జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

ఇందుకు మెలకువ రాక ముందే వెళ్లిపోవాలని నిర్ణయించుకొని ఆమెకు నిద్రా భంగం కలగకుండా నెమ్మదిగా పక్కకు జరిపి తనను రాత్రంతా గట్టిగా పట్టుకున్న చేతులను మరియు తన కాలు మీద వేసిన ఆమె కాలును నిదానంగా జరిపి పైకి లేచి కింద పడిపోయిన రగ్గును నడుము వరకు కప్పి ఇందు నిద్రపోతున్న అమాయకమైన ముఖాన్ని చూస్తూ కొంతసేపు అలాగే మైమరిచిపోయి నిలబడిపోతాడు.

కొన్ని నిమిషాల తరువాత నిద్రలో కదలగా తేరుకున్న మహేష్ ఇందు నుదిటిపై చిన్న ముద్దు పెట్టి తరువాత ఏమి జరుగుతుందో అన్నదానిని ఆ దేవునికి వదిలేసి ఇందు మొబైల్ అందుకొని జ్యోతికి ఫోన్ చెయ్యగా ఇంటి బయట అర గంట నుండి వేచి చుస్తున్నాను అని చెప్పేసరికి ఇక తను నిశ్చింతగా వెళ్ళవచ్చు అనుకోని తలుపు తీసి ఇందు గారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పగా ఇందు కు చెప్పారా వెళ్తున్నానని అని జ్యోతి అడుగగా ఆమె ఇంకా నిద్రపోతోంది అని చెప్పి జాగ్రత్తగా చూసుకొమ్మని తరువాత మీకు కాల్ చేస్తాను అని చెప్పి మారుతి ఓమ్ని లో హోటల్ కు భయలుదేరుతాడు.

ఉదయం రోడ్లన్నీ ప్రశాంతంగా ఉండటంతో త్వరగానే హోటల్ కు చేరుకొని ఓమ్ని ని ఒక మూలన పార్క్ చేసి హోటల్ వర్కర్ ను పిలిచి దీనిని కప్పడానికి కవర్ ఏదైనా దొరుకుతుందా అని అతడి చేతిలో 500 నోట్ పెట్టగా అతడు ఉంది కాని సగం వరకు సరిపోతుంది అని చెప్పగా ఏదో ఒకటి తీసుకురమ్మనగా అది మారుతి విండోస్ వరకు మాత్రమే కవర్ చేస్తున్న ఇప్పటికి ఇది చాలు అనుకోని ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కు వెళతాడు , స్నానం చేయడానికి బాత్ రూమ్ లోకి వెళ్లగా లోపల ఉన్న అద్దం లో తనని చేసుకోగా జుట్టంత చిందర వందరగా అయ్యి దుమ్ము పట్టి ఉండటంతో తల స్నానం చేయాలి అని అనుకుంటాడు జ్యోతి లోపలకి వెళ్లి ఇందు ఇంకా నిద్రపోతుండటంతో ఆమె లేచేలోపల కాఫీ చేద్దామనుకొని వంటింట్లోకి వెళుతుంది.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.