రాములు ఆటోగ్రాఫ్ – Part 1 964

రాము రిసెప్షన్ లోకి వచ్చి బిజినెస్ సూట్ ఒకటి తీసుకున్నాడు.

బెల్ బాయ్ రిసిప్షన్ లో రాము బుక్ చేసిన సూట్ కీస్ తీసుకుని అతని లగేజ్ తీసుకుని రాము వైపు చూసి, “రండి సార్….నేను మిమ్మల్ని సూట్ కి తీసుకెళ్తాను,” అంటూ అక్కడ నుండి కదిలాడు.

రాము అతన్ని వెనకాలే లిఫ్ట్ లోకి వెళ్ళి అక్కడ నుండి ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న తన సూట్ దగ్గరకు వెళ్ళి బెల్ బోయ్ లాక్ ఓపెన్ అవంగానే లోపలికి వెళ్ళాడు.

బెల్ బోయ్ తన చేతిలో ఉన్న సూట్ కేస్, బ్యాగ్ అక్కడ ఉన్న వార్డ్ రోబ్ లో పెట్టి రాము వైపు చూసి, “సార్….ఇది హాల్….అదిగో అది బెడ్ రూమ్…..మీకు ఏదైనా అవసరం ఉంటే రిసెప్షన్ కి ఫోన్ చేయండి….ఇందులో మొత్తం రూమ్ సర్వీస్, రిసిప్షన్ నెంబర్లు ఉన్నాయి,” అంటూ ఫోన్ పక్కనే ఒక క్యాటలగ్ చూపించి….బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి రూమ్ చూపించాడు.

రాము తన పాకెట్ లో ఉన్న వాలెట్ తీసి అతనికి టిప్ ఇచ్చి బెడ్ మీద పడుకున్నాడు.

బెల్ బోయ్ టిప్ తీసుకుని హాల్లోకి వచ్చి AC ఆన్ చేసి వెళ్ళాడు.

రాము ఐదు నిముషాలు అలాగే పడుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిసిప్షన్ కి ఫోన్ చేసి లంచ్ ఆర్డర్ చేసాడు.

పది నిముషాలకు రూమ్ సర్వీస్ వచ్చి లంచ్ ఇచ్చి వెళ్ళారు.

రాము భోజనం చేసిన తరువాత కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు.

సాయంత్రం ఐదు గంటలకు రాముకి మెలుకువ వచ్చి లేచి టీ తెప్పించుకుని తాగిన తరువాత నిద్ర మత్తు మొత్తం వదిలింది.

బెడ్ మీద తన ఫోన్ తీసుకుని ముంబయ్ లో ఒక నెంబర్ కి ఫోన్ చేసాడు.

ఆ నెంబర్ డయల్ చేస్తున్నప్పుడు రాము చేతి వేళ్ళు వణకడం మొదలుపెట్టాయి.

అవతల ఫోన్ రింగ్ అవుతుంటే రాము గుండె శబ్దం తనకే వినబడటం గమనించి, తన మనసులో, “ఎవరు ఫోన్ ఎత్తుతారు…. ఒకవేళ ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేస్తే తాను ఎవరని చెప్పాలి,” అని ఆలోచిస్తున్నాడు.

అంతలో అవతల వైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో…..ఎవరు సార్ మాట్లాడేది….” అన్నారు.

అవతల వైపు నుండి తనను సార్ అని పిలిచేసరికి ఎవరో ఎంప్లాయ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటాడని రాము అనుకుని, “హలో….అది స్వస్థిక్ విల్లానా…..” అని అడిగాడు.

“అవును సార్….చెప్పండి….” అన్నారు అవతల వైపు నుండి.

2 Comments

  1. Story challa bagundii.
    Next episode post cheyandiii bro

  2. కథ చాలా బాగుంది వీలైతే ఈ స్టోరీ మొత్తం ఒకసారి మెయిల్ చెయ్యగలరు

Comments are closed.