రాములు ఆటోగ్రాఫ్ – Part 1 939

“సరె…..జరిగిపోయిన విషాదాన్ని గుర్తు చేసుకుని ఉపయోగం లేదు కదా….ఇప్పుడు నేను వచ్చా కదా….మన పిల్లలు ఏం చేస్తున్నారు…..అని తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నది…..” అన్నాడు రాము.
దాంతో రేణుక పిల్లల వైపు చూపిస్తూ, “వీడు మన పెద్ద కొడుకు విశ్వ….ఇప్పుడు చాలా ధనవంతుడు…ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు….ఇప్పుడు గుడికి రావడానికి కూడా చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది. ఇక మన చిన్న కొడుకు రఘు…ఇక వీడి విషయానికి వస్తే బిజినెస్ తో పాటు భక్తి కూడా ఎక్కువే…..నువ్వు షాపూర్ లో కట్టించిన గుడికి ప్రతి సంత్సరం ఎన్ని పనులు ఉన్నా తప్పకుండా తీసుకెళ్తాడు….ఇక నీ కోడళ్ళ విశయానికి వస్తే పెద్ద కోడలు పద్మ….విశ్వ భార్య….చాలా తెలివైనది….విశ్వాకి బిజినెస్ లో చాలా హెల్ప్ చేస్తుంది….ఈమె చిన్న కోడలు కరుణ రఘుకి భార్య. చిన్న కోడలు…ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూతూనే ఉంటుంది….కాకపోతే పద్మ, కరుణ ఇద్దరూ కొద్దిసేపు అరుచుకుంటారు….అంతలోనే ఒక్కటై పోతారు,” అన్నది.
ఆమాట అనగానే అక్కడ అందరూ పద్మ, కరుణల వైపు చూసి గట్టిగా నవ్వారు.
పద్మ మెదలకుండా ఉన్నది కాని కరుణ మాత్రం ఉడుక్కుంటూ, “అత్తయ్యా….మామయ్య గారికి మొదట్లోనే నా గురించి అలా చెడుగా చెబితే ఎలా….నన్ను చెడుగా అనుకుంటారు కదా,” అన్నది.
దానికి రాము నవ్వుతూ, “లేదులే కరుణ….ఇలా గలగలా మాట్లాడే వాళ్ళు అసలు మనసులో ఏమీ దాచుకోకుండా చాలా మంచిగా ఉంటారు….నీ అమాయకత్వం చూసి నువ్వు ఇక్కడ ఉన్న అందరిలోకి మంచిదానివి అని నాకు బాగా అర్ధమైంది,” అన్నాడు.
రాము అలా అనగానే కరుణ ఆనందంగా, “చాలా థాంక్స్ మామయ్య గారు….ఇంత మందిలొ మీరొక్కరే నన్ను చూసిన వెంటనే బాగా అర్ధం చేసుకున్నారు…..ఇక నుండి మీరు నా ఫేవరెట్ మామయ్య గారు….మీకు ఏ అవసరం వచ్చినా నన్నే అడగాలి,” అన్నది.
రాము కూడా నవ్వుతూ, “అలాగే కరుణ,” అన్నాడు.
దానికి రేణుక కూడా నవ్వుతూ, “ఇక చాల్లే కూర్చో….” అంటూ రాము వైపు తిరిగి, “ఇక నీ మనవళ్ళ విషయానికి వస్తే…అచ్చం నీ పోలికలతో పుట్టి….అచ్చు గుద్దినట్టు నీలా ఉన్న వీడి పేరు శివరామ్ కుమార్….వీడు రఘు, కరుణల ఒక్కగానొక్క కొడుకు…అలాగే పిల్లలందరిలో పెద్దవాడు….మొదటి మనవడు…దాదాపు నీ వయసే….అంటే వాడి వయసు కూడా 27 ఏళ్ళు….చాలా తెలివైన వాడు, చురుకైన వాడు. విశ్వ, రఘు తరువాత వీడే బిజినెస్ లు మొత్తం చాలా సమర్ధవంతంగా చూసుకుంటున్నాడు….అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టడు….కోపం ఎక్కువే….కోపం వచ్చిందంటే తన చేతిలో ఉన్నది ఏదైనా సరె నేలకేసి కొట్టేస్తాడు….వాడికి వాడి తమ్ముళ్ళన్నా, చెల్లెకు అన్నా చాలా ఇష్టం….వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వడు.
ఇక రెండో మనవడు వినయ్, వీడు విశ్వ పద్మల పెద్ద కొడుకు….మంచి ఆర్టిస్ట్….బిజినెస్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ శిల్పాలు చెక్కుతుఉంటాడు….వీడి చేతిలో మట్టి ముద్ద అద్భుతమైన శిల్పంలా మారుతుంది.
ఇక మూడో మనవడు హర్ష కుమార్… పద్మ విశ్వల చిన్న కొడుకు….వీడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు…చాలా అల్లరి వాడు…అమాయకుడు కూడా.
మనవరాలు ప్రియ….ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నది….విశ్వ పద్మల కూతురు,” అని రేణుక ఒక్క నిముషం చెప్పడం ఆపి రాము వైపు చూసి, “ఇక మీ ముద్దుల కూతురు….ఒక్క క్షణమైనా కిందకు దించకుండా ఎత్తుకునే ఉండేవారు కదా….” అని రేణుక తన కూతురు వైపు చూపించి, “దీని పేరు తెలుసుకదా….చాలా ఇష్టపడి పెట్టుకున్నారు….సంజన….ఇంట్లో తన అన్నయ్యలతో పిల్లలతో ఎంత అల్లరి చేస్తుందో….ఆఫీసుకు వెళ్తే అంత హుందాగా ఉంటుంది….” అన్నది.
సంజనని చూడగానే రాము ఆమెను దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేసాడు.
దాంతో సంజన సోఫాలో నుండి దాదాపు పరిగెత్తుకుంటున్నట్టుగా రాము దగ్గరకు వచ్చి అతని పక్కనే కూర్చున్నది.
రాము ఆమె కళ్ళల్లోకి చూస్తూ నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.
అది చూసిన రేణుక, “ఇక కూతురు మీద చూపించిన ప్రేమ చాల్లే….అతను నీ ముద్దుల కూతురి భర్త సంజయ్…అతను కూడా పెద్ద బిజినెస్ మేన్….సంజన ప్రతి ఏడాది ఈ పూజ కోసం రెండు రోజుల ముందు ఇంటికి వస్తుంది….పూజ అయిపోయిన తరువాత తన అత్తారింటికి వెళ్ళిపోతుంది….వీళ్ళిద్దరికీ ఒక అబ్బాయి, అమ్మాయి….ఇద్దరూ చదువుకుంటున్నారు,” అన్నది.
రాము సోఫాలో నుండి లేచి తన మనవళ్ళు, మనవరాళ్ళ వైపు ప్రేమగా చూసాడు.
శివరాం, వినయ్, హర్ష, ప్రియ, సంజన వాళ్ళ పిల్లలు అందరూ లేచి రాము దగ్గరకు వచ్చి గట్టిగా వాటేసుకున్నారు.

అలా ఐదు నిముషాలు రాము వాళ్ళను అలాగే పట్టుకుని ఒక్కొక్కళ్ళ మొహం మీద ముద్దులు పెట్టుకుంటున్నాడు.
అలా ముద్దు పెట్టుకుంటూ విశ్వ, రఘు, సంజన వైపు చూసి వైపు చూసి, “మీ చిన్నప్పటి సరదాలు ఏమీ తీరకుండానే నేను అనుకోకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది…..కాని….” అంటూ తన మనవళ్ళ వైపు తిరిగి వాళ్ళ బుగ్గల్ని నిమురుతూ, “కనీసం మనవళ్ళ ఆట పాటలైనా చూస్తాననుకున్నా…..అది కూడా జరిగలేదు….నా జీవితంలో ఇంత పెనుమార్పులు జరుగుతాయని నేను అసలు ఊహించలేదు,” అన్నాడు.
దానికి శివరాం రాముని చేతిని పట్టుకుని, “అలా అనకండి తాతయ్యా….మీరు నాన్న వాళ్ళ ముచ్చట్లు, మా చిన్నప్పుడు ఆటలు చూడకపోతేనేం….ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే…..నాకు అన్నయ్య లాగా ఉన్నారు….కాబట్టి మీరు తీర్చుకోలేని సరదాలను మాకు పెళ్ళిళ్ళు అయిన తరువాత వాళ్ళ పిల్లలతో తీర్చుకోండి,” అన్నాడు.
ఆ మాట విని విశ్వ కూడా, “అవును నాన్నా…..మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు నేను మీకు కొడుకంటే ఎవరూ నమ్మరు…..మీరే నాకు కొడుకులా ఉన్నారు….ఏం బాధపడకండి….మీరు మీ జీవితంలో మాద్వారా పోగొట్టుకున్న ఆనందాలను మీ మనవళ్ళ పిల్లల ద్వారా తీర్చుకోండి,” అన్నాడు.
రాము తన మనవడు శివరాం వైపు చూసి, “ఏరా….27 ఏళ్ళ వయసులోనే నన్ను తాతను చేసారు….ఇక ముత్తాతను కూడా చేస్తారా,” అంటూ నవ్వాడు.
“మరి అంతే కదా తాతయ్యా…..” అంటూ శివరాం రాముని గట్టిగా కౌగిలించుకుని, “మీకు తెలియదు…..నానమ్మ మిమ్మల్ని మరిచిపోని రోజు అంటూ లేదు….మీలా ఉన్న నన్ను చూసి రోజూ మాట్లాడందే నిద్ర కూడా పోదు….నేను బిజినెస్ పని మీద ఊరు వెళ్ళినా సరె….వీడియో కాలింగ్ చేసి నాతో మాట్లాడి కాని నిద్ర పోదు….ప్రతి రోజు మీరు నానమ్మని మీ ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారో చెబుతూ….మీరు లేకపోతే తాను లేనని చెబుతుండేది….నిజంగా మీరు గ్రేట్ తాతయ్యా…..” అన్నాడు.
రాము కూడా శివరాంని కౌగింలించుకుని, “అదేం లేదురా….మీ నానమ్మ బాధ చూసి తట్టుకోలేక విపరీతంగా బాధపడుతున్న నేను ఒక బాబా హెల్ప్ తో రేణుకని కాపాడాను…..” అన్నాడు.
“నాకు తెలుసు నాన్నా…..ప్రతి సంవత్సరం అమ్మను కాపాడటానికి హెల్ప్ చేసిన ఆ సూఫీ బాబాని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడ నుండి మీరు షాపూర్ దగ్గర డెవలప్ చేసిన గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తాము…..మీరు లేకపోతే మేము లేము నాన్నా,” అంటూ విశ్వ రాము దగ్గరకు వచ్చి అతని భుజం మీద అనునయంగా తట్టాడు.
అందరూ అంత ఎమోషనల్ గా ఉండేసరికి అక్కడ ఉన్న అందరికీ సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి.
కరుణ వెంటనే తన కన్నీళ్ళను తుడుచుకుని, “మామయ్యగారు…..” అని పిలిచింది.
రాము తన కౌగిలిలో ఉన్న శివరాంని వదిలి కరుణ వైపు చూసి, “ఏంటమ్మా…..” అన్నాడు.
“మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు ఉన్న అలవాటు ఒకటి మర్చిపోయాను,” అన్నది కరుణ.
అంత వయసొచ్చినా కరుణ అలా అల్లరిగా మాట్లాడుతుండే సరికి రాము చిన్నగా నవ్వుతూ, “ఏంటమ్మా అది…తొందరగా చెప్పు,” అన్నాడు.

2 Comments

  1. Story challa bagundii.
    Next episode post cheyandiii bro

  2. కథ చాలా బాగుంది వీలైతే ఈ స్టోరీ మొత్తం ఒకసారి మెయిల్ చెయ్యగలరు

Comments are closed.