జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

నేను గమనించింది ఏంటంటే మీ కళ్ళు, ముఖం మాత్రం మీ తల్లి లాగా , ఇక మీ ఎత్తు , రంగు ,మిగిలిన అన్ని మీ తండ్రి లాగా ఉన్నారు .

సరిగ్గా చెప్పావు చాలా మంది కూడా ఇలానే చెప్పారు.

ఇద్దరు ఆ ఫొటోగ్రాఫ్ ను తదేకంగా చూస్తూ ఉండగా , ఇదే సరైన సమయం అని ఆమె గురించి కొన్ని ప్రశ్నలు మహేష్ అడగాలని అనుకుంటాడు.

నేను ఒకటి అడగనా , మీరు అసలు పెళ్లి చేసుకోలేదు కదా?

అస్సలు లేదు.

కానీ మీకోక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కదా,

ఇందు నవ్వుతూ తల ఊపి ఉండేవాడు కానీ అతడిని ఎప్పుడో మరిచిపోయాను .అని చెప్పేసరికి

ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటుండగా ఆమెకు ఫోన్ కాల్ రావడంతో ,

ఒక్క క్షణం , నువ్వు మిగితా ఫొటోస్ చూస్తూ ఉండు కాల్ మాట్లాడి వస్తాను అని కొద్దిగా దూరం వెళుతుంది.

మహేష్ కాఫీ తాగుతూ ఆల్బమ్ ను తిరిగేస్తుంటే ఇందు ఒక్కసారిగా ఫోన్ లో మాట్లాడుతూ ఏడుస్తూ ఉండేసరికి అది చూసిన మహేష్ హృదయం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.

ఇందు ఫోన్లో నేను ఇంతకుముందే చాలా సార్లు చెప్పాను కదా అమ్మ దయచేసి నా జీవితం లో నుండి దోయిరంగా ఉండమని . ఏది తప్పు ఏది ఒప్పు అని ప్రతిసారి నాకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే నేను ఒక adult ,ఏది సరైనదో ఏది కాదో తెలుసుకొనే జ్ఞానం నాకు ఉంది.

కొద్దిసేపు మౌనం తరువాత ఇందు మాట్లాడుతూ , లేదు నేను కచ్చితంగా చేసుకోను ! దయచేసి నా జీవితాన్ని నా లాగే ఉండనివ్వు అని చెప్పగా ,

అది విన్న మహేష్ , ఇందు చాలా upset చెందిందని , ఎందుకు అలా జరుగుతోందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇందు తల్లి తను చిన్నప్పుడే pregnant అవ్వడం వల్ల అప్పటి నుండి అసహ్యించుకుంటు ఉందేమో అని తనలో తాను అనుకుంటాడు.

నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను , ఇదంతా మనం రేపు కూడా మాట్లాడుకోవచ్చు .good night అమ్మ అని గట్టిగా ఫోన్ పెట్టేసి అలాగే ఏడుస్తూ కంటి లో లారీ నీటిని చేతితో తుడుచుకుంటూ నిలబడిపోతుంది.

అది చేసిన మహేష్ గుండె తరుక్కుపోవడంతో సోఫా లోనుండి లేచి వెళ్లి ఆమె పక్కనే నిలబడి, తన రెండు చేతులను ఆమె భుజాలపై వేసి చిన్నగా నొక్కుతూ ఆమెను మాములు స్థితికి తేవడానికి ప్రయత్నిస్తాడు.

Are you ok now ? నాతో చెప్పొచ్చు కదా ఏమి జరిగిందో అని మహేష్ అడగగా,

మొదట ఆమెకు ఇంకా ఏడుపు వచ్చి నోటి నుండి మాటలు రావడం లేదు.మహేష్ ఒక చేతిని ఆమె తలపై వేసి వెంట్రుకలను నిమురుతూ ఆమెను తనవైపుకు తిప్పుకుని మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అని తన పెదాలతో ఆమె నుదిటిపై వెచ్చని ముద్దు పెట్టి ,ఆమె ఏడుపు ఆపేంతవరకు ఆమె తలను తన గుండెలపై ఆనించి వేచి చూస్తాడు. ఆమె నుండి కారుతున్న కన్నీళ్ల వల్ల మహేష్ టీ షర్ట్ తడిచిపోతోంది.

నన్ను… నన్ను క్షమించు మహేష్ , ఇదంతా నీకు తెలిసేలా చేసినందుకు ,

అదేం లేదు , నాకు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా , నిన్న రాత్రి ఎలా ఎంజాయ్ చేశారో అలాగే ప్రతి రోజు ఉండాలని నా కోరిక.

అది విన్న ఇందు ఆనందంతో ఇంకా ఏడుస్తూ అతన్ని ఇంకా దగ్గరగా అత్తుక్కుపోతుంది. అతడి కౌగిలింతలో ఆమెకు చాలా సౌకర్యంగా , స్వర్గంలా ఉంది.

నేను సంతోషంగా ఉన్నాను లేదు లేదు ,అని కొన్ని సార్లు దీర్ఘన్గా గాలి పీల్చి వదులుతూ అతడి కళ్ళల్లోకి తల ఎత్తి చూస్తూ ఉండగా ,ఏ కళ్ళల్లోకి భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ,

ఏమి జరిగింది ఇందు ? నాకు చెప్పకూడదా? అని మహేష్ అడగగా.
ఫోన్ కాల్ చేసింది మా అమ్మ ,ప్రతిరోజు ఆమె వల్ల upset చెందుతూ ఉంటాను. ఇప్పటికి ఆమె తన జీవితాన్ని ఉద్ధరించాలని అనుకుంటోంది , చాలా సంవత్సరాల తరువాత కూడా నేను ఇప్పటికి జీవితంలో తప్పులు చేస్తానేమో అని ఆమె ఆలోచిస్తోంది. ఎప్పటికి నేను ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదని అనుకుంటోంది.

మహేష్ ఇందు వెంట్రుకలను మరియు ముఖాన్ని స్పర్శిస్తూ, ఎలాంటి తప్పులు? సగటు జీవితంలో అందరూ తప్పులు చేస్తూ పోతుంటారు.

ఇందు సీరియస్ గా ,ఇక తన గురించి అతడితో దాచడం వ్యర్థం అనుకొని ,మహేష్ నుండి దూరంగా జరిగి అటువైపు తిరిగి ,

“నేను ఒక పిల్లవాడికి జన్మనిచ్చాను” అని చెప్పి మౌనంగా ఉండిపోతుంది.

మహేష్ గుటకలు మింగుతూ “ఏమిటి మీరు చెప్పీది”?. ఆమె ముందుకు వెళ్లి నిలబడగా,

ఇందు కంగారుపడుతూ “అవును. చాలా చాలా సంవత్సరాల క్రితం , నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక పిల్లవాన్ని కన్నాను. అతడు ఒక మగ పిల్లవాడు.

అది విన్న వెంటనే మహేష్ చేతులు , కాళ్ళు మరియు మొత్తం శరీరం గడ గడ మని వొణుకుతూ, “ఆ పిల్లవాడు ఏమయ్యాడు?” ఆమె ఏమి నిజం చెప్పబోతోందో అని ఒక్కసారిగా భయపడతాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.