అమ్ము ఇంకా ఏమి మారలేదు 301

అటువైపు అమృత నడుచుకుంటూ వెళుతోంది. తనని చూసి ఏమి మాట్లాడలేదు గణేష్.
ఇంతలో మహేష్ “నేను చెప్పేది అదే నీకు బ్లూ కలర్ డ్రెస్ అయితే బాగుంటుంది” అన్నాడు అమృత వైపు చూసి.
అమృత వారిద్దరినీ దాటుకుని నడిచి వెళ్లి మలుపు తిరిగే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తననే చూస్తూ నవ్వుతున్నాడు మహేష్. అతడిని చూసి ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది.
ఆ తరువాత రోజు ఏం జరిగిందో తెలీదు మహేష్ కి. ఎందుకంటే ఆ రోజు కాలేజ్ కి వెళ్ళలేదు మహేష్. మరుసటిరోజు కాలేజ్ కి వెళ్ళగానే తనకు ఎదురు పడింది అమృత. అతడిని చాల కోపంగా చూస్తోంది.
“ఏంటి చంపేస్తావా?” అని అడిగాడు మహేష్.
“అవును”
“నేనేం చేశాను?”
“నాకు బ్లూ కలర్ డ్రెస్ బాగుంటుందని చెప్పి, నేను అదే కలర్ డ్రెస్ వేసుకుని వస్తే నిన్న నువ్వు రాలేదు”
“దానికి చంపేస్తావా?”
తను సమాధానం చెప్పక ముందే అక్కడికి కొందరు సీనియర్స్ వచ్చారు. వాళ్లంతా మహేష్ క్లాస్మేట్స్.
“ఎవర్రా తను?”
“మన జూనియర్”
“నీ పేరేంటి?”
“అమృత అన్నయ్య” అంది.
“ఎమ్మా మేమంతా నీకు అన్నయ్యలమా?”
“అందరూ కాదు” అంది.
“మరి ఎవరెవరూ?”
“మహేష్ తప్పా అందరూ” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అందరూ మహేష్ వైపు ఒక రకంగా చూసారు. ఇక అక్కడే ఉంటె డేంజర్ అనుకోని అక్కడి నుండి జంప్ అయ్యాడు.
మరుసటి రోజు తన స్కూటీని పార్కింగ్ నుండి బయటకు తీయబోతూ పడిపోయింది అమృత. అక్కడే ఉన్న మహేష్ చూసి పైకి లేపి నిలబెట్టాడు. కానీ దెబ్బ కొంచెం గట్టిగా తగలడం వల్ల సరిగ్గా నడవలేకపోతోంది అమృత. తన చేతిని అతడి భుజం పై వేసుకుని తనని నడిపించుకుంటూ పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టాడు. అక్కడ అమృత ని వదిలి వెళ్లబోతుంటే అమృత “ఐ లవ్ యు సాయి” అంది.
“ఇట్స్ ఒకే. యు ఆర్ వెల్కమ్” అని చెప్పి రెండుఁ అడుగులు వేసి వెనక్కి తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చి “ఏమన్నావు?” అని అడిగాడు.
“ఐ లవ్ యు” అని చెప్పి వెనక్కి తిరిగింది.
“మరి నా ఒపీనియన్ అవసరం లేదా?”
“నువ్వు చచ్చినట్లు నన్నే ప్రేమించాలి. నీకు వేరే ఆప్షన్ లేదు”
“నువ్వే ఫిక్స్ అయిపోయావా?”
“అమృత ఇక్కడ”
“ఐతే భయపడాలా?”
సాయంత్రం అవ్వడం వల్ల పెద్దగా స్టూడెంట్స్ లేరు.
“అదేంటి? నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా?”
“అవును”
గుండె పగిలినట్లు అనిపించింది అమృతకి.
“‘ఎవరిని?”
“తను నీ క్లాస్ మేటే”
“ఎవరూ?”
“కావ్యా………..” అంటూ దీర్ఘం తీస్తుండగా “కావ్యనా?” అని అడిగింది.
“కాదు. ఆ అమ్మాయి ఎప్పుడు కావ్య పక్కన తిరుగుతూ ఉంటుంది”.
అలా అనగానే ఆలోచనలో పడింది అమృత.
“తనకు బాగా పొగరు” అన్నాడు. ఇంకా ఆలోచిస్తూనే ఉంది అమృత.
“తను మొన్న బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చిందట. నేను చూడలేదని తిట్టింది” అనగానే అర్థం అయ్యింది అమృతకి మహేష్ ఎవరిని లవ్ చేస్తున్నాడో. చిన్నగా నవ్వి “నేను పొగరుబోతునా?” అని అడిగింది.
“నేను నీ గురించి చెప్పట్లేదు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి చెబుతున్నాను” అన్నాడు నవ్వుతు.
“చంపుతా. కాసేపు టెన్షన్ పెట్టావు కదరా?” అంది రిలాక్స్ అవుతూ.
“ఇదంతా నిజంగా నాపై ప్రేమేనా?” అన్నాడు నవ్వుతూ.
“నీకు ఇప్పుడు తెలీదులే” అంది.
“మరెప్పుడు తెలుస్తుంది” అని అడిగాడు.
*****************************************************
*****************************************************
“బాబు మహేష్…..బాబు మహేష్…….” అన్న పిలుపుతో మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు.
ఎదురుగా గాయత్రి పాలు పట్టుకుని నిలుచుంది.

ఏంటయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నావ్?” అంది చేతిలోని పాలని అతనికి అందిస్తూ.
“ఏం లేదు మేడం” అంటూ ఆమె చేతిలోని పాలు అందుకున్నాడు.
“ఎలా ఉంది ఇప్పుడు?”
“పర్లేదు మేడం. కొంచెం నొప్పి తగ్గింది”
“కాసేపు ఆగు మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు”
“నాకేం పర్లేదు మేడం. రేపు ఉదయనికంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే వెళ్ళిపోతాను”
“ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎన్ని చెప్పినా వారం రోజులు ఇక్కడ ఉంది తీరాల్సిందే”
వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి రాఘవేంద్ర మెడికల్ కిట్ తో వచ్చాడు. బెడ్ పై ఉన్న మహేష్ ని చూసి దగ్గరికి వచ్చి “అమ్మా గాయత్రీ…ఎక్కడ మహేష్?” అని అడిగాడు.
అతడి వెనకాలే అమృత, మూర్తిలు కూడా వచ్చారు.
“మీకు కూడా తెలుసా మహేష్?” అని అడిగింది అమృత రాఘవేంద్రని.
“తెలుసమ్మా. మీ నాన్న దయ వల్ల” అని మహేష్ వైపు చూసి “హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ?” అని అడిగాడు మహేష్ ని.
“నెవర్ బెటర్ డాక్టర్” అని బదులిచ్చాడు.
కాసేపు అతడిని చెక్ చేసి, అతడి చేతికున్న కట్టుని మార్చి బయటకు వెళ్ళిపోయాడు.
అతడి వెనకాల మూర్తి, మూర్తి వెనకాల గాయత్రీ బయటకు వెళ్లిపోయారు. కానీ అమృత మాత్రం వాళ్ళ వెనకాలే వెళ్లినట్లు వెళ్లి తలుపు కాస్త దగ్గరగా వేసి మహేష్ దగ్గరికి వచ్చింది.
రూంలో అమృత ని చూసి మళ్ళీ ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యాడు మహేష్.
“హ్మ్” అని నిట్టూర్చి అతడి పక్కనే కూర్చుంది అమృత.
ఆమె అలా కూర్చోగానే టక్కున లేచి నిలబడ్డాడు మహేష్.