జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 250

మహేష్ జీవితం లో అన్ని ఉన్న 18 ఇయర్స్ యువకుడు.అతనికి ఇద్దరు గొప్ప తల్లిదండ్రులు,కొత్త కార్ ,మరియు చదువులో తనకు తానే సాటి.అతనికి ఉన్న ఒకే ఒక కొరత తన జన్మనిచ్చిన తల్లి ని కనుగొంటాడో లేదో అని.

మహేష్ కి తన 10 ఇయర్స్ ఉన్నప్పుడే తెలుసు తన తల్లి తనను వదిలేసి వెళ్ళిపోయింది అని.తన తల్లిదండ్రులు శివ మరియు జానకి కి తెలుసు మహేష్ తల్లి ఎవరు అని మరియు తన తల్లి సమాచారం అంత తమకు తెలిసినది మహేష్ కి ఎప్పుడో చెప్పారు.తన తల్లి పెరు ఇందుప్రియ అని తనకు 18 ఇయర్స్ ఉన్నప్పుడే నిన్ను కన్నదని చెప్పారు.తన తల్లిదండ్రులు రిచేస్ట్ హై క్లాస్ అయినందు వల్ల తమ కూతురు పెళ్లి కాక ముందే బిడ్డకు జన్మ నివ్వడాన్ని ఒప్పుకోకపోయారు. అందువల్ల తన తల్లిదండ్రుల మాటకు భయపడి తన బిడ్డను తనకు ఇష్టం లేకపోయిన గుడి మెట్ల మీద వదిలేసి బాధతో వెనుదిరిగింది.మహేష్ తల్లిదండ్రులు ఆ గుడి పెద్దలు కావడంతో మరియు తమకు పిల్లలు లేకపోవడంతో దేవుడి ప్రసాదంగా భావించి ఇన్నాళ్లకు తమ వ్రతాలు ఫలించినట్టుగా దత్తత చేసుకొని పెంచుకున్నారు. ఇది ఆ నోటా ఈ నోటా ఊరు ఊరంతా ఒక యువతి తన బిడ్డను వదిలేసి వెళ్లిందని ప్రచారం జరగడంతో ఇందుప్రియ బాధతో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయింది.
శివ మరియు జానకి లే తనకు మహేష్ అని పేరు పెట్టి ఏ లోటు లేకుండా పెంచారు. ఆ తరవాత కొన్ని సంవత్సరాలపాపాటుఆ యువతి గురించి వినపడిందే లేదు. మహేష్ తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను చాలా ప్రేమించేవాడు ,ఆరాధించేవాడు, మరియు వారి మాట ప్రకారం నడుచుకొనేవాడు. అయిన ఎంతోకొంత ఒక మూలాన తన కన్న తల్లి గురించి మరియు తనను కలవాలన్న దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తనను ఒకసారి ఎలాగైనా కలిసి తను ఇప్పుడు ఎలా ఉంది ఎం చేస్తుంది వదిలి వెళ్ళిన అప్పటి నుండి ఒక్కసారైనా తన గురించి ఆలోచించింద అని అడగాలని ఉంది. అలాగే తను college కి వెళ్తున్న దాని గురించి అక్కడ అందుకున్న మెడల్స్ గురించి తన తల్లికి చెప్పాలని ఎంతో ఆశగా ఉంది.

మహేష్ ఇంటర్మీడియట్ స్టేట్ 1st తో పాస్ అయ్యి iit రాసి దాని రెసుల్త్ కోసం వైట్ చేస్తూ ఉన్నాడు . ఆ సమ్మర్ లో ఏ పనులు లేకపోవడం వలన ఇదే సరైన టైం అని నిర్ధారించుకొని గోవా లో ఉన్న తన కన్న తల్లిని కలవాలని అనుకొంటాడు. తన తల్లి గోవా లో ఉన్న విషయం ఇంటర్నెట్ ద్వారా ఒకే ఒక ఇందుప్రియ రెడ్డి అనే మహిళ గోవా లో ఉందని కనుగొంటాడు. గోవా లాంటి మహా నగరంలో ఎలాగైనా తన తల్లిని కనుక్కోవవడమే తన ఏకైక కర్తవ్యం.

Are you sure you want to take a road trip alone ? జానకి తన కొడుకుని అడుగుతుంది. Yes అమ్మ నాకు కొన్ని రోజులు అలా బయటకు వెళ్లాలని ఉంది అని చెప్పి రోజు కాంటాక్ట్ లొనే ఉంటానని దైర్యంగా ఉండాలని చెప్పగా , ఏ ఊరికి వెళ్తున్నావ్ అని సిన తన కొడుకుని అడగగా మహేష్ కొద్దిగా సంకోచించి ఇప్పటికి నాకైతే తెలియదు కాని ఖచితంగా మన స్టేట్ వదిలి పెట్టి వేళ్ళను అని జీవితంలో మొదటిసారి తన తల్లిదండ్రులకు అపద్దo చెప్పడంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అలాగైతే కొన్ని ఎక్కువే బట్టలు సర్దుకో ఒకవేళ ఎక్కడైనా చిక్కుకుపోతే అవసరం అవుతాయి. అలాగే అవసరమైన డబ్బును ఇచ్చి తన మీద ఎంత ప్రేమ ఉందొ తెలియచేయడంతో మహేష్. ఒక్కసారిగా తన తల్లిదండ్రులను ఎంత వీలైతే అంత గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేస్తాడు. అది చూసిన జనకికి ఆనంద భాసఫాలు ఆగవు. కొన్ని క్షణాలు తరువాత అందరూ సాధారణ స్థితికి రావడంతో నా దగ్గర అవసరమైన డబ్బు ఉంది మరియు అవసరమైన బట్టలు సర్దుకున్నాను అని చెప్పి త్వరలోనే వస్తానని ప్రయాణం సాగిస్తాడు.

ఇక తన ప్రయాణాన్ని ఒంటరిగా తన సొంత కార్ లో వైజాగ్ నుండి తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే సాగిస్తాడు. అప్పుడే మేల్కొంతున్న సూర్యుడి కిరణాలు వలన ఆకాశం ప్రకాశవంతమైన ఆరంజ్ కలర్ ని సంతరించుకున్నది. సిటీ లో ఉదయమే ట్రాఫిక్ తక్కువగా ఉండడం వలన త్వరగానే NH 16 గుండా ప్రయాణం సాగుతుండగా సుమారు 9 గంటల సమయంలో హైవే పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో ఫుల్ ట్యాంక్ పోయించి పక్కనే ఉన్న చిన్న హోటల్ లో కడుపునిండా breakfast చేసి ఒక 2 లీటర్ కూల్ వాటర్ bottle తీసుకొని హైవే పై 50 km స్పీడ్ తో hyderabad కు ప్రయాణం కొనసాగిస్తాడు .

అలా సాగుతున్న ప్రయాణంలో ఏసీ పెంచి ఒక్కొక్కటే చిన్ననాటి నుండి జరిగిన విషయాలను నెమరు వేసుకుంటూ, తనకు చిన్నతనంలో భయం ఎక్కువగా ఉండేది ఇంటిలో తన తల్లిదండ్రులు ఒక రూమ్ లో మహేష్ తనకు ఇష్టమైన చైల్డ్రెన్స్ రూమ్ లో పడుకొనేవాడు. తన 4 సంవత్సరాల వయసులో అందరూ
భోజనం చేసి వారి రూమ్ లోకి పాడుకుంటూ ఉండగా సడన్ గా బయట పిడుగులు ఉరుములతో తుఫ్ఫాన్ రావడంతో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి శివ మరియు జానకి ల మధ్య ఎగిరి దుప్పటి లోకి దూరి తన అమ్మని గట్టిగా కౌగిలించుకొని వణుకు తు ఉంటే తన తల్లి ఇంకా గట్టిగా తన గుండెలకు అతుక్కుపోయేలా కౌగిలించుకుంది అది చుసిన శివ తనను దగ్గరికి తీసుకొని చందమామ కథలు అన్ని ఒక్కొక్కటే చెప్తూ మహేష్ అణువణువు ధైర్యాన్ని నింపేసారికి ఇక ప్రపంచంలో ఏది తనను భయపెట్టలేదని లేచి తన రూం లోకి వెళ్తుండగా జానకి మహేష్ తలను రెండు చేతులతో తీసుకొని నుదుటి పై ఒక ధైర్యం ముద్దు ను పెట్టి పంపుతుంది ఇక చూసుకో మహేష్ అంతటితో ఒక హీరో ల చేతులు దూరంగా చాపి నడుచుకుంటూ వెళ్లాడాన్ని చూసి శివ జానకి ల ఆనందానికి. అవధులు లేవు, అది గుర్తు చేసుకున్న మహేష్ తనలోథానే పగలబడి నవ్వుకుని i miss u dad and mom అని అనుకొంటూ ప్రయాణం సాగించాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.