అమ్ము ఇంకా ఏమి మారలేదు 301

ఒక అరగంటకు అయిదు నిముషాలు మిగిలి ఉండగానే అక్కడకు చేరుకుంది. అక్కడ తనని ఆ ఇంటి వాచ్ మాన్ వెళ్లనివ్వడం లేదు. వెంటనే మహేష్ కి కాల్ చేసింది.
“ఏంటి అమృత ఇంకా రాలేదు?” అని అడిగాడు మహేష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే.
“నేను వచ్చాను. మీ వాచ్ మాన్ నన్ను లోపలి రానివ్వడం లేదు” అంది.
“ఓ సారీ. టూ మినిట్స్” అని కాల్ కట్ చేసాడు.
ఒక రెండు నిమిషాల తరువాత వాచ్ మాన్ గేట్ ఓపెన్ చేసాడు. మహేష్ వాళ్ళ ఇల్లు చూసి షాక్ అయ్యింది అమృత.
మహేష్ రోజు కాలేజీ బస్సు లో వస్తాడు కాలేజీ కి. కానీ అతడి ఇంటి ముందు రెండు కార్లు ఉన్నాయి. అమృత తన బైక్ దిగి ఇంటిలోకి నడవబోతుంటే ఆమెకి ఎదురుగా వచ్చాడు మహేష్. అతడిని చూస్తూ అలా ఉండిపోయింది.
“లోపలికి రా అమృత” అని పిలిచాడు మహేష్.
అయినా కూడా అమృత ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది. మల్లె ఇంకోసారి లోపలికి పిలిచాడు మహేష్. ఈసారి అమృత తేరుకుని లోపలికి నడిచింది. చాల పెద్ద ఇల్లు అది.
“మీ మమ్మీ, డాడీ లు లేరా?” అని అడిగింది.
“వాళ్లు ఆస్ట్రేలియా లో ఉంటారు. నాకు అక్కడ ఉండడం నచ్చదు. అందుకే ఇక్కడే చదువుకుంటున్నాను” అన్నాడు తాపీగా.
అమృతని అతడి గదిలోకి తీసుకెళ్లాడు మహేష్. అమృతని బెడ్ పై కూర్చోబెట్టి, పక్కనే ఉన్న కుర్చీని లాక్కొని ఆమెకి దగ్గరగా కూర్చున్నాడు మహేష్.
“అవును నీ హెల్త్ బాగాలేదు అన్నావు కదా. ఎప్పటినుండి ఇలా ఉంది?” అని అడిగింది.
“టూ డేస్ బ్యాక్ నుండి ఇలాగె ఉంది”
“అంటే నిన్న థియేటర్ లో నిద్ర పోయింది కూడా అందుకేనా?” అని అడిగింది కోపంగా.
“మే బి అయ్యుండొచ్చు” అన్నాడు.
“కరెక్ట్ గా చెప్పు” అంది.
“అందుకే నిద్రపోయాను” అన్నాడు తల దించుకుని.
“హెల్త్ సరిగా లేదని చెప్తే నేను నిన్న అలా బిహేవ్ చేసేదాన్ని కాదు” అంటూ చిన్న గా ఏడవసాగింది.
మహేష్ తల ఎట్టి చూసి “హే అమ్ము ఏమైందని ఇప్పుడు అంతగా బాధ పడుతున్నావు? ఐ యామ్ ఆల్రైట్” అన్నాడు నవ్వుతూ.
“ఐ యామ్ సారీ సాయి. ఇంకెప్పుడు నీతో అలా బిహేవ్ చేయను”
“అయినా అమ్ము నువ్వు ఆలా బిహేవ్ చేయడం వల్ల నాకు ఇంకా దగ్గర అయ్యావ్” అన్నాడు.
అర్థం కానట్లు మహేష్ వైపు చూసింది.
“నిజం అమ్ము. నాకు ఇక్కడ ఎవ్వరు లేరు. మమ్మీ, డాడీ లు చాల దూరంగా ఉన్నారు. నాతో ప్రేమగా మాట్లాడటానికి, నన్ను ఓదార్చడానికి, నాపై కోప్పడడానికి ఇక్కడ ఎవరు లేరు. కానీ నిన్న నువ్వు నాపై కోప్పడేసరికి నాకు చాల దగ్గర మనిషిలాగ అనిపించావ్” అన్నాడు.
ఇక పొంగుతున్న ఏడుపును కంట్రోల్ చేయలేకపోయింది అమృత. వెంటనే కింద కూర్చొని మహేష్ మోకాళ్లపై పడి ఏడవసాగింది. మహేష్ లేచి తనని నిలబెట్టి గట్టిగ హత్తుకున్నాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఇంకా గట్టిగా హత్తుకుంది అమృత. ఇంకా ఏడుస్తూనే ఉంది అమృత. మహేష్ ఎంత చెబుతున్న అంతకంత ఎక్కువ ఏడవసాగింది. ఇక చేసేది లేక తనని బెడ్ పై కూర్చోబెట్టి పక్కనే గ్లాస్ లో వాటర్ పోసి అమృతకి ఇచ్చాడు. తను చిన్నగా ఏడుపు ఆపి నీళ్లు తాగింది.
“ఏడ్చి ఏడ్చి బాగా అలసిపోయినట్లు ఉన్నావ్. కాసేపు పడుకో” అన్నాడు మహేష్.
“ఉహూ” అంటూ తల అడ్డంగా ఊపింది.
“మరి?” అన్నాడు మహేష్.
“నేను ఇక్కడికి వచ్చింది నిద్ర పోవడానికి కాదు”
“మరి ఏడవడానికి వచ్చావా?” అని అడిగాడు.
“నిన్ను చంపేస్తా” అంటూ లేచింది.
“అవును కదా నన్ను చంపడానికి వచ్చావ్ కదా?” అన్నాడు.
“లేదు” అని మహేష్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాగింది.
************************************
************************************
“అమృతా…అమృతా…” అంటూ గాయత్రీ పిలుపుతో తను మళ్ళీ ఈ లోకం లోకి వచ్చింది.
“వస్తున్నా అమ్మా” అంటూ బదులిచ్చింది.
అమృత వాళ్ళది రెండు అంతస్తుల బిల్డింగ్. అమృత ఉన్న రూమ్, మహేష్ ఉన్న రూమ్ పక్క పక్కనే ఉంటాయి. ఇక మూర్తి, గాయత్రిల రూమ్ కిందనే ఉంటుంది. గాయత్రి పిలవగానే కిందకి వెళ్ళింది అమృత.
“వెళ్లి మహేష్ కి భోజనం ఇచ్చి రామ్మా?” అంది.