రాములు ఆటోగ్రాఫ్ – Part 1 959

దాబా ఓనర్ తన భుజం మీద చెయ్యి వేసి తట్టేసరికి రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకు వచ్చి అతని వైపు చూసాడు.
దాబా ఓనర్ : అతని మాటలు పట్టించుకోకండి సార్….వాడు ఒట్టి పిచ్చివాడు….
రాము : ఏంటేంటో మాట్లాడాడు….అదే అర్ధం కాలేదు….
దాబా ఓనర్ : వదిలేయండి సారు….ఎక్కువగా ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది

రాము అతను చెప్పింది కరెక్టే అంటూ తల ఊపి కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు.
అలా అరగంటకు ఊర్లోకి వచ్చి ఒబెరాయ్ విల్లాలో పనిచేసే రంగకి ఫోన్ చేసాడు.
రాము : హలో రంగా…..
రంగ : అవునండీ…..ఎవరు మాట్లాడేది….
రాము : నేను ఒబెరాయ్ విల్లా పని మీద వచ్చాను….మా నాన్నగారు నీతో మాట్లాడాడు కదా….
రంగ : అయ్యా…ఇప్పుడెక్కడున్నారు….
రాము : నేను ఇప్పుడే ఊర్లోకి వచ్చాను….ఒబెరాయ్ విల్లాకు ఎలా రావాలి….
రంగ : అయ్యా….నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను….
రాము : అక్కడెందుకు….ఒంట్లో బాగోలేదా…
రంగ : అలాంటిదేం లేదయ్యా…..ఒంట్లో బాగానే ఉన్నది….
రాము : మరి అక్కడెందుకు ఉన్నావు….
రంగ : ఏంలేదయ్యా….మన ఒబెరాయ్ విల్లాలో ఒకతను తోటమాలిగా పనిచేస్తున్నాడు కదయ్యా….అతను చనిపోయాడు…మీ నాన్నగారు చెప్పే ఉంటారు…
రాము : అవును చెప్పారు…ఇంతకు విషయం చెప్పు…
రంగ : అతని శవాన్ని పోస్ట్ మార్టం చేసారయ్యా….పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు…..అందుకని ఇక్కడే ఉన్నాను….
రాము : సరె…హాస్పిటల్ కి ఎక్కడికి రావాలో చెప్పు…నేను కూడా అక్కడికే వస్తాను…పోలీసులతో మాట్లాడిన తరువాత ఇద్దరం కలిసి ఒబెరాయ్ విల్లాకు వచ్చేద్దాం….
దాంతో రంగ సరె అని హాస్పిటల్ కి ఎలా రావాలో దారి చెప్పి ఫోన్ పెట్టేసాడు.
రాము కూడా ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి హస్పిటల్ వైపు పోనిచ్చాడు.
హాస్పిటల్ లోకి వెళ్ళిన తరువాత కార్ పార్కింగ్ లో పెట్టి హాస్పిటల్ వైపు వస్తూ రంగకి ఫోన్ చేసాడు.
రాము : రాఘవా….ఎక్కడున్నావు….
రంగ : అయ్యా….హాస్పిటల్ లోనే ఉన్నాను….మీరు వచ్చారా….
రాము : హా…కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను….
రంగ : సరె….వస్తున్నాన్నయ్యా….
అంటూ ఫోన్ కట్ చేసి పరిగెత్తుకుంటూ రాము దగ్గరకు వచ్చాడు….
రంగ : నమస్కారమయ్యా…..
రాము : రాఘవా….పద….SI దగ్గరకు వెళ్దాం పద…..
రంగ : సరె….పదండి….తీసుకెళ్తాను…..
అంటూ రాముని SI దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేసి హాస్పిటల్ తన తమ్ముడి దగ్గరకు వెళ్ళాడు.
రాము : హాయ్ SI గారు….నా పేరు రాము….ఇక్కడ ఒబెరాయ్ విల్లా గురించి వచ్చాను….
SI : హాయ్ రాము గారు….మీకు ఇక్కడ విషయం అంతా తెలిసే ఉంటుంది…
రాము : అవును సార్….మొతం మా నాన్నగారు చెప్పారు….ఇంతకు పోస్ట్ మార్టం వచ్చిందా….
SI : వచ్చింది రాము గారు….పదండి చూద్దాం
అంటూ SI రాముని మార్చురీ రూమ్ కి తీసుకెళ్ళి తోటమాలి శవాన్ని చూపించాడు…
రాము : బాడీ మీద ఒక్క గాయం కూడా కనిపించడం లేదు…..
SI : అవును రాము గారు….ఒంటి మీద ఒక్క గాయం కూడా లేదు….పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గుండె పోటు వలన చనిపోయాడని వచ్చింది.
రాము : ఇతని వయసు ఎంత…..
SI : దాదాపు పాతిక….ముప్పై మధ్యలో ఉంటుంది….
రాము : మరి ఇంత చిన్న వయసులో గుండె పోటు వస్తుందా….
SI : అదే రాము గారు….నాక్కూడా అర్ధం కావడం లేదు….
ఆ మాట వినగానే రాము SI తో కలిసి మార్చురీ రూమ్ నుండి బయటకు వచ్చి….అటు వైపుగా వెళ్తున్న డాక్టర్ ని పిలిచాడు.
రాము : డాక్టర్ గారు….
డాక్టర్ : చెప్పండి….
రాము SI దగ్గర నుండి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని డాక్టర్ కి చూపిస్తూ….
రాము : డాక్టర్ గారు…ఈ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో మా తోటమాలి గుండెపోటుతో చనిపోయినట్టు రాసారు….కాని ఇతని వయసు పాతిక…ముప్పై మధ్యలో ఉంటుంది…ఇంత చిన్న వయసులో గుండెపోటు ఎలా వస్తుంది…అదే అడుగుదామని మిమ్మల్ని పిలిచాను.
డాక్టర్ రాము దగ్గర నుండి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తీసుకుని పూర్తిగా చదివిన తరువాత….
డాక్టర్ : అవును….మీరన్నది కరెక్టే….ఇంత చిన్న వయసులో గుండె పోటు రాకూడదు….
రాము : మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తప్పు జరిగిందా….
డాక్టర్ : లేదు….అలా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటికీ తప్పుగా రాదు…కాకపోతే ఇతను చూడకూడనిది చూసినప్పుడు విపతీతమైన భయం వేసినప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు వచ్చి ఆగిపోతుంది….
రాము : థాంక్స్ డాక్టర్ గారు…..
దాంతో డాక్టర్ గారు అక్కడనుండి వెళ్ళిపోయారు….
ఆయన వెళ్ళిపోగానే రాము SI వైపు తిరిగి….అతనితో హాస్పిటల్ లాన్ లో నిల్చున్న రంగ, అతని తమ్ముడి వైపు చూస్తూ….

2 Comments

  1. Story challa bagundii.
    Next episode post cheyandiii bro

  2. కథ చాలా బాగుంది వీలైతే ఈ స్టోరీ మొత్తం ఒకసారి మెయిల్ చెయ్యగలరు

Comments are closed.