రాములు ఆటోగ్రాఫ్ – Part 1 959

రాము : సరె SI గారు…నేను వాళ్ళతో మాట్లాడతాను…..
SI : సరె రాము గారు….ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి….ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఈ కేసు మూసేయాల్సిందె….చేసేదేం లేదు…..
రాము : సరె….మీ ఇష్టం….రూల్స్ ప్రకారం ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి….
దాంతో SI కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రాము హాస్పిటల్ నుండి బయటకు వచ్చి లాన్ లో కూర్చున్న రంగ దగ్గరకు వచ్చాడు.
రంగ, అతని తమ్ముడు లాన్ లో కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
రాము తమ దగ్గరకు రావడం చూసిన రంగ తమ్ముడు లేచి నిల్చున్నాడు…అది చూసి రంగ కూడా రాము రావడం చూసి అతను కూడా లేచి నిల్చున్నాడు.
రంగ : పోలీసులతో మాట్లాడారా సార్….
రాము : మాట్లాడాను రంగ….
రంగ : మాకు అక్కడ ఒబెరాయ్ విల్లాలో ఉండటానికి భయమేస్తుందయ్యా….ఇక మేము అక్కడ ఉండము….
రాము : రాఘవా….నువ్వు అనవసరంగా భయపడుతున్నావు….తోటమాలి గుండెపోటుతో చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది….నువ్వు కూడా విన్నావు కదా…..
రంగ : అదంతా మీ పట్నంలో ఉండే వాళ్ళకు అయ్యగారు…మాలాంటి వాళ్ళకు కాదు….
రాము : అది కాదు రాఘవా….
అంటూ రంగకు చెప్పబోతుండే సరికి అతను రాముని ఆపుతూ….
రంగ : నేను ఇంతకు ముందు ఈ విషయం మీ నాన్నగారికి చెప్పాను….కాని ఆయన పట్టించుకోలేదు…ఆ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉన్నది….
రాము : ఈ కాలంలో కూడా దెయ్యాలు ఏంటి రాఘవా….
రంగ : మీకు ఇప్పుడు అర్ధం కాదు సార్….మాకు డబ్బులు కన్నా….(అంటూ రంగ పక్కనే ఉన్న తన తమ్ముడి భుజం మీద చెయ్యి వేస్తూ) అయిన వాళ్ళ ప్రాణాలు చాలా ఎక్కువ సార్….డబ్బుల కోసం అయిన వాళ్ళను పణంగా పెట్టలేము….(అంటూ తన తమ్ముడి దగ్గర ఒబెరాయ్ విల్లా తాళాలు తీసుకుని రాముకి ఇస్తూ) ఇవి ఒబెరాయ్ విల్లా తాళాలు సార్…మీకు ఉదయం పూట వంట చేసి పెట్టడానికి నా భార్య వస్తుంది…మీకు కావలసినవి వండి తిరిగి వచ్చేస్తుంది….కాని రాత్రి పూట మాత్రం మేము ఎవరం అక్కడ ఉండము సార్….
రంగ చేతిలో నుండి రాము ఒబెరాయ్ విల్లా తాళాలు తీసుకున్నాడు.
రంగ : నేను ఇంటికి వెళ్ళిన తరువాత వంట కోసం ఎవరినైనా పంపిస్తాను…..
అంటూ ఒబెరాయ్ విల్లాకు వెళ్ళడానికి అడ్రస్ చెప్పి….అక్కడ నుండి తన తమ్ముడితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు.
రాము కూడా అక్కడ నుండి బయలుదేరి ఒబెరాయ్ విల్లా గేటు దగ్గరకు వచ్చాడు.
గేటు దగ్గర ఎవరూ లేకపోయే సరికి రామునే కారు దిగి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు.
అలా లోపలికి వెళ్తూ రాము చుట్టూ చూస్తూ కారు పోనిస్తున్నాడు.
గేటు దగ్గర నుండి ఒబెరాయ్ విల్లాకు ఒక అరకిలో మీటరు ఉంటుంది….చుట్టూ దట్టమైన చెట్ల మధ్యలో విశాలమైన ఒబెరాయ్ విల్లా ఉన్నది.
అలా చుట్టూ చూస్తూ రాము ఒబెరాయ్ విల్లా ముందు కారు ఆపి చిన్నగా డోర్ దగ్గరకు వెళ్ళి తాళం తీసి లోపలికి వెళ్ళాడు.
ఆ ఒబెరాయ్ విల్లాని చూడగానే రాము అలాగే చూస్తుండి పోయాడు.
లోపలికి రాగానే కీస్ ని డోర్ పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టి….తన బ్యాగ్ ని అక్కడ సోఫాలో పెట్టి ఒబెరాయ్ విల్లా మొత్తం ఒకసారి చూసి వచ్చాడు.
అలా ఒబెరాయ్ విల్లా మొత్తం చూస్తున్న రాముకి ఒక గదికి తాళం వేసి ఉండటం గమనించాడు.
ఉదయం నుండి ట్రావెల్ చేసి, హాస్పిటల్ కి వెళ్ళి పోలీసులతో మాట్లాడే సరికి రాముకి బాగా ఆకలేస్తున్నది.
అంతలో రంగ వంట చేయడానికి పంపిస్తానన్న సంగతి గుర్తుకొచ్చి ఫోన్ తీసుకుని రంగకి ఫోన్ చేసాడు.
రాము : హలో….రాఘవా….
రంగ : ఆ…..చెప్పండయ్యా….
రాము : ఏం లేదు….బాగా ఆకలేస్తున్నది…నువ్వు ఎవరినో వంట చేయడానికి పంపిస్తానన్నావు కదా….
రంగ : అవునయ్యా….ఇప్పుడు అక్కడ వంట వండటం అంటే కష్టం కదయ్యా…..అందుకని ఇక్కడే వండుకుని క్యారేజీలో పెట్టుకుని నా పెళ్లాం వస్తుందయ్యా…..ఒక్క పది నిముషాల్లో అక్కడ ఉంటుంది….రాత్రికి కూడా క్యారేజీ పంపిస్తాను….రేపటి నుండి అక్కడే మీకు నచ్చినట్టు వంట చేస్తుందయ్యా….

2 Comments

  1. Story challa bagundii.
    Next episode post cheyandiii bro

  2. కథ చాలా బాగుంది వీలైతే ఈ స్టోరీ మొత్తం ఒకసారి మెయిల్ చెయ్యగలరు

Comments are closed.