అమ్ము ఇంకా ఏమి మారలేదు 301

“ఒకటి నేను చెప్పాను. ఇంకోటి నువ్వు చెప్పు”
“సరే అయితే సస్పెన్స్”
“వావ్…ఇంప్రెస్సివ్” అంది ఎక్సయిటింగ్ గా.
“నిన్ను ఆల్రెడీ ఇంప్రెస్స్ చేసాను”
“సర్లే…షార్ప్ టెన్ థర్టీ కి అలంకార థియేటర్ దగ్గరికి వచ్చేసేయ్”
“హే…మార్నింగ్ షోకి వెళ్దామా?”
“అవును నాకు ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది. ప్లీజ్ మార్నింగ్ షో కే వెళ్దాం”
“సరే అయితే. నేను రెడీగా వచ్చేస్తాను. డిలే చేయకుండా నువ్వు కూడా వచ్చే”
“సో స్వీట్. ఇదిగో ఇప్పుడే బయల్దేరుతాను” అంటూ మరో అరగంటలో థియేటర్ దగ్గర ఉంది అమృత.
ఆమె వెళ్లేసరికి అక్కడే చేతిలో టికెట్స్ పట్టుకుని ఉన్నాడు మహేష్. నా కంటే ముందుగా వచ్చి అప్పుడే టికెట్స్ కూడా తీసావా?” అని అడిగింది.
“హ హ” అన్నాడు అతడి జుట్టుని ఎగరేస్తూ.
“ముద్దొస్తున్నావ్ రా” అంది మహేష్ బుగ్గలు పిండుతూ.
“సరే పద” అంటూ ఇద్దరూ థియేటర్లోకి నడిచారు.
“అవును ఇంట క్రౌడ్ లో టికెట్స్ ఎలా సంపాదించావ్?” అని అడిగింది అమృత.
“ఈ థియేటర్ మేనేజర్ మన గణేష్ మావయ్య. వాడే రెచొమ్మెంద్ చేసాడు” అన్నాడు మహేష్.
“పర్లేదు దొరగారు బాగానే మెయింటైన్ చేస్తున్నారు”
“ఏంటి?”
“సర్కిల్”
“ఏదో మీ దయ” అన్నాడు నవ్వుతూ. అతడు ఆలా నవ్వగానే అమృత కూడా నవ్వేసింది.
సినిమా స్టార్ట్ అయ్యింది. పది నిమిషాల తరువాత మహేష్ అమృత వైపు చూస్తున్నాడు. “ఏం చేస్తున్నాడో” అనుకుంటూ అమృత కూడా మహేష్ ని చూసింది. ఆమెనే చూస్తున్న మహేష్ ని చూసి “ఏంటి?” అన్నట్లు సైగ చేసింది. ‘ఏం లేదు?” అన్నట్లు మహేష్ కూడా సైగ చేసి సినిమా చూడటం ప్రారంభించాడు.

అలా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని సినిమా చూస్తున్నారు. ఇంతలో అమృత మహేష్ భుజం పై తల వాల్చింది.
కాసేపటి తరువాత మహేష్ ఆమె తల పై తల వాల్చి ఉండిపోయాడు. కాసేపటికి ఇంటర్వెల్ ఇచ్చారు. అమృత లేద్దామనుకుంటే మహేష్ లేవడం లేదు. “సాయి” అని పిలిచింది. అతను పలకలేదు. అతడి ముఖం పై చిన్నగా తట్టింది. టక్కున లేచాడు. లేచి కళ్ళు తుడుచుకుంటున్నాడు.
“ఏమైంది?” అని అడిగింది.
“ఏమి లేదు. కొంచెం నిద్ర పోయాను” అని జవాబిచ్చాడు.
“నిద్ర పోయావా?”
“అవును”
“నా పక్కన ఉన్నా కూడా నీకు నిద్ర పట్టిందా?”
“అదేంటి? అలా అడిగావు?” అన్నాడు మహేష్.
“ఏమిలేదు” అంటూ లేచింది.
“ఇప్పుడు ఏమి జరిగిందని అంట సీరియస్ గా ఉన్నావ్?” అన్నాడు అతడు కూడా లేచి.
“ఏమి జరగలేదనే సీరియస్ గా ఉన్నాను” అంది బయటకి నడుస్తూ.
“ప్లీజ్ అమ్ము చెప్పొచ్చు కదా” అన్నాడు మహేష్ కూడా ఆమె వెనకే నడుస్తూ.
“ఈరోజు మొత్తం నాతో మాట్లాడకు” అంటూ మహేష్ ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది.
ఆ సంఘటన జరిగిన తరువాత మహేష్ చాల సార్లు కాల్ చేసాడు. కానీ అమృత లిఫ్ట్ చేయలేదు. చాల సార్లు “సారీ” అని మెసేజ్ లు పెట్టాడు రిప్లై లేదు.
మరుసటిరోజు మామూలుగానే కాలేజీ కి వచ్చింది అమృత. కానీ తనకు మహేష్ కనిపించలేదు. ఎంత వెదకినా కనిపించలేదు. ఇక ఆగలేక ఫోన్ చేసింది. చాల సేపు రింగ్ అయ్యింది కానీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ట్రై చేసింది. ఈసారి రెండు రింగులకే లిఫ్ట్ చేసాడు మహేష్.
“సారీ అమృత. ఐ యామ్ రియల్లీ సారీ” అన్నాడు.
“అది వదిలేయ్. ఎందుకు ఇవ్వాళ కాలేజీ కి రాలేదు?” అని అడిగింది.
“నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు”
అది వినగానే ఏడుపొచ్చేసింది అమృతకి. కానీ ఆపుకుని “ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్?” అని అడిగింది.
“నేను మా ఇంట్లో ఉన్నాను” అన్నాడు.
“సరే నేను రావొచ్చా?” అని అడిగింది.
“నువ్వు పర్మిషన్ కూడా అడుగుతున్నావా?”
“ఏయ్…నిన్ను చంపేస్తాను”
“చంపాలనుకుంటే రావొద్దు”
“అయితే ఊరికే కొడతానులే. ఇంటి అడ్రస్ చెప్పు” అంది.
మహేష్ అతడు ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పాడు.
“సరే అయితే ఒక అరగంటలో అక్కడికి వస్తాను”
“సరే” అంటూ కాల్ కట్ చేసాడు మహేష్.