అమ్ము ఇంకా ఏమి మారలేదు 299

“టైం ఎంత అమ్మా?” అని అడిగింది అనుమానంగా.
“ఎనిమిది అయ్యింది”
“అవునా?” అంది ఆశ్చర్యంగా.
“ఉ” అని తల ఊపి తన చేతికి భోజనం ఇచ్చింది.
“అతడికి ఇచ్చేసి నువ్వూ రా భోంచేద్దువు” అంది.
“నేను కూడా వచ్చేస్తే అతడికి మధ్యలో ఏమైనా అవసరం అయితే ఎవరు చూస్తారు” అంది వాదిస్తున్నట్లు.
“సరే అయితే నువ్వు తిను నేను వెళ్లి అక్కడే ఉంది. అతడు తిన్నాక వస్తాను” అంది.
“ఇక్కడ నాన్నకు నువ్వు చూసుకో. నేను వెళ్తాను. నాకు ఎలాగూ ఆకలిగా లేదు” అంది అక్కడి నుండి భోజనం తీసుకుని వెళ్ళిపోయింది.
ఆమె అతడి రూంలోకి వెళ్లి చూస్తే హాయిగా నిద్ర పోతున్నాడు మహేష్.
“సాయి…సాయి…” అంటూ నిద్ర లేపింది అమృత.
అమృతని చూసి చిన్నగా లేచి కూర్చున్నాడు మహేష్.
“ఏంటి బాగా నిద్ర పట్టిందా?” అని అడిగింది.
“మేల్కొని బాధపడటం కన్నా నిద్రపోవడం మంచిది కదా?” అన్నాడు.
“ఇప్పుడు నీకు అంత కష్టం ఏం వచ్చిందట?” అని అంది వెటకారంగా.
ఈ ఇంట్లో ఇబ్బంది గా ఉంది” అన్నాడు.
“ఈ ఇంటికి ఏమయ్యింది? వాస్తు బాగాలేదా?” అని అడిగింది.
“వాస్తు ఇంటికి కాదు నా బాడీకి బాగాలేదు” అన్నాడు.
“నీ బాడీకి ఏమయ్యింది?”
“మీ నాన్న గారి ముందు ఒళ్ళు చలికాలాన్ని గుర్తుకు చేసుకుంటే, ఇక నీ ముందు కళ్ళు వర్షాకాలాని గుర్తు చేసుకుంటున్నాయి” అన్నాడు కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ.
“కానీ నాకు మాత్రం నీ వల్ల వాతావరణం వసంతకాలం లాగ ఉంది” అంది.
దానికి మౌనంగా ఉన్నాడు మహేష్.
“ఏంటి ఏమి మాట్లాడవు?” అంది గోముగా.
“ఒక్కొక్కసారి మౌనం చాలా గట్టిగా మాట్లాడుతుంది అమృత. దాని వినాలి” అన్నాడు.
“నీ మౌనమే కాదు, నీ మాటలు కూడా అర్థం కావు. అదంతా వదిలేయ్. ఇప్పుడు తిను” అంది. అతడి నోటికి అన్నం కలిపి అందిస్తూ.
“నేను తింటానులే. నువ్వు అక్కడ పెట్టి వేళ్ళు”
“ఉహు..నువ్వు తినే దాకా ఇక్కడే ఉండి రమ్మంది అమ్మ”
“తినిపించమని కూడా మేడం గారే చెప్పారా?” అన్నాడు.
“కాదు మీ అత్తగారు చెప్పారు” అంది నవ్వుతూ.
ఇక చేసేదిలేక తినేసాడు మహేష్.
“అవును. నూవు తిన్నావా?” అని అడిగాడు మహేష్.
“లేదు” అంది.
“ఎందుకు ఇంకా తినలేదు?” అని అడిగాడు కోపంగా.
“ఇండియన్ ట్రెడిషన్” అంది చిలిపిగా.
“అదేంటి?”
“అవును. ఇండియాలో భర్తలు తిన్నాకే భార్యలు తినాలి” అంది. సిగ్గు పడుతూ.
“ఎందుకు?”
“ముందు మీ కడుపు నిండాలి. తరువాతే మా కడుపు నిండాలి” అంది.
“అదేం కాదు. ఫుడ్ పాయిజన్ అయ్యి మేము చనిపోతే, మీరు తినకుండా టెస్ట్ చేస్తారు?” అన్నాడు నవ్వుతూ.
మహేష్ అలా అనేసరికి బుంగమూతి పెట్టుకుంది అమృత.
“సారీ…సారీ” అన్నాడు తనని అలా చూసి.
“నీ సారీ లు నాకేం వద్దు. తిను” అంది. ముద్దా నోటి దగ్గర పెడుతూ.
ఏమి మాట్లాడకుండా తినసాగాడు మహేష్.
“అంతా తినిపించి ముద్దలు పెట్టిన వారికీ ముద్దులు పెట్టి పంపించాలి తెలుసా?” అంది తన చేయి కడుక్కుంటూ.
ఆ మాట వినగానే అదిరిపడ్డాడు మహేష్.
“ఇది కూడా ఇండియన్ కాన్స్టిట్యూఎన్సీ లో ఉందా?” అని అడిగాడు.
“కాదు. ఇది అమృత కాన్స్టిట్యూఎన్సీ అంది” తన కాలర్ ఎగరేస్తున్నట్లు.
“ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేవు. తరువాత ఇస్తాను” అన్నాడు.
“నీతో మాట్లాడి గెలవలెను. అందుకే” అంటూ ఒంగి అతడి పెదాలపై ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
“అమ్ము ఇంకా ఏమి మారలేదు” అనుకుంటూ. రాఘవ్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాడు