రాములు ఆటోగ్రాఫ్ – Part 1 960

చిన్న కొడుకు ఫ్రంట్ డోర్ తీసుకుని తన అన్న పక్కనే కూర్చున్నాడు.
వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూసారు….వెనక సీట్లో రాము మధ్యలో కూర్చుంటే తమ తల్లి, చెల్లెలు చెరొక వైపు కూర్చుని చెరో భుజం మీద తల పెట్టి పడుకున్నారు.
రాము మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
అది చూసి పెద్ద కొడుకు కూడా ఆనందంగా కార్ స్టార్ట్ చేసి తమ బంగళా వైపు పోనిచ్చాడు.
వాళ్ళ వెనకే మిగతా వాళ్ళు మూడు కార్లలో బయలుదేరారు…..అందరి కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
అందరూ విల్లాకు వచ్చిన తరువాత కార్లు దిగి లోపలికి వచ్చారు.
రాముని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి రేణుక అతని పక్కనే కూర్చున్నది.
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి రాముని, రేణుకని ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తున్నారు.
అందరూ సోఫాల్లో కూర్చుని రాము వైపు ఏదో అపురూపమైన దాన్ని చూసినట్టు చూస్తున్నారు.
అందరిలోకి ముందుగా రేణుక చిన్న కొడుకు భార్య రెండో కోడలు రాము వైపు చూసి, “మామయ్యా….అత్తయ్య చూస్తే 60 ఏళ్ళు ఉన్నాయి…..మీరు చూస్తే సంతూర్ సోప్ వాడినట్టు వయసు పెరక్కుండా 27 ఎళ్ళ దగ్గరే ఆగిపోయారు….ఇంతకాలం అత్తయ్య గారు మీ గురించి చెబుతుంటే ఏదో చెబుతున్నారులే అని నమ్మలేదు….కాని ఇప్పుడు మిమ్మల్ని చూసిన తరువాత చాలా ఆశ్చర్యంగా….నలభై ఏళ్ళ తరువాత తిరిగివచ్చినందుకు చాలా ఆనందగాను ఉన్నది….మీ పోలికలే మొత్తం అచ్చు గుద్దినట్టు నా కొడుక్కి వచ్చాయి…..దాంతో అత్తయ్య గారు నా కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ వాడిలోనే మిమ్మల్ని చూసుకుంటూ ఉండెవారు…..” అనది.
ఆమె అలా అనడంతో ఆమె మొగుడు, “నీకు ఎప్పుడు ఏది మాట్లాడాలో అసలు తెలియదు….మెదలకుండా ఉండు,” అన్నాడు.
ఆమె అమాయకత్వానికి రాము నవ్వుతూ, “చూడమ్మా…..నాకు ఇప్పుడు 27 ఏళ్ళే…..మీకు లెక్కలో యాభై ఏళ్ళు జరిగిపోయాయి….కాని నేను మాత్రం యాభై ఏళ్ళు కాలంలో వెనక్కు వెళ్ళి రేణుకని పెళ్ళి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్న తరువాత మళ్ళీ నా కాలానికి….అంటే ఏ రోజు అయితే కాలంలో వెనక్కు వెళ్ళి రేణుకను కలిసానో….మళ్ళీ అదే రోజు కాలంలో నా కాలంలోకి వచ్చేసాను…..అందుకని నా వయసు 27 దగ్గరే ఆగిపోతే….మీరందరూ నాకంటే పెద్దవాళ్ళయిపోయారు,” అన్నాడు.
ఇక రేణుక తన చిన్న కోడలి వైపు చూసి ఆగమన్నట్టు సైగ చేసి రాము వైపు తిరిగి, “రాము….ఇంత కాలం అయిందా….మా దగ్గరకు రావడానికి,” అని అడిగింది.
“నేను నీ దగ్గర నుండి నా కాలంలోకి వచ్చిన తరువాత నువ్వు బుక్ లో రాసిన లెటర్లు, ఆల్బమ్ తీసుకుని వెంటనే బయలుదేరాను….ఇక్కడకు వచ్చేటప్పుడు మీరంతా నన్ను గుర్తు పడతారో లేదొ అని ఎంతగా ఆలోచించానో తెలుసా….” అన్నాడు రాము.
“అదేంటి రాము అలా అంటావు….నువ్వు వస్తావని నేను, నీ పిల్లలు, నీ మనుమలు ఎంతలా ఎదురుచూస్తున్నామో తెలుసా. రోజు వీళ్ళు నీ గురించి అడుగుతుంటే…..నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తుంటే ఇప్పటికి వచ్చావు,” అంటూ రేణుక తన పిల్లల వైపు చూసి, “చూసారా….వీళ్ళంతా మీ పేరుని ఎంత పాపులర్ చేసారో….కాని మేము చేసుకున్న ప్రతి పండగకు, ప్రతి సంతోషంలోను నువ్వు లేని లోటు మాకు కనిపిస్తూనే ఉన్నది….” అన్నది.

2 Comments

  1. Story challa bagundii.
    Next episode post cheyandiii bro

  2. కథ చాలా బాగుంది వీలైతే ఈ స్టోరీ మొత్తం ఒకసారి మెయిల్ చెయ్యగలరు

Comments are closed.