అమ్ము ఇంకా ఏమి మారలేదు 301

“లేదమ్మా? అతను ఇంకా నిద్రపోతున్నాడు”
“సరే నువ్వెళ్ళి చూసి రా. నేను పాలు కాచుతా” అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది గాయత్రి.
తాను వెళ్లేసరికి అప్పుడే బాత్రూమ్ నుండి బయటకి వస్తున్నాడు. డోర్ మత్ పై కాళ్ళు తుడుచుకుని బెడ్ దగ్గరికి నడవబోతూ కింద పడబోయాడు. అది గమనించిన అమృత వెంటనే మహేష్ ని పట్టుకుని ఆపి ఆమె భుజం అతడి చేతిని వేసుకుని నడిపించుకుంటూ అతడిని బెడ్ పై కూర్చోబెట్టింది.
“ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా?” అంది అమృత.
“తెలియదు” అన్నట్లు తల ఊపాడు మహేష్.
“పోనీ జరగబోతోందో తెలుసా?”
“తెలీదు”
“ఆక్సిడెంట్ బాగా డామేజ్ చేసినట్లుంది”
“నీ మోకాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయా?”
“తగిలాయి” విసుక్కుంటూ సమాధానం చెప్పాడు మహేష్.
“అందుకే బ్రెయిన్ పని చేయడం లేదు అనుకుంటా?” అంది నవ్వుతూ.
“నిన్ను చంపేస్తా” అంటూ లేవబోయాడు.
అక్కడి నుండి అమృత నవ్వుకుంటూ తుర్రుమని పారిపోయింది.
తాను వేసిన జోక్ కి మహేష్ కూడా నవ్వుకుని మళ్ళీ బెడ్ పై తల వాల్చాడు.
ఇంతలో ఇందాక జరిగిన సంఘటన గుర్తుకొచ్చి చిన్నగా తన గతాన్ని నెమరు వేసుకోసాగాడు.
*******************************
*******************************
ఆరు సంవత్సరాల క్రితం
అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అందులో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు సాయి మహేష్. తన ఫ్రెండ్ గణేష్ తో పాటు కలిసి కాంటీన్ వైపు నడుచుకుంటూ వెళుతున్న అతడి కాలు పై తొక్కింది అమృత. అప్పుడే అమృతని మొదటిసారి చూశాడు మహేష్.
“ఐ యామ్ సారీ అండి” అంది.
“ఐ యామ్ సాయి మహేష్” అంటూ చేయి చాపాడు.
అలా అనగానే అమృత పక్కన ఉన్న తన ఫ్రెండ్ కావ్య, మహేష్ పక్కన ఉన్న గణేష్ కిసుక్కున నవ్వుకున్నారు. అది చూసి అమృతకి కోపం వచ్చింది.
“ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా?”
అప్పుడే రెస్పెక్ట్ తగ్గిపోయింది తన పిలుపులో.
“ఏ ఇయర్ మీరు?” అని అడిగాడు గణేష్ కోపంగా.
“ఫస్ట్ ఇయర్ అంటూ భయపడుతూ సమాధానం చెప్పింది” కావ్య.
“మరి సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా?”
“నువ్వాగరా” అని గణేష్ ని ఆపి “హలో మిస్ నేనేమి అడ్వాంటేజ్ తీసుకోవాలని అలా అనలేదు. అయినా మీ ఫ్రెండ్ కి ఉన్న సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా లేదే మీకు” అన్నాడు అమృతని చూస్తూ.
“మీ దారిలో మీరు వెళ్ళండి, నేను నా దారిన పోతాను” అన్నాడు మహేష్ మళ్ళీ.
“సార్ సార్” అంటూ ఆపింది కావ్య మహేష్ ని.
“ఏం కావాలి? ఈసారి నువ్వు తిట్టాలని అనుకుంటున్నావా?”
“అదేం లేదు సార్. మాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి. మీ దగ్గరుంటే ఇస్తారేమోనని”
“ఇంతకీ మీలో చేంజ్ ఎవరికీ కావాలి?”
“తనకే సార్?” అంది కావ్య.
“అయితే తననే అడగమను” అన్నాడు మహేష్.
“అడగవే” అంది కావ్య అమృతతో.
“సార్ నాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి” అంది క్యూట్ గా.
తన దగ్గర ఉన్న చేంజ్ తీసి తనకు ఇచ్చి థౌసండ్ రూపీస్ నోటు తీసుకున్నాడు మహేష్.
ఆ డబ్బులు తీసుకుని తన ఫ్రెండ్ తో పాటు కాంటీన్ వైపు నడిచింది.
“అమ్మాయి బాగుంది కానీ పొగరు అనుకుంటా?” అన్నాడు గణేష్ మహేష్ తో.
అప్పటివరకు పట్టించుకోలేదు కానీ అప్పుడే చూశాడు మహేష్. బుంగమూతితో అందంగా ఉంది.
“ఏయ్ నీ పేరేంటి?” అని అడిగాడు మహేష్.
“సారీ” అని అరిచి నవ్వుకుంటూ అక్కడి నుండి చిన్నగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమృత.
“అమ్మనీ ఏం ఝలక్ ఇచ్చింది మామా” అన్నాడు గణేష్.
“నీ అనుమానం నిజమే రా” అన్నాడు మహేష్.
“ఏ అనుమానం?”
“దానికి పొగరు ఉంది” అన్నాడు మహేష్ గణేష్ వైపు చూసి.
ఇద్దరూ కాంటీన్ లోకి అడుగు పెట్టగానే అమృత కనిపించింది. కావ్య, అమృత ఇద్దరూ కాఫీ తాగుతూ కనిపించారు.
“నువ్వెళ్ళి రెండు కాఫీ తీసుకురా” అని గణేష్ కి చెప్పి మరిత వైపు నడిచాడు మహేష్.
మహేష్ తమ వైపు రావడం గమనించకుండా కాఫీ తాగుతున్నారు ఇద్దరు. ఒక చేతిలో కాఫీ కప్, ఇంకో చేతిలో పర్సు పట్టుకుని నిలబడి ఉంది అమృత. మహేష్ నేరుగా అమృతకి ఎదురుగా నిలబడి తన మేడలో ఉన్న ఐ డి కార్డు తీసుకుని “అమృత” అని తన పేరు చదివాడు.
“ఒకే అమృత హావ్ ఏ నైస్ డే” అని అక్కడ నుండి గణేష్ దగ్గరకి వెళ్ళిపోయాడు.
అప్పటినుండి మహేష్ కనిపించినపుడల్లా నవ్వుతూ ఉండేది. రోజుకు ఒక్కసారైనా మహేష్ ను చూసి వెళ్లిపోయేది. ఇలా కొన్ని రోజుల్లోనే మాటలు లేక పోయినా మంచి బాండింగ్ ఏర్పడింది.
ఒకరోజు అమృత రెడ్ కలర్ చుడిదార్ వేసుకొని తన స్కూటీ పార్క్ చేసి క్లాస్ లోకి వెళ్ళబోతూ మహేష్ ని చూసింది. చాలా దూరంగా గణేష్ తో ఎదో మాట్లాడుతున్నాడు. అమృత దూరమైనా అతడి పక్క నుండే క్లాస్ కి వెళ్లాలని అటు వైపు నడుచుకుంటూ వెళుతోంది. తాను దగ్గరకి వచ్చాక చూసాడు మహేష్ అమృతని.
“రేయ్ గణేష్…!”
“చెప్పరా”
“నీకో విషయం చెప్తే ఏమి అనుకోవు కదా?”
“చెప్పి తగలడు”
“నీకు ఈ రెడ్ కలర్ డ్రెస్ ఏమి బాగాలేదు రా”
“ఎం మాట్లాడుతున్నావు రా? నీ కళ్ళనేమైనా కాకులు ఎత్తుకెళ్లిపోయాయా. ఇది బ్లూ కలర్ షర్ట్”
“అటు చూడు” అన్నట్లు సైగ చేసాడు.