కలు ముక్కలుగా విడిపోయిన భూమి విశ్వంలోకి విసిరివేయబడుతుంది. అంటే మానవ చరిత్రకు, భూమి చరిత్రకు మరో వారంలో చరమగీతం పాడబోతోంది షూమేకర్- లెవీ-10 మొత్తం వార్తంతా చదవగానే సూర్యాదేవికి చెమటపట్టింది. దిగులు, బాధా కలగాపులగంగా కలిసిపోయాయి. చిన్నగా శరీరం వణుకుతోంది. ఎంత కంట్రోలు చేసుకున్నా వీలు కావడంలేదు. ఆమెకు చప్పున వసంత్ గుర్తొచ్చాడు. కన్నతల్లిదండ్రులకన్నా, కట్టుకున్న భర్తకన్నా అతను గుర్తురావడం ఆశ్చర్యమనిపించింది. తను అతనిని అంతగా ప్రేమిస్తోందా? ప్రేమంటే ఇదేనా? అయినా భూమి ముక్కలై పోతున్నప్పుడు కూడా ఈ సందేహాలు తనను వదలవా? వసంత్ కూడా అదే రోజు గడువుపెట్టాడు.

2 Comments

  1. It agree, this magnificent idea is necessary just by the way

  2. Sveiki, as norejau suzinoti jusu kaina.

Comments are closed.