జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

ఇప్పుడెలా దేవుడా ఇలాంటి పరిస్థితి కల్పించావ్ అని ఆలోచిస్తాడు. సాగర్ వాళ్ళ ఇంటిలో అంత తమ ఇంటి కూతురు గురించి ఆందోళన చెందుతుండగా వారి ఇంటి ముందు కారు ఆగి సాగర్ మరియు అతని చెల్లెలు క్షేమంగా ఇంటికి చేరడంతో సంతోషంతో ఒకరితరువాత ఒకరు కౌగిలించుకొని లోపలికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ మహేష్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ,అలాగే అతనే కారుని ఇచ్చి పంపాడని చెప్పగా ,సాగర్ తండ్రి ఎంత మంచి గొప్ప మనసున్నవాడు అని మహేష్ ను పొగుడుతూ అతన్ని ఇంటికి పిలిచుకొని రా పొట్టేలు వేద్దాం అని చెబుతాడు.

వెంటనే మహేష్ కు ఫోన్ చేసి మేము క్షేమంగా ఇంటికి చేరామని చెప్పగా నిరాశతో సరే అని చెప్పిన మహేష్ గొంతు విని , ఏమైంది మహేష్ అలా ఉన్నావు అని అడుగగా , ఇక్కడ నాకు పెద్ద కష్టం వచ్చి పడింది అనగా , నీకు కష్టమా వెంటనే వస్తున్నాను అని చెప్పగా , ఇది బయటి సమస్య కాదు సాగర్ మనసుకు సంబంధించిన సమస్య అన్న వెంటనే అర్థమైంది మహేష్ ప్రేమ సమస్య కదా అని సాగర్ అనగా అవును సాగర్ ఎలా పరిష్కరించాలి అర్థం అవ్వడం లేదు అని చెప్పగా నీ మనసు ఏది చెపితే అది చెయ్ boss , All the best , good night అని చెప్పి సాగర్ కాల్ కట్ చేస్తాడు.

ఏంటన్నయ్య సమస్య అంటున్నావు అని సాగర్ చెల్లెలు అడగగా , నవ్వుతూ అదే మన మహేష్ కు పెద్ద కష్టం వచ్చిపడిందంట అని చెప్పగా కోపంగా అన్నయ్యను చూస్తూ అతడు భాదల్లో ఉంటే నువ్వు నవ్వుతున్నావా అని గట్టిగా అడగగా , అది అతడి ప్రేమ సమస్య అని చెప్పగా ఆమె తలపై ఒక దెబ్బ తనకు తాను వేసుకొని అలాంటి వాటిలో మూడో వ్యక్తి దూరితే అది ప్రళయంగా మారిపోతుంది అని చెప్పి చిన్నగా ఇద్దరు నవ్వుకుంటారు.

************** డాక్టర్ లోపల ఇందు ఉదయం వరకు మత్తులో ఉంటుంది అని చెప్పినందున ఆమెకు ఉదయం మెలకువ వచ్చేలోపల బయట ఉంటే సరిపోతుందిలే అనుకోని ధైర్యం చేసి ముందుకు నడిచి లోపలికి వెళ్లి తలుపు మూసి చిలుక పెడుతున్న శబ్దం విన్న ఇందు అప్పటివరకు కూర్చొని ఉండగా వెంటనే వెనుక ఉన్న దిండ్లను పక్కకు విసిరేస్తూ కళ్ళు మూసుకొని మత్తులో ఉన్నట్టు కదలకుండా పడుకుండిపోతుంది.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.