మీ చొక్కా జేబులోంచి తెల్ల పిల్ల పసుపు చీర కట్టుకుంటున్నట్టు సిగరెట్ పెట్టె కన్పిస్తోంది” “భలే కాలక్షేపం దొరికిందే” అంటూ శ్రీనివాసరావు తన విషయమంతా చెప్పి “మీ వూర్లో మాకో ఇల్లు కావాలి. నాలుగైదు నెలలు వుంటాం. నేనూ, నా దగ్గర పనిచేసే తాపీ మేస్త్రీలు వుంటాం. అద్దె అటూ ఇటూగా వున్నా ఫర్వాలేదు?” అన్నాడు. “ఇల్లా సార్- చిటికెలో సంపాదించి పెడతాను. ముందు ఈ కాఫీ తాగండి” అంటూ తిప్పరాజు భరోసా ఇచ్చి కాఫీ గ్లాసు అందించాడు. రెండోరోజు తిరిగి వచ్చేటప్పటికి తిప్పరాజు శ్రీనివాసరావును వూర్లోకి పిలుచుకు వెళ్ళి రెండు మూడు ఇళ్ళు చూపించాడు.అదే మధ్యవర్తి అయితే కోపం వచ్చినా ప్రదర్శించే వీలు లేదు. కాబట్టి ఇష్టం వున్నా లేకపోయినా వింటారు.
అంతేగాక మధ్యవర్తి అయితే సులభంగా కలుసుకునే వీలుంటుంది. ఎవరికీ ఏ సందేహమూ రాదు. కాబట్టి నెలరోజులయ్యే పని పదిహేను రోజులకే అయిపోతుంది. “అంతా ఓ.కే. అయిపోయినట్టే నా పాత్ర ఇంతటితో ముగిసింది ఇక మీరే దారిలో పెట్టుకోవాలి. మీ మాటలకు చేష్టలకు లొంగిపోయే విధంగా ట్యూన్ చేశాను. ఆమె రోజూ ఉదయం తొమ్మిది గంటలకు ప్రసాదం ఇవ్వడానికి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఎన్ని అర్జంట్ పనులున్నా మీరు ఆ టైమ్ కి నా కొట్లో వుండాలి. ఆ సమయంలో మీరు మాటలు కలపండి” అని సుదీర్ఘంగా చెప్పాడు తిప్పరాజు. శ్రీనివాసరావు తల ఆడించాడు.
ఎనిమిది గంటలకల్లా తిప్పరాజు కొట్లో వుండేవాడు. ఆమె ప్రసాదం ఎత్తుకొచ్చేది. “మహాప్రసాదం అని దీన్ని ఎందుకంటారో మొదటిసారి నాకు తెలిసింది. మీరు ఇస్తున్నారు కాబట్టి నిజంగా ఇది మహాప్రసాదమే…..” అంటూ శ్రీనివాసరావు మాటలు ప్రారంభించాడు. రెండోరోజు మరికాస్తంత ఫ్రీగా మాట్లాడగలిగాడు ఆయన పిరికి వాడేం కాదు. కాకపోతే కాస్తంత మొహమాటస్తుడు. ఇప్పుడు ఆ జంకు అంతా పోయింది. అవతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ వుండడంతో ఆయన విజ్రుంభించేశాడు. “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అన్న స్థాయికి వచ్చేశాడు. ప్రసాదం తీసుకుంటున్నప్పుడు చేతులు తాకించటం లాంటిది చేస్తున్నాడు. ఆమె ఇదంతా గమనిస్తోంది గానీ నోరు విప్పి మాట్లాడడం లేదు.
“బాగానే మాట్లాడుతుంది గానీ నోరు తెరిచి నువ్వంటే నాకూ ఇష్టమే అని చెప్పలేదు. ఈ ఆడవాళ్ళతో ఇదే ప్రాబ్లమ్” అని ఓరోజు రాత్రి శ్రీనివాసరావు ఇలా శ్రీనివాసరావుకి, రాధకీ మధ్య కొత్త సంబంధం ప్రారంభమైంది. వాళ్ళిద్దరికీ కుదర్చడం వరకే తిప్పరాజు పని అయిపోలేదు. ఆ తరువాత కూడా తిప్పరాజు పాత్ర కంటిన్యూ అయింది.