అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు 294

ఈ పని చేసి పెడితే నీకేం కావాలంటే అదిస్తాను” అన్నాడు. “ఏమడిగితే అదివ్వాలి” “ఒట్టు” అంటూ చేతిలో చేయి వేశాడు. “వారం రోజుల్లో పని ముగించేస్తాను” అన్నాను. మాట ప్రకారం వారం రోజుల్లో ఆ పిల్లను రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాను. “ఎలా?” “చెబుతాను మంచి కాఫీ తెప్పించు” అంది రంగనాయకి. “ఆరోజు కనబడ్డావంతే ఎక్కడికెళ్ళావ్?” బావిలోంచి అడగడంతో ఆమె గొంతు కొత్తగా వినిపించింది అతనికి. “ఇక్కడే వున్నాను. రోజూ మీకు నేను కనిపించక పోయినా మీరు నాకు కనిపిస్తుంటారు కదా” అంటే రంగనాయకి చెప్పింది నిజమేనన్నమాట. “ఎలా కన్పిస్తాను?” “దేవాలయం అరుగుమీద కూర్చుంటాను. అక్కడినుంచీ మీ ఇంటి కిటికీలు కనిపిస్తాయి.

మీరు ఇంట్లో తిరుగుతుంటారు గదా! అప్పుడు మీ రూపమో, మీ నీడో ఈ అభాగ్యుడి కళ్ళలో పడుతుంది. దాంతో తిరిగి వచ్చేస్తుంటాను” “మరి నాతో మాట్లాడాలనిపించదా?” “ఎందుకు మాట్లాడడం?” ఆ జవాబుకు ఆమె ఖంగుతింది. అలా అయితే చూడడం కూడా ఎందుకు? అదే ప్రశ్న వేసింది. “నాకు అలా చూడడం ఇష్టం కాబట్టి మీతో నేను మాట్లాడడం ఇష్టమని చెప్పండి- అప్పుడొచ్చి మాట్లాడతాను.” “అంటే నాకిష్టం లేకపోతే ఏమీ చెయ్యవా?” ఆమె చెప్పడానికి సందేహిస్తున్నట్టు ఓ నిముషం పాటు ఆగింది. ఇక చెప్పక తప్పదని నోరు విప్పింది సబిత. “శేఖర్ తెలుసు కదా మన పక్క పొలం స్వంతదారు. అతనికి రేపు ఈ లెటర్ ఇవ్వాలి” అదన్న మాట విషయం.

తను వాళ్ళిద్దరికీ మధ్యవర్తిగా వుండాలన్న మాట. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. తను లిఖిత కోసం ఆరాట పడుతున్నట్టే ఈమె ఆ శేఖర్ కోసం అలమటిస్తుండవచ్చు. తమది ఉన్నతమైన ప్రేమని, ఎదుటి వ్యక్తులది నీచమైన ప్రేమ అని అనుకోవడం మూర్ఖత్వం. తమని తాము గొప్ప చేసుకుని ఆత్మవంచన చేసుకోవడం తనకి నచ్చని విషయం. ఇది కూడా సాయం చేయడమే అవుతుంది.

ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు. అందుకే జితేంద్ర “సరే” నంటూ ఒప్పుకున్నాడు. “మా మంచి జీతూ” ముద్దుగా అని వెళ్ళిపోయింది సబిత. మరుసటి రోజు అతను పొలంలో వున్నప్పుడు సబిత భోజనం క్యారియర్ తీసుకువచ్చింది. “వడ్డాణం తెచ్చావా?” జితేంద్ర ఆతృతతో అడిగాడు. “నీ కన్నీ తొందరే” అంది సబిత అటూ ఇటూ చూస్తూ. “ముందు భోజనం చెయ్” చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ కొచ్చాక అంది. అతను క్యారియర్ విప్పి మొదటి గిన్నె తీసేటప్పటికి అతని కళ్ళు చెదిరాయి. బుట్టలో పాము నిస్తేజంగా పడుకున్నట్లు ఆ గిన్నెలో వడ్డాణం వుంది.