అమ్ము ఇంకా ఏమి మారలేదు 301

“మరి లేకపోతే ఏంటి? నిన్ను ఎన్నిసార్లు అడిగాను ఇంటికి రమ్మని. ఒక్కసారైనా వచ్చావా? ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా వదిలేస్తాను అనుకున్నావ్” అంది గాయత్రి.
“మా ఫ్యామిలీ మొత్తానికి ఏమి మందు పెట్టావ్ రా” అనుకుంది అమృత.
మహేష్ ని గెస్ట్ రూం లో పడుకోబెట్టి, గాయత్రి వంటింట్లోకి వెళ్లిపోయింది. మూర్తి అతనికి అలసటగా ఉందని వెళ్లి పడుకున్నాడు. మహేష్ తో పాటు అమృత అతని రూం లో ఉంది. ఆమె కళ్లలోకి చూడడానికి భయపడుతున్నాడు మహేష్.

ఎక్కడికి పోతావు చిన్నవాడా” అని పాడుకుంటూ అమృత బయటికి వెళ్ళిపోతూ మహేష్ వైపు చూసి కొంటెగా నవ్వి “ఈసారి తప్పించుకోవాలని ట్రై చేయకు” అని వెళ్ళిపోయింది.
ఏం చేయాలో అర్థంకావడం లేదు మహేష్ కి. బాగా దెబ్బలు తగిలినందువల్ల అలా పడుకుండిపోయాడు.
**********************************
**********************************
సాయంత్రం అతడు నిద్ర లేచే సమయానికి పక్కనే అమృత కుర్చీలో కూర్చుని ఉంది.
“గుడ్ ఈవెనింగ్ సార్”
“నేను మీకు సార్ ఏంటి మేడం?”
“నీ పెర్ఫార్మెన్స్ తగలెయ్య….! ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు” అంది లేచి నిలబడుతూ.
“ఎక్కడికెళ్లారు?” అన్నాడు మహేష్ కూడా లేచి నిలబడి.
“మమ్మీ డాడీ గుడికి వెళ్లారు”
“మరి మీరు?”
“నువ్వు ఒక్కడివే ఉంటావని నీకోసం ఉండిపోయా”
“అయ్యో…!”
“అయ్యో…! ఏంట్రా? నాలుగు సంవత్సరాల నుండి నీకోసం ఎదురు చూస్తున్నా. నా మీద కొంచెం కూడా జాలి కలగలేదా? ఎంత పిచ్చిగా ప్రేమించాను రా నిన్ను. నన్ను ఎలా వదిలెయ్యాలనిపించింది రా నీకు”
“నా వల్ల నువ్వు సఫర్ అయినందుకు సారీ”
“సారీలు కూడా చేబుతున్నావు. చాలా మారిపోయారండి మీరు”
“అలా మాట్లాడకు అమృత. ఇట్ హర్ట్స్ మి”
“నువ్వు హర్ట్ కూడా అవుతావా?”
“అదేంటి? నేను మాత్రం మనిషిని కాదా?”
“కాదు. నువ్వు మనిషివి కాదు. నన్ను మోసం చేసిన రాక్షసుడివి”
“అర్థం చేసుకో అమృత. నాలుగు సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాను? ఇప్పుడెలా ఉన్నాను”
“ఏం జరిగిందో నాతొ చెప్పకూడదా?” అడిగింది మహేష్ కాలర్ పట్టుకుని.
“లేదు అమృత నా జీవితం ఛిన్నాభిన్నం అయ్యింది. ఒంటరి వాడిగా మిగిలిపోయాను. నా చేయి పట్టుకోవాలని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అన్నాడు తన చేతుల నుండి కాలర్ ని విడిపించుకుంటూ.
“నువ్వు లేకుండా నా భవిష్యత్తు బాగుంటుంది అని ఎలా అనుకున్నావురా?”
“నేను లేకపోతేనే బాగుంటుంది”
“అయినా నా గురించి నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వెవరు?”
అలా అనగానే చాలా కోపం వచ్చింది మహేష్ కి.అమృతని కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోయాడు. కొడతాడు అని భయపడిన అమృత తల దించుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. అమృతని అలా చూడగానే ఆగలేకపోయాడు మహేష్. తనని కౌగిలించుకోవడానికి దగ్గరికి వచ్చాడు. కానీ ఎందుకో మళ్ళీ వెనక్కి తిరిగబోయాడు. అది గమనించిన అమృత వెంటనే వాడిని ఆపి కౌగిలించుకుంది.అమృత కళ్ళ నిండా నీళ్లు. ఏం చేయాలో తెలియడం లేదు మహేష్ కి. ఇక చేసేదేమి లేక అమృత ముఖాన్ని తన ఎడమ చేతిలోకి తీసుకోవాలని చూశాడు. కానీ అతడు చేయి పెట్టినప్పుడల్లా తన తలతోనే విదిలిస్తోంది అమృత.
“నువ్వు ఏమి మారలేదు అమృత” అన్నాడు మహేష్ చిన్నగా నవ్వుతూ.
దాంతో అమృత తల ఎత్తి మహేష్ ని కోపంగా చూసింది.
“ఎందుకు మారలేదు. చూడు నీ మీద బెంగతో ఎంత చిక్కిపోయానో. కానీ నువ్వు మాత్రం పందిలాగా లావు అయ్యావు”
“నీకు అలా కనిపిస్తున్నానా?”
“మరి ఇంతకు ముందు నిన్ను హత్తుకుంటే నా కుడి చేయి నా ఎడమ మోచేయి దాకా వెళ్ళేది. ఇప్పుడు చూడు నా మణికట్టు దగ్గరే ఆగిపోయింది”
“సరేలే ఇక వదులు” అన్నాడు తనని విడిపించుకుంటూ.
ఇద్దరూ కౌగిలి నుండి విడిపడిపోయారు.
“అయ్యో నీకొక విషయం చెప్పడం మర్చిపోయా” అంది అమృత తల మీద చేయి పెట్టుకుని.
“ఏంటి?” అన్నాడు ఆశ్చర్యంగా.
“దగ్గరికి రా” అన్నట్లు సైగ చేసింది.
“నేను రాను. వస్తే ఏం చేస్తావో నాకు తెలుసు”
“రాకపోయినా చేస్తా” అంటూ అతడి షర్ట్ పట్టుకుని గుంజి అతడి పెదాలపై చిన్నగా ముద్దు పెట్టుకుంది.
ఐదు సెకన్లు ముద్దు పెట్టి “ఉమ్మా” అంటూ విడిచిపెట్టింది. ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు మహేష్ కి. ఇంతలో సిగ్గుతో అక్కడి నుండి పరుగెట్టబోయిన అమృత ని ఆపడానికి “అమ్ము” అని కేకేశాడు మహేష్.
ఠక్కున వెనక్కి తిరిగి “గుర్తుందన్నమాట” అంది.
“ఏంటి?” అన్నట్లు చూశాడు.
“నా ముద్దుపేరు” అని మళ్ళీ మహేష్ దగ్గరకు వచ్చి ఈసారి బుగ్గపై ముద్దు పెట్టి పరుగెత్తుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది.
తాను కిందకి వెళ్ళగానే తన అమ్మా నాన్న కార్ సౌండ్ వినిపించింది అమృతకి. కాసేపటికి మూర్తి, గాయత్రీలు ఇంట్లో అడుగు పెట్టారు.
“మహేష్ కి ఎలా ఉందమ్మా?”
“నొప్పిగానే ఉందంట డాడీ. మీరు ఫోన్ చేసి రాఘవ్ అంకుల్ ని రమ్మని చెప్పండి”
“అవునమ్మా. నేను అసలు ఆ విషయమే మరిచిపోయాను” అని రాఘవ్ కి కాల్ చేసి విషయం టూకీగా చెప్పి తన కిట్ తో ఇంటికి రమ్మని చెప్పాడు.
“మహేష్ కి పాలు ఇచ్చావా?” అని అడిగింది గాయత్రి.