జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

ఇంటి దగ్గర నాకోసం వేచి చూస్తుంటారు , ఈ సారి వచ్చినప్పుడు కచ్చితంగా భోజనం చేసి వెళ్తాను అని చెప్పగా ,విక్రమ్ తాళం తీసుకురాగా పిల్లల నుదిటిపై చెరొక ముద్దు పెట్టి మళ్ళీ వస్తాను అని చెప్పి డైరెక్ట్ గా అందరూ వెళ్లిన ఇంటికి చేరుకుంటారు.

ఇక్కడ సుమారు 5:30 సమయంలో రూమ్ పనులు చివరిదశకు చేరుకుంటుండగా బిరియాని చెయ్యడానికి ఫ్రిడ్జ్ లోనుండి తీసుకొని తయారుచేస్తుండగా 6 గంటలకు ముందుగానే మొత్తం పనులు ముగించి చెత్తనంత బ్యాగ్ లలో నింపుకొని మేడం మీరు చెప్పినట్లుగానే 6 లోపల ముగించాము అని చెప్పగా ఒకసారి బెడ్ రూమ్ తలుపు తెరవగానే ఒక్కసారిగా మొత్తం లైట్స్ వెలుగగా ఆ వెలుతురులో రూమ్ ని , ఆ decoration ని చూసి నోరు తెరిచి ఆశ్చర్యపోయి చూస్తూ ముఖం మెరుస్తూ అద్భుతంగా ఉంది అని పొగుడుతూ వాళ్ళు అడిగిన దాని కంటే ఎక్కువే ఇవ్వగా వాళ్ళు కూడా సంతోషంతో వెళ్లడం ఆమెకు మరింత ఆనందాన్ని ఇస్తుంది.

వెంటనే ఆ రూమ్ కు తాళం వేసి, బయటి వాకిలి ఘడియ పెట్టి 6:30 సమయంలో వంట మొత్తం ముగించి అంతా శుభ్రన్గా తుడిచి ,డైనింగ్ టేబుల్ పై కొత్త cloth కప్పి చుట్టూ మరియు మధ్యలో candles సెట్ చేసి అలసిపోవడం వల్ల తల స్నానం చెయ్యడానికి వెళ్తుంది. అక్కడ మహేష్ మరియు విక్రమ్ లు లోపలికి వెళ్లగా అప్పటికే హాల్ అంత శుభ్రం చేసి కంప్యూటర్స్ ఓం చేసి వైఫై కనెక్ట్ చేసి మాకు ఎదురు చూస్తాన్నారు.

కిడ్నప్ అయ్యిన అమ్మాయిల బంధువులకు ఒక్కొకారికి థ్Aల 10 లక్షలు ఇవ్వబోగ మాకు మా అమ్మాయి క్షేమంగా వచ్చింది అదే 10 లక్షలు మాకు ఇంకేమి వద్దు అని చెప్పగా , ఇది వాడు మీ అమ్మాయిని కిడ్నప్ చేసి హింసించినందుకు ప్రతిఫలం అనుకోండి అని అందరికి డబ్బు ఇచ్చి వారు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పగా ఒక్కొక్కరుగా మా ముగ్గురిని కౌగిలించుకొని కృతజ్ఞతలు తెలిపి మీకు ఏ కష్టం వచ్చినా మా వంతు సహాయం చేయడానికి ఎల్లా వేళలా సిద్ధంగా ఉంటామని చెప్తూ వాళ్ళ ఇంటికి వెళతారు.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.