రాములు ఆటోగ్రాఫ్ – Part 1 963

“నేను రేణుక గారితో మాట్లాడాలి…..” అన్నాడు రాము.

“సారీ సార్….మేడమ్ గారు….గుడికి వెళ్ళారు….” అన్నాడు అతను.

“అయితె….ఆమె కొడుకులు కాని, మనవళ్ళు కాని ఎవరైనా ఉన్నారా,” అనడిగాడు రాము.

“లేరు సార్….అందరూ వినాయకుడి గుడికి వెళ్ళారు….ఇవ్వాళ అక్కడ పూజ ఉన్నది,” అన్నాడు.

“సరె….అయితే వాళ్ళను నేను అక్కడే కలుస్తాను….అడ్రస్ చెప్పండి,” అన్నాడు రాము.

దాంతో అతను రేణుక వాళ్ళందరూ వెళ్ళిన గుడి ఎక్కడ ఉన్నదో అడ్రస్ చెప్పాడు.

రాము సరె అని చెప్పి ఫోన్ పెట్టేసి….బెడ్ మీద ఫోన్ పెట్టి తన సూట్ కేస్ లోనుండి తనకు ఎంతో ఇష్టమైన డ్రస్ తీసుకుని బెడ్ మీద పెట్టి బాత్ రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు.

స్నానం చేసి వచ్చిన తరువాత రాము డ్రస్ చేసుకుని రూమ్ లాక్ చేసి హోటల్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి టిఫిన్ చేసి బయటకు వచ్చే సరికి సాయంత్రం 6.30 అయింది.

అలా రాము బయటకు రాగానే ఒక క్యాబ్ వచ్చి అతని ముందు ఆగింది.

రాము క్యాబ్ లో కూర్చుని డ్రైవర్ కి వినాయకుడి గుడికి తీసుకెళ్ళమని చెప్పాడు.

క్యాబ్ డ్రైవర్ అలాగే అంటూ కార్ స్టార్ట్ చేసి వినాయకుడి గుడి వైపుకి పోనిచ్చాడు.

“గుడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది,” అన్నాడు రాము.

“సార్….దాదాపు గంటన్నర పడుతుంది….ట్రాఫిక్ లేకపోతే గంటలో వెళిపోవచ్చు,” అన్నాడు డ్రైవర్.

“సరె…..తొందరగా పోనివ్వు,” అన్నాడు రాము.

2 Comments

  1. Story challa bagundii.
    Next episode post cheyandiii bro

  2. కథ చాలా బాగుంది వీలైతే ఈ స్టోరీ మొత్తం ఒకసారి మెయిల్ చెయ్యగలరు

Comments are closed.