అతనికి తెలియకుండానే అతని కాళ్ళు చిన్ని యింట్లోకి దారితీశాయి. అప్పటికే గోకుల్ పొలం దగ్గరికి వచ్చి దాదాపు గంటైంది. ఈరోజు వస్తుందో రాదోనన్న బెంగ అతన్ని కాల్చుకుతింటోంది. ఆమె వస్తుందన్న ఆశ ఎక్కడో మిణుకుమిణుకుమంటోంది. రాదేమోనన్న నిరాశ కాగడలాగా మండుతోంది. ఒక్క క్షణం కాలు నిలవడంలేదు. మాటిమాటికీ ఏటివైపు చూస్తున్నాడు. కొన్ని ఏళ్ళపాటు ఘోరమైన తపస్సు చేశాక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు భక్తుడు ఎలా పొంగిపోతాడో అలా అతను జర్క్ ఇచ్చాడు. కెరటం తీరం దాటి వస్తున్నట్టు దూరంగా పద్మజ ఏటిగట్టు దిగుతుండడం అతనికి కనిపించింది. కానీ తను ఇలా వెయిట్ చేస్తున్నట్టు ఆమె కనిపెట్టడం అతనికీ ఇష్టం లేదు. అందుకే పాకలోకి వెళ్ళి పుస్తకం తెరిచాడు. పద్మజ పొలం దగ్గరికి వచ్చింది.
పొలంలో ఎవరో ఒకరు వున్నట్టు ఆమె కూడా ఏటిగట్టు దిగుతున్నప్పుడు గమనించింది. అతను గోకుల్ అని పోల్చుకోగలిగింది. మరి ఇప్పుడు ఎవరూ లేకపోవడంతో తమ పొరబాటు పడ్డానేమో నన్న అనుమానం వచ్చింది. ఆ పోస్టు డబ్బాని చూసి ఎవర్ని చూడాలని కోరుకుంటానో వాళ్ళు కనిపిస్తారన్న మాట అదో సెంటిమెంట్ “చూశావ్ గా ఉదయం వెళ్ళి పోస్టుడబ్బాని చూసి నువ్వు కనిపించాలని కోరుకున్నాను. సాయంకాలానికి కనిపించావ్” “అంటే నీకు పోస్టు డబ్బా దేవుడన్న మాట” హాయిగా నవ్వాడతను. “వూ- రేపు సాయంకాలం వరకు నిన్ను చూడొచ్చు.
కూలీల్ని పిలుచుకుని ఉదయానికల్లా వచ్చేస్తాను. సరేనా” “అలాగే” ఇద్దరూ ఏటిగట్టు దగ్గరికి వచ్చారు. అతను కిందదిగి ఊరికి వచ్చేయాలి. “మరి వస్తాను” అతనికి ఆమెని వదిలి వెళ్ళాలని లేరు. కానీ ఊరకనే ఎలా వుండడం. అప్పటికే బాగా పొద్దుపోయింది. చీకట్లో ఏట్లో నడవడం కొద్దిగా కష్టమైన పనే. దారి సరిగాలేదు. “ఇకనుంచి నేనూ నిన్ను చూడాలనిపిస్తే పోస్టుడబ్బాను వేడుకుంటాను” అన్నాడు.
ఆమె నవ్వుతుంది. చీకట్లో ఆమె నవ్వు మల్లెపొద కదిలినట్లుంది. ఆమెకు టాటా చెబుతూ కిందకు దిగుతున్నాడు.ఆ ప్రశ్నకు జవాబు దొరికితే నాకు సుబ్బరామయ్య రెండు బస్తాల ధాన్యం ఇంటికి పంపిస్తాడు. ఆ మరుసటి రోజు నేను ఒక్కదాన్నే సుబ్బరామయ్య ఏటిభూముల దగ్గరికి వెళ్ళాను. అక్కడికి ఎవరూ రాలేదు. ఏ స్త్రీ గానీ అక్కడ అనుమానం పరిస్థితుల్లో తిరగాడలేదు. ఇంటికి తిరిగి వచ్చాక గోకుల్ తో అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చున్నాను. అతను నేనడిగిన దానికి పాపం తీరిగ్గానే జవాబులు చెబుతున్నాడు. “మన వూరి నుంచి కూలీలు బాగా వస్తున్నారా?” అనడిగాను.
“లేదు ఆ పొలంలో పని చేయడానికి మన ఊరి వాళ్ళను పిలవడం లేదు. అంతా అటు పక్కనున్న ఊరినుంచే పిలుచుకొస్తున్నాను….” అతను ఏదో చెబుతున్నాడు గానీ నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. అయితే రహస్యం తాలూకు వేర్లు పక్క ఊర్లో వున్నాయన్న అనుమానం మొదలైంది. ఆ వూర్లో అమ్మాయే గోకుల్ మనసు దోచుకుని వుంటుందని అర్ధమైంది. ఆ రోజు సాయంకాలమే ఆ వూరు వెళ్ళాను. గోకుల్ పొలంలో పనిచేసిన వాళ్ళలో కొందరితో మాట్లాడాను. వాళ్ళల్లో ఎవరూ కారు.ఎగిరి దాటాడు. ఇసుకలో పడిన పాదం మెలికపడి నొప్పి పుట్టింది. గట్టు ఎక్కుతున్నాడు. పాదం వేశాడో లేదో ఏదో సర్రున కదిలిన శబ్దం మరో అడుగు వేశాడు.