రాములు ఆటోగ్రాఫ్ – Part 1 939

మార్షల్స్ రాముని పైకి లేపడానికి ముందుకు వస్తుండగా రేణుక పెద్ద మనవడు వాళ్ళను ఆగమన్నట్టు సైగ చేసి ముందుకు అడుగులు వేసి రాము దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి రెండు చేతులు పట్టుకుని పైకి లేపుతూ, “మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్ధం కావడం లేదు…పెట్రోలు పోసుకుని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిన అతను మా కంపెనీలో ఎంప్లాయ్… .సమయానికి వచ్చి అతన్ని రక్షించి మంచి పని చేసారు….లేకపోతే అతనికి ఏదైనా అయితే ఇంత సంతోషమైన రోజు మేమందరం బాధ పడాల్సి వచ్చేది,” అంటూ రాముని పైకి లేపి తన వైపుకు తిప్పుకుని రాముని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో తాను చూస్తున్నది కలా నిజమా అన్నట్టు అలాగే రాము వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు.

కారణం ఏంటంటే రాము కూడా అచ్చం తనలాగే ఉండటంతో ఇన్నేళ్ళు తన నానమ్మ చెప్పిన అతను ఇతనేనా అన్నట్టు చూస్తున్నాడు.
రాము తమ వైపు తిరిగిన తరువాత అతన్ని చూసిన ఒబరాయ్ ఫ్యామిలీ కూడా ఆశ్చర్యంతో, ఆనందంతో అలాగే నోట మాట రాక రాము వైపు కన్నార్పకుండా చూస్తున్నారు.
రేణుక కూడా ఆనందగా రాము వైపు చూసి నోట మాట రాక అలాగే చూస్తున్నది.
గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా రాము, ఒబరాయ్ ఫ్యామిలీలో పెద్ద మనవడు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండటంతో అలాగే ఏం జరగబోతుందా అని చూస్తున్నారు.
అందరు ఎవరి ఆనందంలో వాళ్ళు, ఆశ్చర్యంలో వాళ్ళు ఉండగా మీడియా వాళ్ళు వెంటనే రాముని, మనవడిని కలిపి ఫోటోలు తీస్తూ, వాళ్ళిద్దరి ఫోటోలతో పాటు ఒబరాయ్ ఫ్యామిలీ ఫోటోలు టకటక తీస్తున్నారు.
రాము వాళ్ళని చూసిన ఆనందం నుండి తేరుకుని రేణుక వైపు చూసి, “రేణూ……” అని పిలిచాడు.
అప్పటి దాకా తాను చూస్తున్నది కలా నిజమా అన్న సందిగ్ధంలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడ్డి రాము వైపు చూసి చిన్నగా తడబడుతున్న అడుగులతో దగ్గరకు వచ్చి రాముని గట్టిగా వాటేసుకుని ఆనందంతో ఏడుస్తూ, “మా దగ్గరకు రావడానికి ఇన్నేళ్ళు పట్టిందా రాము…..నీ కోసం ఎంతలా ఎదురు చూసానో తెలుసా,” అన్నది.
రాము కూడా రేణుక చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని ఆమె భుజం మీద తల పెట్టి కళ్ళు మూసుకున్నాడు.
అంతలో రేణుక పెద్ద కొడుకు రాము దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి, “నాన్నా…..” అంటూ పిలిచాడు.
అతనితో పాటు చిన్న కొడుకు, కూతురు కూడా రాము దగ్గరకు వచ్చారు.
రాము కూడా తన పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళకు కూడా పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉండటం చూసి ఆనందంగా వాళ్ళను కౌగిలించుకున్నాడు.
అలా కొద్దిసేపు ఉన్న తరువాత అందరూ తేరుకున్నారు.
రేణుక రాము వైపు ఆనందంగా చూస్తూ, “రాము….ఇక ఇంటికి వెళ్దాం పద,” అన్నది.
దాంతో అందరు ఇంకా రెట్టించిన ఆనందంతో వినాయకుడికి హారతి ఇచ్చి ఇంటికి బయలుదేరారు.
గుడి లోనుండి బయటకు వచ్చేంత వరకు రేణుక రాము చేతిని పట్టుకునే ఉన్నది.
పూజ అయిపోయిన తరువాత అందరూ బయటకు వచ్చారు.
డ్రైవర్లు వరసగా కార్లు తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఆపారు.
రేణుక పెద్ద కొడుకు ముందుకు వచ్చి డ్రైవర్ చేతిలో ఉన్న కార్ కీస్ తీసుకుని రాము వైపు చూసి, “ఈ రోజు మేము మీతో కలిసి వస్తాము,” అంటూ మిగతా వాళ్ళ వైపు చూసి, “మీరందరూ వేరే కార్లలో వచ్చేయండి,” అంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు.
చిన్న కొడుకు వచ్చి కార్ బ్యాక్ సీట్ డోర్ తెరిచాడు….దాంతో రాము లోపల కూర్చున్నాడు.
అతని పక్కనే రేణుక కూర్చున్నది…..రేణుక కూతురు ఇంకో వైపు వచ్చి డోర్ తీసుకుని రాము పక్కనే కూర్చున్నది.

2 Comments

  1. Story challa bagundii.
    Next episode post cheyandiii bro

  2. కథ చాలా బాగుంది వీలైతే ఈ స్టోరీ మొత్తం ఒకసారి మెయిల్ చెయ్యగలరు

Comments are closed.